Tata Curvv EV Review Video టాటా కర్వ్ ఈవీ మంచి డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌కి కేరాఫ్ అడ్రస్
టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికిల్స్ లోనే తిరుగులేని పోటీదారుగా ఉండేందుకు మార్కెట్లోకి ప్రవేశించింది. ఇ కారు రెండు భారీ బ్యాటరీలు 45kWh మరియు 55kWh లతో అందుబాటులోకి వస్తుంది. ఈ కారు బ్యాటరీలు మీకు భారీ రేంజ్‌ని అందిస్తాయి. అంతే కాకుండా ఈ కర్వ్ ఈవీ అధునాతన సాంకేతికతతో పాటు సరికొత్త డిజైన్ రూపకల్పనతో మార్కెట్‌లోకి వచ్చింది. ఈ కర్వ్ ఈవీని మా డ్రైవ్స్‌పార్క్ టీమ్ టెస్ట్‌డ్రైవ్‌లో భాగంగా ఫుల్ రివ్యూ చేసింది. దీని డిజైన్, స్పెసిఫికేషన్స్, డ్రైవింగ్ ఇంప్రెషన్స్‌తో సహా వివిధ అంశాలను కింద వీడియోలో అప్‌లోడ్ చేశాము.
దేశంలోనే తొలి ఎస్‌యూవీ కూపే గా కర్వ్ ఈవీ భారతీయ మార్కెట్‌లో విడుదల అయ్యింది. ఈ కారు సాఫ్ట్ లుక్‌ని కలిగి ఉంటుంది. కర్వ్ బాడీ క్లాడింగ్‌పై పియానో బ్లాక్ ఫినిషింగ్‌ని కలిగి ఉంది. సరికొత్త డిజైన్లో ఆకర్షణీయంగా ఉంటుంది. లాంగ్ డ్రైవ్‌కి అనువుగా ఉండేలా ఇందులో 500 లీటర్ల బూట్ స్టోరేజీని సైతం అందించారు. దీనివల్ల ఎటువంటి అసౌకర్యానికి గురవ్వరు.
ఇంటీరియర్‌లో మల్టీ-మూడ్ యాంబియంట్ లైటింగ్ ద్వారా ప్రీమియం అనుభూతిని పొందవచ్చు. ఇందులోని వాయిస్-అసిస్టన్స్ ద్వారా పనోరమిక్ సన్‌రూఫ్‌ని ఆపరేట్ చేయవచ్చు. ఇంకా ఎక్స్‌టీరియర్ డిజైన్‌లతో పాటు ఇంటీరియర్‌లోనూ ఊహించని ఫీచర్లు ఉన్నాయి. ఇందులోని 45kWh వేరియంట్ 150hp పవర్ అవుట్‌పుట్‌ని 215Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. 15A సాకెట్లు, 72kW AC వాల్ బాక్స్‌లు, DC ఫాస్ట్ ఛార్జర్‌లతో పాటు ఇది బై-డైరెక్షనల్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
అంటే వెహికిల్ టు వెహికిల్ (V2V) మరియు వెహికల్-టు-లోడ్ (V2L) ఛార్జింగ్‌కి అనుమతిస్తుంది. మరోవైపు, 55kWh వేరియంట్ 167hp హై పవర్ అవుట్‌పుట్ మరియు 215Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇక 55 kWh వేరియంట్‌ని 70kW ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 40 నిమిషాల్లోనే 10% నుంచి 80% ఛార్జ్ చేయవచ్చు. మెరుగైన పనితీరు అధునాతన సాంకేతికత తోడుతో ఈ కారు మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.



Click it and Unblock the Notifications








