టాటా కొత్త కారుని ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లి రావచ్చు!
భారతీయ వినియోగదారులలో భారీ అంచనాలను సృష్టించబోతున్న కార్లలో టాటా కర్వ్ ఒకటిగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ అమ్మకాలు ఆగస్టు 7 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఆ కారుకి సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ వెల్లడించనుంది. ముఖ్యంగా ఆ రోజున టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ ధర ఎంత ఉండనుంది? ఇతర స్పెసిఫికేషన్స్ ఇతర కంపెనీలకు చెందిన కార్లకు ఏ మేరకు పోటీని ఇస్తాయో వెల్లడించనున్నారు. అయితే తాజాగా టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ ఆప్షన్ గురించి కొత్త సమాచారం వెళ్లడి అయ్యింది. ఈ కారు ఎంత రేంజ్ అందించనుంది. తదితర అంశాలకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో మీ కోసం..
టాటా కర్వ్ ఈవీ మొత్తం రెండు బ్యాటరీ ఆప్షన్లతో లభిస్తుంది. టాప్-స్పెక్ వేరియంట్లు 55 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీతో నడుస్తుంది. ఫుల్ ఛార్జ్‌పై ఇది 600 కిలోమీటర్ల రేంజ్‌ని అందించనుంది. అంటే హైదరాబాద్ to విజయవాడకు వెళ్లి తిరిగి రావచ్చు అన్నమాట. ఇక దీనిని ఫాస్ట్ ఛార్జింగ్ ఉపయోగించి బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. ఈ బ్యాటరీని ఛార్జ్ చేస్తే కేవలం 10 నిమిషాల్లో 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సమాచారం.

అయితే చౌకైన వేరియంట్లలో ఎలాంటి బ్యాటరీ ఆప్షన్‌ని అందించనున్నారు? దాని రేంజ్ ఎంత? ఇంకా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. ఆగస్టు 7న భారత్‌లో అమ్మకానికి వస్తే పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇక టాటా కర్వ్ ఈవీలో పనోరమిక్ సన్ రూఫ్, లెవల్ 2 ఎడిఎఎస్ సేఫ్టీ ప్యాకేజీ, 360 డిగ్రీల కెమెరా మరియు ఫ్రంట్ వెంటిలేషన్ సీట్లు ఉన్నాయి.
టాటా కర్వ్ ఈవీ భారత మార్కెట్‌లో సుమారు రూ .18 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో టాప్ వేరియంట్ ధరను రూ .24 లక్షలుగా నిర్ణయించే అవకాశం ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలుగా ఉండనున్నాయి. టాటా కర్వ్ ఈవీ డిజైన్ హైలైట్లలో పెద్ద డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, DRL, LEDహెడ్‌లైట్, ఫుల్ లెంత్ LED టెయిల్ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, షార్క్‌ఫిన్ యాంటెనా ఉన్నాయి.

టాటా కర్వ్ జెన్ 2 ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ పవర్ట్రెయిన్ మెరుగైన సామర్థ్యంతో వేగవంతమైన ఛార్జింగ్ వేగాన్ని కలిగి ఉంటుంది. టాటా కర్వ్ ఈవీ బైడీ అటో 3, ఎంజీ ZS ఈవీ, మహీంద్రా XUV 400 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇది రాబోయే హ్యుందాయ్ క్రెటా ఈవీ ఎలక్ట్రిక్ కారుకు కూడా పోటీగా ఉంటుంది.
టాటా మోటార్స్ ఈ కారుని సరసమైన ధరలో తీసుకువస్తే వినియోగదారులను ఆకట్టుకోనుంది. ఈ కారు మార్కెట్‌లోని ఇతర కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. ముఖ్యంగా గత కొన్ని నెలలుగా టాటా కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయి. ఈ కారు విడుదలతో టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలు కాస్త పెరిగే అవకాశం ఉంది. ఈ కారు తక్కువ ధరలో అందుబాటులోకి వస్తే గణనీయమైన పాత్ర పోషిస్తుందని మార్కెట్ నిపుణులు ఆశిస్తున్నారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








