Tata Curvv: షోరూమ్‌లకు చేరుకున్న టాటా కర్వ్.. విడుదలకు ముందే వైరల్ అవుతున్న కొత్త కారు వీడియో
భారీ అంచనాల మధ్య కర్వ్ కూపే ఎస్‌యూవీని (Tata Curvv) టాటా మోటార్స్ లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. రేపు (ఆగస్టు 7) లాంచ్ కానున్న టాటా కర్వ్ విడుదలకు ముందే డీలర్‌షిప్ షోరూలకు చేరుకోవడం ప్రారంభించింది. టాటా కర్వ్ రహస్యంగా డీలర్‌షిప్ షోరూమ్‌కి వెళ్తున్న సమయంలో తీసిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ వీడియో ఇప్పుడ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
టాటా మోటార్స్ నెక్సాన్ మరియు పంచ్ తర్వాత భారత మార్కెట్‌లో మరోసారి సత్తా చాటేందుకు కొత్త కూపే ఎస్‌యూవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కూపే తరహా ఎస్‌యూవీ భారత్‌లో విడుదల కావడం ఇదే తొలిసారి. ఈ టాటా కర్వ్ ఇతర ఎస్‌యూవీలతో పోల్చితే భిన్నమైన డిజైన్‌ని కలిగి ఉండనుంది. కారులో అందించే ఫీచర్లను ఇప్పటికే టాటా మోటార్స్ వెల్లడించింది. ఇక రేపు కేవలం దాని ధరలను ప్రకటించడమే మిగిలింది.

రేపు(ఆగస్టు 7న) కర్వ్ ధరలను ప్రకటించనున్నారు. ఈ కారు విడుదలకు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండగా, టాటా కర్వ్ కార్లను డీలర్‌షిప్ షోరూమ్‌లకు చేర్చే ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన వీడియో ప్రకారం టాటా కర్వ్‌ని పూర్తిగా వైట్ కవర్లతో కప్పి వేశారు. దాని లుక్‌ని షోరూమ్‌లకు చేర్చే క్రమంలో కనబడకుండా ఉండేందుకు ఈ విధంగా కవర్ చేశారు.
సాధారణంగా ఇలాంటి కార్లకు రెడ్ కలర్ నంబర్ ప్లేట్లను అమర్చుతారు. అయితే, ఈ ప్రత్యేక కర్వ్ కారులో అలాంటి నంబర్ ప్లేట్ లేదు. ఈ చిత్రంలో మనం టాటా కర్వ్ కారు వెనుక భాగాన్ని మాత్రమే చూడగలము. కారు వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ లైట్లను కనెక్ట్ చేస్తూ వెడల్పాటి రెడ్ లైట్ బార్‌ని చూడవచ్చు. ఇది కారు వెనక భాగానికి క్లాసీ లుక్‌ని అందించనుంది.

కారు వెనుక భాగంలో సిల్వర్ స్కిడ్ ప్లేట్, పైకప్పుపై అమర్చిన స్పాయిలర్ ఉన్నాయి. అల్లాయ్ వీల్స్ స్టైలిష్‌గా కనిపిస్తాయి. వీల్స్ సులభంగా తిరిగేందుకు తగినంత స్థలం కోసం వీల్‌ఆర్చ్‌లను చతురస్రాకారంలో డిజైన్ చేశారు. పైకప్పులో పూర్తిగా బ్లాక్ కోటింగ్‌తో పెయింట్ చేసి ఉంది. ఇది డ్యూయల్ టోన్ కలర్స్‌తో రోడ్లపై మరింత అందంగా కనిపించనుంది.
ఎక్ట్సీరియర్‌కి అనుగుణంగా కొత్త కర్వ్ కారు ఇంటీరియర్‌ని సైతం అత్యాధునికంగా కనిపించేలా డిజైన్ చేశారు. డ్యాష్ బోర్డు లోపల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 2-స్పోక్ స్టీరింగ్ వీల్ పై మెరుస్తూ కనిపించే టాటా లోగో, కొత్త HVAC కంట్రోల్ ప్యానెల్, వైర్‌లెస్ ఛార్జింగ్, 360 డిగ్రీల కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి.

కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కారును పెట్రోల్/డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలోనే కాకుండా ఎలక్ట్రిక్ వెర్షన్లో కూడా విడుదల చేయాలని టాటా మోటార్స్ యోచిస్తోంది. చిత్రంలో ఉన్న కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ కారు కాదా అనేది తెలియరాలేదు. టాటా కర్వ్‌లోని ఇంజిన్ ఆప్షన్స్ కూడా ఇంకా కంపెనీ ప్రకటించలేదు. అయితే ఇది నెక్సాన్‌లో వినియోగించే 3 ఇంజిన్ ఆప్షన్లతో అందించబడుతుందని భావిస్తున్నారు.
టాటా నెక్సాన్‌లో మాదిరిగానే 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ టర్బోఛార్జ్డ్ డీజిల్ ఇంజిన్ మరియు 1.2-లీటర్ టీ-GDi పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్‌తో ఈ కారును అందించే అవకాశం ఉంది. ఇక ఈ కారు నేరుగా సిట్రోయిన్ బసాల్ట్, ఎంజీ ఆస్టర్, హ్యందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications








