రేపు విడుదల కానున్న టాటా కర్వ్‌ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 5 కీలక విషయాలు!

టాటా కర్వ్ (Tata Curvv) రేపు (ఆగస్టు 07)న మార్కెట్‌లో దేశవ్యాప్తంగా అధికారికంగా విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ముందుగా ఈ కూపే ఎస్‌యూవీ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో ICE-వెర్షన్‌ని మార్కెట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. ముందుగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లను డెలివరీ చేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ కార్లు డీలర్‌షిప్‌లకు చేరుకున్నాయి. మీ దగ్గర్లోని షోరూమ్‌ లేదా ఆన్‌లైన్‌లో మీకు నచ్చిన వెర్షన్‌ని బుక్ చేసుకోవచ్చు. ఈ సరికొత్త కూపే ఎస్‌యూవీకి సంబంధించిన 5 కీలక విషయాలు ఈ కథనంలో..

డిజైన్‌: టాటా కర్వ్ స్టైలింగ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోనే ప్రత్యేకంగా నిలువనుంది. స్లోపింగ్ రూఫ్‌లైన్‌తో ఎస్‌యూవీ-కూపే స్టైలింగ్‌తో వస్తున్న మోడళ్లలో ఇదే మొదటిది కావడం విశేషం. ఫ్రంట్ డిజైన్‌లై బానెట్ చుట్టూ కనెక్టెడ్ LED DRL స్ట్రిప్ ఉంటుంది. దాని కింద హెడ్‌లైట్లను అమర్చారు. ముందు భాగంలోని గ్రిల్‌ పియానో బ్లాక్ ఎలిమెంట్స్‌తో వస్తుంది. బానెట్‌ ముందు చంకీ గ్రిల్‌, టాటా బాడ్జ్‌లతో ఆకట్టుకునేలా ఉంటుంది.

Tata-Curvv-Launch

వీల్‌ఆర్చ్‌లు, రేకు లాంటి డిజైన్‌తో కూడిన 18 అంగుళాల అల్లాయ్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, స్లోయింగ్ రూఫ్‌లైన్ (వంపు) ఇవన్నీ సైడ్‌ డిజైన్‌లో మంచి లుక్‌ని అందిస్తుంది. వెనక భాగంలోని పెద్ద ఎల్ఈడీ లైట్ బార్‌, మధ్యలో టాటా బ్యాడ్జ్‌ అక్కడే బూట్‌ మూత ఉంటుంది. దాని కింద సిల్వర్ కలర్‌లో స్కిడ్ ప్లేట్‌ ఉంది. స్ప్లిట్ రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెనా స్పోర్టీ లుక్‌లో ఉంటాయి.

క్యాబిన్: టాటా కర్వ్ క్యాబిన్‌కి సంబంధించిన వివరాలను టాటా ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. కానీ స్పై షాట్స్ ఇతర లీకైన చిత్రాల ఆధారంగా చూస్తే డ్యాష్ బోర్డ్ నెక్సాన్ మాదిరిగానే రానుంది. ఇక స్టీరింగ్ వీల్ హారియర్‌లో కనిపించే విధంగానే ఉంటుంది. ఆటోమేటిక్ వేరియంట్‌లో ఏసీ కంట్రోల్స్ కోసం సెంట్రల్ టచ్ సెన్సిటివ్ ప్యానెల్స్‌, ల్యాండ్ రోవర్ లాంటి గేర్‌లివర్ ఉండబోతున్నాయి.

Tata-Curvv-Top-5-Things

యాంబియంట్ లైటింగ్ భిన్నంగా ఉంటుంది. ఇది డ్యాష్‌బోర్డ్‌ అంతటా వ్యాపిస్తుంది. ఈ లైటింగ్‌ డోర్ ప్యాడ్లలోకి కూడా వెళుతుంది. క్యాబిన్‌లో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి ప్రీమియం లుక్‌తో తయారు చేసినట్లు టాటా వెల్లడించింది. సీటింగ్‌, ఇతర పొజిషనింగ్స్‌ ప్రయాణికులకు సౌకర్యంగా ఉండనుంది. రేపు క్యాబిన్‌కి సంబంధించి పూర్తి వివరాలు వస్తాయి అంతవరకు వేచి ఉండండి.

ఫీచర్స్ అండ్ సేఫ్టీ: ప్రస్తుతం ఉన్న టాటా కార్ల మాదిరిగానే, కర్వ్ కూడా అనేక ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. ఇందులో వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 12.3 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, పనోరమిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

Tata-Curvv-Features-And-Price

సేఫ్టీ కిట్‌ విషయానికి వస్తే ఇందులో ఆరు ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, 360 డిగ్రీల కెమెరా, ADAS టెక్నాలజీలు ఉన్నాయి. ఈ ఫీచర్లు ప్రయాణికులకు మెరుగైన రక్షణను అందించనుంది. సేఫ్టీలో ఎక్కడా రాజీ లేదని మరోసారి టాటా రుజువు చేయనుంది. అందుకు తగినట్లుగానే ఇంకా అదనపు ఫీచర్లను ఈ ఎస్‌యూవీలో జోడించనున్నారు.

పవర్‌ట్రెయిన్‌: ఈ కర్వ్‌ టాటా సరికొత్త Adaptive Tech Forward Lifestyle Architecture (ATLAS) ప్లాట్‌ఫామ్‌తో రూపొందించింది. టాటా నెక్సాన్‌ మాదిరిగా రెండు ఇంజిన్ ఆప్షన్‌లో అందుబాటులోకి రానుంది. 1.2-లీటర్ T-GDi టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో రానుంది. ఈ రెండు ఇంజిన్లు ప్రామాణికంగా 6-స్పీడ్ మాన్యువల్, టర్బో-పెట్రోల్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో రానున్నాయి. డీజిల్ ఇంజిన్‌లోనూ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందించే అవకాశం ఉంది.

Tata-Curvv-At-Dealorships

ధర & ప్రత్యర్థులు: ఈ కారుని అందరికీ అందుబాటులో ధరలో తీసుకువచ్చే అవకాశం ఉంది. బేస్-స్పెక్ ధర రూ .10.5 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో మార్కెట్‌లోని ఇతర కంపెనీల కార్ల సేల్స్‌ని దెబ్బకొట్టాలని టాటా యోచిస్తోంది. ఇది సిట్రోయెన్ బసాల్ట్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్ వ్యాగన్ టైగన్, గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, ఎంజీ ఆస్టర్ వంటి పేరొందిన కార్లకు గట్టి పోటిని ఇవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 6, 2024, 15:02 [IST]
English summary
Tata curvv debut tomorrow check top 5 things about this new suv
Read more on: #tata motors #new cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+