కేవలం 9 రోజుల్లో 3455 మంది ఈ కారుని కొనేశారు.. ఈ ఆల్-రౌండర్ కారు ఏంటో తెలుసా?
ఆగస్టు 07న టాటా మోటార్స్ తన ప్రీమియం ఎస్‌యూవీ కర్వ్ ఈవీని (Tata Curvv EV) విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. 17.49 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కారు డెలివరీలు ఆగస్టు 23 నుంచే ప్రారంభం అయ్యాయి. కంపెనీ విడుదల చేసిన తొలి తొమ్మిది రోజుల డేటా ప్రకారం 3,455 మంది కస్టమర్లు ఈ కారుని కొనుగోలు చేశారు. అంటే రోజుకి 383 చొప్పున ఈ సరికొత్త కారుని కొనుగోలు చేస్తున్నారు. ఈ సంఖ్య చాలా ఎక్కువే అని చెప్పాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఈ టాటా కర్వ్ ఈవీ అద్భుతమైన ఎక్ట్సీరియర్ డిజైన్‌ని కలిగి ఉంది. దీని ఫ్రంట్‌లో స్మూత్ LED హెడ్‌ల్యాంప్స్, LED DRLs ఉన్నాయి. వెనుక భాగంలో యానిమేషన్స్‌తో జత చేసిన టెయిల్ ల్యాంప్స్ ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా కవర్డ్ ఫ్రంట్ గ్రిల్, స్లోయింగ్ రూఫ్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, వీల్‌ఆర్చ్‌లపై పియానో బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

ఇక దీని పై భాగంలో షార్క్‌ఫిన్ యాంటెనా, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్, సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి. ఇది వీటి పై భాగాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ సైడ్ ప్రొఫైల్ అందంగా కనిపిస్తుంది. కర్వ్ ఈవీ ప్రిస్టీన్ వైట్, ఫ్లేమ్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్యూర్ గ్రే, వర్చువల్ సన్‌రైజ్ వంటి ఐదు మోనోటోన్ కలర్స్‌లో లభిస్తుంది.
ఇక దీని ఇంటీరియర్ సరికొత్తగా ఉంటుంది. దీనిలోని విలాసవంతమైన క్యాబిన్ కలదు. ఇందులో కొత్త ఇన్ఫర్మేషన్ సిస్టమ్, కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. డ్యూయల్ టోన్ డ్యాష్ బోర్డు, వాయిస్ ఆధారిత పనోరమిక్ సన్‌రూఫ్, మూడ్ లైటింగ్, టచ్ అండ్ టాకిల్ ప్యానెల్‌పై క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, ఫోర్ స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ కర్వ్ ఈవీ 12.3 ఇంచెస్ ఫ్లోటింగ్ సినిమా డిజిటల్ స్క్రీన్, 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే యూనిట్ ఉన్నాయి. సీటింగ్ అరేంజ్‌మెంట్‌లో వెంటిలేటెడ్ సీట్లతో కూడిన సిక్స్ వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, డ్రైవర్ సైడ్ సీట్లు, టూ లెవల్ రియర్ సీట్ రిక్లైన్ ఫంక్షన్ ఉన్నాయి.
టాటా కార్లు సేఫ్టీకి పెట్టింది పేరు. దీంతో ఈ కారు కూడా భారీ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది. ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీల కెమెరా, అన్ని వీల్స్‌కి డిస్క్ బ్రేక్స్, ESP విత్ i-VBAC (intelligent Vacuum-less Boost and Active Control), డ్రైవర్ అలర్ట్ పరికరం, ESP, హిల్ క్లైంబింగ్ , డీసెంట్ కంట్రోల్ ఉన్నాయి.

ఈ కారులో వీటితో పాటు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఫ్రంట్ కొలిషన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి ఇతర ఏడీఏఎస్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సేఫ్టీ ప్యాకేజీలో ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, ఫ్రంట్ ఫాగ్ లైటింగ్ ఉన్నాయి.
ఇక ఈ కారుని కంపెనీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌లో లాంచ్ చేసింది. ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 585 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని టాటా మోటార్స్ పేర్కొంది. కర్వ్ ఈవీ 190 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంటుంది. ఇందులో 500 లీటర్ల బూట్ స్పేస్ కలదు. ఇందులో అదనంగా ఫ్రంట్ ట్రంక్ సదుపాయం ఉంది. ఇది అదనంగా 35 లీటర్ల స్పేస్‌ని అందిస్తుంది.
ఇందులో ఎకో, సిటీ, స్పోర్ట్ వంటి డ్రైవింగ్ మోడ్స్‌ని కలిగి ఉంది. ఇక ఇఁదులో అదనపు సౌలభ్యం కోసం V2V (వెహికిల్ టు వెహికిల్) ఛార్జింగ్, V2L (వెహికిల్ టు లోడ్) టెక్నాలజీతో వస్తుంది. ఆగస్టులో భారీ అమ్మకాలు ఇక రాబోయే పండుగ సీజన్ అమ్మకాలతో సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








