Tata Curvv EV టాటా కర్వ్ ఈవీ విడుదల.. 585 కి.మీ రేంజ్, మైమరపించే ఫీచర్లు!
గత కొన్ని నెలలుగా ఆసక్తి రేపుతున్న టాటా కర్వ్ ఎట్టకేలకు ఈ రోజు విడుదల అయ్యింది. అందరూ ఊహించినట్లుగానే ఈ కారుని మొదటగా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేశారు. ఈ టాటా Curvv EVని రూ. 17.49 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. టాప్ ఎండ్ ధర రూ.రూ. 21.99 లక్షలుగా ఉంది. ఇది క్రియేటివ్, అకాంప్లిష్డ్ మరియు ఎంపవర్డ్ అనే వేరియంట్స్‌లో అందించబడుతుంది. దీనిని రెండు బ్యాటరీ ప్యాక్‌లలో తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. అవి 45 kWh (మిడిల్ రేంజ్) మరియు 55 kWh (లాంగ్ రేంజ్)గా ఉన్నాయి. ఇవి వరుసగా 502 నుంచి 585 కిమీ వరకు రేంజ్‌ని అందించగలవు.
టాటా కర్వ్ ఈవీ 1.2C ఛార్జింగ్ రేట్‌ను కలిగి ఉంది. దీని సహాయంతో కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 150 కిమీల రేంజ్ వరకు ప్రయాణించగలదు. ఇందులోని 123 kWh మోటారు కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 వేగాన్ని అందుకుంటుంది. అంతే కాకుండా ఇది గంటకు 160 కి.మీ టాప్ స్పీడ్‌తో ప్రయాణిస్తుంది.

ఇక దీని ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, టచ్ క్లైమేట్ కంట్రోల్‌తో డాష్‌బోర్డ్ ఉంది. దీని ఇంటీరియర్ వైట్ మరియు గ్రే కలర్‌తో వస్తుంది. ఇందులో 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్ కలదు. ఇక టాప్ వేరియంట్‌లో లెథెరెట్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు 320W JBL సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. దీనిలో 500-లీటర్ల భారీ బూట్ స్పేస్‌ని కలిగి ఉంది.
ఇందులో 6-వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, వెనక 2-పొజిషన్ రిక్లైన్ సీట్ కలదు. ఈ కారు ఎకో, సిటీ మరియు స్పోర్ట్ డ్రైవ్ మోడ్‌లతో వస్తుంది. ఇది V2V, V2L ఛార్జింగ్‌ను ఆప్షన్‌ని కలిగి ఉంది. మొదట ఈ ఆప్షన్ Nexon EVలో అందించబడింది. Tata Curvv EV 18-ఇంచెస్ వీల్, 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 450 mm వాటర్ వేడింగ్ డెప్త్ ఉన్నాయి.

ఈ కారు సేఫ్టీ విషయానికి వస్తే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్‌తో పాటు అనేక ఇతర ఫీచర్లతో ప్రామాణికంగా అందిస్తుంది. ఇందులో లెవల్ అడాస్ టెక్నాలజీని పొందుపరిచారు. Tata Curvv EVలో మరో చెప్పుకోదగ్గ సేఫ్టీ ఫీచర్ ఉంది. అదే అలర్ట్ సౌండ్ సిస్టమ్. ఇది కారుకి ఎవరైన కారుకి దగ్గరకు వస్తే వారిని అప్రమత్తం చేసే శబ్దాలను చేస్తుంది. ఇది పాదచారులకు అవగాహన కల్పించడంలో సహాయపడుతుంది.
ఇక టాటా కర్వ్ టాటా Curvv ICE ఇంజిన్ ఆప్షన్‌లోకి అందుబాటులో ఉండనుంది. ఇందులో రెండు పెట్రోల్ మరియు ఒక డీజిల్ ఇంజిన్ ఆప్షన్ ఉన్నాయి. వీటిలో కొత్త హైపెరియన్ (Hyperion) GDi ఇంజిన్ కూడా ఉంది. ఇది 125 hp మరియు 225 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్ రెవోట్రాన్ ఇంజిన్‌తో పాటు అప్‌డేటెడ్ 1.5-లీటర్ క్రయోటెక్ డీజిల్ యూనిట్‌ని అందించారు.
పైన తెలిపిన రెండు ఇంజిన్‌లు నెక్సాన్ నుంచి తీసుకోబడ్డాయి. 1.2 పెట్రోల్ ఇంజిన్ 120 hp మరియు 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే కొత్త క్రియోటెక్ ఇంజిన్ 115 hp మరియు 260 Nm గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇక ఈ ICE వెర్షన్‌ల ధరలు సెప్టెంబర్ 2 న వెల్లడిచనున్నట్లు టాటా పేర్కొంది. ఈ లాంచ్‌లో పూర్తిగా టాటా కర్వ్ ఈవీ గురించి వెల్లడించింది.
ఇటీవలె టాటా నెక్సాన్ EV మరియు పంచ్ EV రెండూ భారత్ NCAP నుండి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌లను పొందాయి. ఈ ట్రాక్ రికార్డ్‌ను బట్టి చూస్తే ఈTata Curvv కూడా సేఫ్టీలో అదే సీన్‌ని రిపీట్ చేస్తుందని భావిస్తున్నాం. టాటా మోటార్స్ ఇటీవల EV వ్యాపారంలో కీలక మైలురాయిని చేరుకుంది. దేశంలో మొత్తం 1.5 లక్షల ఈవీ యూనిట్లను ఆ సంస్థ విక్రయించింది.


Click it and Unblock the Notifications