అదిరిపోయే డిజైన్‌లో వచ్చిన టాటా కొత్త కారు.. నెక్సాన్‌కి ఎక్కువ, హారియర్‌కి తక్కువ!

టాటా కర్వ్ (Tat Curvv) భారీ అంచనాల మధ్య లాంచ్ అయ్యింది. ఇది నెక్సాన్‌ కారు మాదిరిగానే పెట్రోల్/డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో మార్కెట్‌లో టాటా మోటార్స్ విడుదల చేసింది. కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కారు కూడా అమ్మకానికి ఉంది. అయితే ప్రస్తుతానికి టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ధరలను మాత్రమే టాటా ప్రకటించింది. ICE వెర్షన్‌లను సెప్టెంబర్‌ 02 న ధరను ప్రకటించనున్నారు. ఈ కార్లకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో మీ కోసం..

ముందుగా టాటా కర్వ్ అనేది కూపే స్టైల్ ఎస్‌యూవీగా విడుదల అయ్యింది. ఓ ఎస్‌యూవీ కూపే స్టైల్‌లో రావడం ఇదే తొలిసారి కాడం విశేషం. దీనివల్ల కారు వెనుక భాగం అదనపు స్లోపింగ్‌ని కలిగి ఉంటుంది. ఇది డిజైన్‌లోనూ ప్రస్తుతం అమ్మకానికి ఉన్న టాటా నెక్సాన్ ఆధారంగా రూపొందించబడింది. అదేవిధంగా ఈ కారు ఫ్రంట్ ఎండ్ టాటా హారియర్‌ని పోలి ఉంటుంది.

Tata-Curvv-EV-Launch

అయితే టాటా కంటే ఇది నెక్సాన్ పరిమాణంలో కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఈ ఎస్‌యూవీలో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో అందించారు. చక్రం సులువుగా తిరిగేలా వీల్‌ ఆర్చ్‌లను పెద్ద డిజైన్‌లో అందించారు. స్పాయిలర్‌ని కారు వెనుక భాగంలోని పైకప్పుకు కలిపారు. కొన్నేళ్ల క్రితం ప్రదర్శించిన కర్వ్ కాన్సెప్ట్‌లో స్పాయిలర్‌ని రెండుగా విభజించారు. కానీ ఇప్పుడు కలిపి అందించారు.

డోర్ హ్యాండిల్స్ కారు బాడీ నుంచి కనిపించకుండా ఫ్లష్ టైప్‌లో అందించారు. ముందు భాగంలో మాదిరిగానే, వెనుక కూడా లైట్ బార్ ద్వారా కనెక్ట్ చేయబడిన ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లు ఉన్నాయి. వెనుక బూట్ డోర్ మధ్యలో తెరవడానికి/మూసివేయడానికి ఒక బటన్ ఉంది. వెనక డోర్‌ని డైరెక్షన్స్‌తో కూడా కంట్రోల్ చేయవచ్చని టాటా తెలిపింది. బయటి డిజైన్‌ అచ్చం నెక్సాన్‌ని పోలినట్లు ఉంటుంది.

Tata-Curvv-ICE

టాటా కర్వ్ స్మార్ట్, ప్యూర్+, క్రియేటివ్, క్రియేటివ్+ S, అసెంబుల్డ్ S మరియు అసెంబుల్డ్ + A అనే ఆరు వేరియంట్లలో లభిస్తుంది. సెప్టెంబర్ 2న ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధరలను ప్రకటించనున్నారు. ఎక్స్‌టీరియర్ మాదిరిగానే, కర్వ్ ఇంటీరియర్ చాలా చోట్ల టాటా నెక్సాన్ మరియు నెక్సాన్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లను గుర్తు చేస్తుంది.

కొత్త కర్వ్ క్యాబిన్ డ్యూయల్-టోన్ కలర్‌లో లభిస్తుంది. బ్లాక్‌ పాటు గ్రే కలర్‌లో ఇంటీరియర్‌ డిజైన్ చేయబడింది. డ్యాష్ బోర్డ్, సెంటర్ కన్సోల్, 4-స్పోక్ స్టీరింగ్ వీల్ అన్నీ టాటా హారియర్ మరియు సఫారీ మాదిరిగానే ఉన్నాయి. టాటా కర్వ్ లోపలి భాగంలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్‌, ఫోల్డబుల్ రియర్ సీట్లు మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి.

టాటా కర్వ్ లోని సేఫ్టీ ఫీచర్లు ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, లెవల్ -2 ఏడీఎస్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 4 వీల్‌ డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, ఆటో-హోల్డ్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉన్నాయి. రోడ్డుపై వెళ్లే పాదచారులు ఈ కారు దగ్గర్లోకి వస్తే వారిని ప్రత్యేక సౌండ్‌తో అలర్ట్‌ చేస్తుంది.

ఇందులో రెండు పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్స్‌తో రానుంది. ఇందులో కొత్త హైపెరియన్ (Hyperion) GDi ఇంజిన్‌ ఉంది. ఇది 125 hp వద్ద 225 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్ రెవోట్రాన్ ఇంజిన్‌తో పాటు అప్‌డేటెడ్‌ 1.5-లీటర్ క్రయోటెక్ డీజిల్ యూనిట్‌ని కూడా ఉంది. ఈ రెండు ఇంజిన్‌లు నెక్సాన్ నుంచి తీసుకోబడ్డాయి.

1.2 పెట్రోల్‌ ఇంజిన్‌ 120 hp మరియు 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త క్రియోటెక్ ఇంజిన్‌ 115 hp మరియు 260 Nm గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది 6 స్పీడ్‌ మాన్యూవల్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో వస్తుంది. డీజిల్ ఇంజిన్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ని పొందిన మొదటిది కారుగా కర్వ్ నిలిచింది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 7, 2024, 19:20 [IST]
English summary
Tata curvv ice unveiled check specifications design and price announcement date
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+