గుడ్ న్యూస్.. పండుగ సీజన్‌కు టాటా కర్వ్ సిద్ధం!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టాటా కర్వ్ (Tata Curvv) ఈ ఏడాది మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంటుందని సమాచారం. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కొత్త 'టాటా కర్వ్' గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో మీ కోసం..

టాటా మోటార్స్ తన కర్వ్ ఎలక్ట్రిక్ కారును 2024 సెప్టెంబర్ నాటికి మార్కెట్లో విక్రయించనున్నట్లు సమాచారం. 2024 ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించిన ఈ కారు ఎంతోమంది వాహన ప్రేమికుల హృదయాలను కొల్లగొట్టింది. అయితే ఈ కారు లాంచ్ ఎప్పుడనేది ఖచ్చితంగా వెల్లడికావడం లేదు. మొత్తానికి ఈ ఏడాది ఫెస్టివల్ సీజన్ నాటికి భారతీయ రోడ్ల మీద ఈ కారు తిరిగే అవకాశం ఉంది.

Tata Curvv

కంపెనీ మొదటి టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేస్థుంది, ఆ తరువాత డీజిల్ మరియు పెట్రోల్ కార్లను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. కొత్త టాటా కర్వ్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆధునికంగా ఉంటుంది. అయితే చూడటానికి కొంత వరకు టాటా నెక్సాన్ కారును పోలి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ SUV ఉత్పత్తి 2024 జూన్ నెలలో ఉండే అవకాశం ఉంటుంది.

టాటా కర్వ్ ఈవీ సెప్టెంబర్ 2024లో లాంచ్ అయిన తరువాత ఈ ఏడాది చివరి నాటికి లేదా 2025 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో కర్వ్ ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసి ఆ విభాగంలో మరింత గొప్ప ఆధిపత్యం చెలాయించడానికి సిద్ధమవుతోంది. ఇదే జరిగితే టాటా నెక్సాన్ మరియు టాటా పంచ్ ఈవీ కంటే కర్వ్ ఈవీ ముందంజలో దూసుకెళ్తుంది.

Tata Curvv Front Design

టాటా కర్వ్ SUVని కంపెనీ హ్యుందాయ్ క్రెటా ఈవీ మరియు మారుతి ఈవీఎక్స్ కంటే ముందుగా భారతీయ మార్కెట్లో లాంచ్ చేయాలని యోచిస్తోంది. కాబట్టి వీలైనంత తొందరగా కర్వ్ ఈవీ లాంచ్ అవుతుందని సమాచారం. దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా ఈ కారు ఉత్పత్తి మరియు లాంచ్ ఆలస్యమైందని కంపెనీ పేర్కొంది. జూన్ 4న ఎన్నికలు ఫలితాలు వెల్లడవుతాయి. ఆ తరువాత కంపెనీ దీనిని లాంచ్ చేస్తుందని భావిస్తున్నాము.

టాటా కర్వ్ ఈవీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇది నెక్సాన్ ఈవీ కంటే 313 మిమీ ఎక్కువ పొడవుగ ఉంటుంది. వీల్‌బేస్ కూడా 62 మిమీ వరకు పెరుగుతుంది. 2024 టాటా కర్వ్ చూడటానికి నెక్సాన్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఆధునిక అప్డేట్స్ గమనించవచ్చు. ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా వరకు నెక్సాన్ మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.

Tata Curvv Side Design

2024 టాటా కర్వ్ 1.2-లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుందని సమాచారం. ఇది 125 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జతచేయబడి ఉంటుంది. డీజిల్ వెర్షన్ 1.5-లీటర్ ఫోర్-సిలిండర్ ఇంజిన్ పొందే అవకాశం ఉంది. ఇందులో CNG మోడల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కారు 450-500 కిమీ రేంజ్ అందించే బ్యాటరీ ప్యాక్ పొందనున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 15, 2024, 15:23 [IST]
English summary
Tata curvv launch this festive season in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+