Tata Curvv ICE: పెట్రోల్‌, డీజీల్‌ వెర్షన్‌లో టాటా కర్వ్‌ విడుదల.. ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు

పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌ ఆప్షన్లతో టాటా కర్వ్ ఇప్పుడు భారతదేశంలో అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది. టాటా కర్వ్ ఈవీని లాంచ్‌ చేసిన నెల రోజుల తర్వాత కర్వ్ ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) కార్లను మార్కెట్‌లోకి టాటా ప్రవేశపెట్టింది. టాటా ఎలక్ట్రిక్ కర్వ్‌ ఈవీ ధర రూ. 17.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లాంచ్‌ చేసింది. ఇప్పుడు ICE వెహికిల్స్‌ని అంతకంటే భారీ తక్కువ ధరలో విడుదల చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సరికొత్త కార్ల బుకింగ్స్‌ నేటి నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 12 నుంచి డెలివరీల ప్రారంభం కానున్నాయి.

ఈ టాటా కర్వ్ ఐసీఈ వెర్షన్స్ మొత్తం ఎనిమిది వేరియంట్లు, ఆరు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి. మూడు ఇంజిన్‌ ఆప్షన్స్‌, మల్టిపుల్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. టాటా కర్వ్ పెట్రోల్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 9.99 లక్షలుగా ఉంది. అలాగే డీజిల్ వేరియంట్ ధరలు రూ. 11.49 లక్షలుగా ఉన్నాయి. నవంబర్‌లో ధరలు పెరుగనున్నాయి. ఇవి కేవలం ప్రారంభ ఆఫర్‌ ధరలు మాత్రమే.

Tata Curvv ICE Versions Launched at Rs 9 99 lakhs

టాటా కర్వ్ డిజైన్‌: టాటా కర్వ్ ఐసీఈ డిజైన్ దాదాపు టాటా కర్వ్ ఈవీని పోలి ఉంటుంది. ఎయిర్ వెంట్స్‌తో పాటు ఫ్రంట్ గ్రిల్స్‌లో కొన్ని తేడాలు ఉన్నాయి. కర్వ్ ICE కూడా కూపే ఎస్‌యూవీ డిజైన్‌లో అందుబాటులో ఉంటుంది. ఆ డిజైన్‌తో ICE వెర్షన్‌లో విడుదలైన తొలి కారుగా సిట్రోయిన్ బసాల్ట్ కూపే ఎస్‌యూవీ నిలిచింది.

టాటా కర్వ్ ఇంటీరియర్ ఫీచర్లు: టాటా కర్వ్‌ ఈవీలో ఉండే ఫీచర్లు కూడా కర్వ్ ICEలోనూ అందిచారు. ఇందులో టాటా హారియర్‌లో మాదిరిగానే 4-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంది. కూపే ఎస్‌యూవీ డ్యాష్ బోర్డ్ పొడవునా యాంబియంట్ లైటింగ్ స్ట్రిప్‌ని కలిగి ఉంటుంది. ఇది ఇంటీరియర్‌కి ప్రీమియం లుక్‌తో పాటు మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది.

Curvv Revotron Turbo Petrol MT Hyperion GDi MT Kyrojet Diesel MT
Smart ₹9.99 Lakh ₹11.49 Lakh
Pure+ ₹10.99 Lakh ₹12.49 Lakh
Creative ₹12.19 Lakh ₹13.69 Lakh
Creative S ₹12.69 Lakh ₹13.99 Lakh ₹14.19 Lakh
Creative+ S ₹13.69 Lakh ₹14.99 Lakh ₹15.19 Lakh
Accomplished S ₹14.69 Lakh ₹15.99 Lakh ₹16.19 Lakh
Accomplished+ A ₹17.49 Lakh ₹17.69 Lakh
Revotron Turbo Petrol DCA ₹12.49 Lakh
Hyperion GDi DCA ₹16.49 Lakh
Kryojet Diesel DCA ₹13.99 Lakh

ఇక ఇందులో ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. 9 స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్‌ని గమనించవచ్చు. సేఫ్టీ ఫీచర్లలో స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ ఉన్నాయి. హై వేరియంట్స్‌లలో ఏడీఏఎస్ ఫీచర్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టైర్‌ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంటాయి.

టాటా కర్వ్ ఇంజిన్‌ ఆప్షన్స్‌: ముందే తెలిపిన విధంగా టాటా కర్వ్ ICE మూడు ఇంజిన్ ఆప్షన్స్‌తో వస్తుంది. రెండు టర్బో పెట్రోల్, ఒక డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో తీసుకువచ్చారు. ఇందులోని 1.2-లీటర్ టర్బో పెట్రోల్ 118bhp పవర్, 170 nm గరిష్ట టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 1.2-లీటర్ T-GDi టర్బో పెట్రోల్ 123 bhp పవర్, 225 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Tata Curvv ICE Version

ఇక 1.5-లీటర్ డీజల్ ఇంజిన్ గరిష్టంగా 113bhp పవర్, 260 nm గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ మూడు ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడతాయి. టాటా కర్వ్ ఐసీఈ సెగ్మెంట్‌లో డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ని కలిగి ఉన్న తొలి డీజిల్ కారుగా కర్వ్‌ నిలిచింది.

టాటా కర్వ్ ప్రత్యర్థులు: పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో అందుబాటులో ఉన్న ఈ టాటా కర్వ్‌ మార్కెట్‌లో సిట్రోయిన్ బసాల్ట్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్, ఎంజీ ఆస్టర్, స్కోడా కుషాక్, టయోటా హైరైడర్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్ కార్లకు గట్టి పోటీని ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, September 2, 2024, 15:34 [IST]
English summary
Tata curvv petrol and diesel versions launched in india prices start at rs 9 99 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+