టాటా కొత్త కారులోని ఫీచర్లు మరే కారులోనూ లేవు.. టాటా బ్రాండ్ అంటే మినిమం ఉంటుంది మరీ!
టాటా మోటార్స్ దేశంలోనే తొలి కూపే స్టైల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ నిన్న ఆగస్టు 07 న అధికారికంగా విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీని ఇదే నెల 12 నుంచి టాటా షోరూమ్‌లలో బుకింగ్స్‌కి అందుబాటులో ఉంటుంది. తాజాగా ఈ సరికొత్త టాటా కారులో లేని ఫీచర్లు మరే కారులో లేవు. అలాంటి ఫీచర్లను టాటా అందించింది. విడుదలతోనే భారీ అంచనాలను పెంచేయడంతో దీనిని కొనుగోలు చేసేందుకు టాటా కార్ల అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ కూపే ఎస్‌యూవీలోని ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లపై ఓ లుక్కేద్దాం..
టాటా మోటార్స్ కర్వ్ ఎలక్ట్రిక్ కారును అధికారికంగా విడుదల చేసింది. ఇది తొలి కూపే స్టైల్ ఎస్‌యూవీగా ఉంది. ఈ సెగ్మెంట్‌లో అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉన్న ఎస్‌యూవీగా మార్కెట్‌లో అడుగుపెట్టింది. అధునాతన ఫీచర్లు ఉన్నప్పటికీ ఈ కారు ధరను కేవలం రూ.17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో తీసుకురావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌తో పాటు ICE వెర్షన్‌లోనూ లభించనుంది.

బ్యాటరీ: టాటా కర్వ్‌లో అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో తీసుకువచ్చింది. ఈ కారులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 45 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, 55 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. 55 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో ఇప్పటి వరకు ఈ ధరలో మరే ఇతర కారు అందుబాటులో లేదు.
ఈ కారుకి పోటిగా భావిస్తున్న ఎంజీ జెడ్ఎస్ (MG ZS) 50.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 400 (Mahindra XUV 400) 39.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో పనిచేస్తుంది. వీటన్నింటితో పోలిస్తే టాటా కర్వ్ అధిక బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌ని కలిగి ఉంది.

రేంజ్: టాటా మోటార్స్ మార్కెట్‌లో ఎప్పుడూ తన ప్రత్యర్థుల కంటే ఎక్కువ రేంజ్ అందించే కార్లను అభివృద్ధి చేసింది. ఇందులోని 55 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 585 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అదే మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 456 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఎంజీ జెడ్ఎస్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల రేంజ్‌ని మాత్రమే అందిస్తుంది.
బూట్ స్పేస్: టాటా కర్వ్ ఈ సెగ్మెంట్‌లో అత్యంత విశాలమైన కారుగా ఉంది. ఈ కారులో 500 లీటర్ల బూట్ ఉంది.వెనుక సీటు 60:40 నిష్పత్తిలో విభజించబడింది. ఇందులో 40 శాతం పెంచితే అది 689 లీటర్లకు పెరుగుతుంది. 60 శాతం సీట్లను మడత పెడితే అది 784 లీటర్లు అవుతుంది. రెండు సీట్లను ముడుచుకుంటే 973 లీటర్లు అవుతుంది.

పవర్డ్ డోర్: దీని వెనుక స్పాయిలర్‌తో కనెక్ట్ చేయబడిన LED టెయిల్‌లైట్స్‌తో వస్తుంది. టాటా కర్వ్ వెనుక డోర్ పవర్ డోర్‌గా ఉంటుంది. ఈ సెగ్మెంట్లో ఈ సదుపాయాన్ని అందిస్తున్న తొలి కారు ఇదే కావడం విశేషం. అంతే కాదు దీనికి ఎలక్ట్రానిక్ కంట్రోల్ కూడా ఉంది. కారు కింద కాలు చాపితే వెనుక భాగంలో ఆటోమేటిక్‌గా డోర్ తెరుచుకునేలా దీన్ని డిజైన్ చేశారు.
AVAS టెక్నాలజీ: టాటా కర్వ్‌లో తొలిసారిగా అకౌస్టిక్ వెహికిల్ అలర్ట్ సిస్టం అనే కొత్త టెక్నాలజీని అమర్చారు. కారు గంటకు 20 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో కదులుతున్నప్పుడు పాదచారులు కారుకి దగ్గరగా వస్తే కృత్రిమ శబ్దాలతో అలర్ట్ చేస్తుంది. దీంతో పాదచారులు అప్రమత్తంగా ఉండి రోడ్డుకు దూరంగా వెళ్లేందుకు వీలవుతుంది.

ఇప్పటి వరకు ఈ టెక్నాలజీని విదేశాల్లో తయారైన కార్లకు మాత్రమే ఉపయోగించేవారు. ఇలాంటి టెక్నాలజీని భారత్‌లో ఇన్ స్టాల్ చేయడం ద్వారా టాటా పెద్ద విప్లవం సృష్టించిందనే చెప్పాలి. ప్రభుత్వం ఇంకా అలాంటి టెక్నాలజీని తప్పనిసరి చేయనప్పటికీ, టాటా భద్రత కోసం ఈ టెక్నాలజీని తన కారులో ఇన్‌స్టాల్ చేసింది.


Click it and Unblock the Notifications








