దేశీయ దిగ్గజం సరికొత్త కారు.. ఇక ప్రత్యర్థులు నిలువతరమా!

దేశీయ దిగ్గజం మరియు ప్రముఖ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్' (Tata Motors) సుదీర్గ నిరీక్షణ తరువాత ఎట్టకేలకు 'కర్వ్' (Curvv) ఎస్‌యూవీని ఆవిష్కరించింది. కంపెనీ ప్రవేశపెట్టిన ఈ కొత్త కారు సరికొత్త డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించబడే విధంగా ఉంది. సంస్థ ఈ ఎస్‌యూవీని వచ్చే నెల 7న.. అంటే ఆగష్టు 7న భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇది పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ కానున్నట్లు సమాచారం. త్వరలో లాంచ్ కానున్న సరికొత్త టాటా కర్వ్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

టాటా మోటార్స్ యొక్క కర్వ్ అనేది భారతదేశపు మొత్తం మొదటి ఎస్‌యూవీ కూపే అని తెలుస్తోంది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. అయితే కంపెనీ మొదటి దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనుంది. ఆ తరువాత ఐసీఈ వెర్షన్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఆ తరువాత ఫ్యూయెల్ వెర్షన్స్ లాంచ్ అవుతాయని భావిస్తున్నాము. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Tata Curvv

టాటా కర్వ్ ఆకర్షణీయమైన డిజైన్, అద్భుతమైన ప్రాక్టికాలిటీ మరియు అత్యుత్తమ పనితీరు యొక్క సమ్మేళనం అని తెలుస్తోంది. ఈ కారు బాడీ స్టైల్ ఇతర మిడ్ సైజ్ ఎస్‌యూవీల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది రెండు కొత్త కలర్ షేడ్స్‌లో ప్రారంభమవుతుంది. అవి వర్చువల్ సన్‌రైజ్ మరియు గోల్డ్ ఎసెన్స్. ఇది వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది.

డిజైన్ విషయానికి వస్తే.. టాటా కర్వ్ స్ప్లిట్ హెడ్‌లైట్ పొందుతుంది. ఇది నెక్సాన్ ఈవీని తలపిస్తుంది. డే టైమ్ రన్నింగ్ లైట్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. ముందు బంపర్‌లోని హెడ్‌లైట్ క్లస్టర్‌లు బ్లాక్ ప్లాస్టిక్‌తో అనుసంధానించబడి ఉన్నాయి. ఛార్జింగ్ పోస్ట్ టాటా లోగో కింద ఉంది. 20 ఇంచెస్ వీల్స్ ఇక్కడ చూడవచ్చు. మొత్తం మీద ఈ కారు డిజైన్ చూపరులను ఫిదా చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Tata Curvv EV

టాటా కర్వ్ ఈవీ అనేది ఆక్టి.ఈవీ ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించబడిన బ్రాండ్ యొక్క రెండో మోడల్. కాబట్టి ఇది పరిమాణం పరంగా కూడా ఉత్తమంగా ఉంటుంది. బూట్ స్పేస్ కూడా అనుకూలంగానే ఉంటుంది. ఈ కారులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్స్ డిస్‌ప్లే మరియు పనోరమిక్ సన్‌రూఫ్‌ వంటి వాటిని పొందుతుందని తెలుస్తోంది.

టాటా మోటార్స్ తన కర్వ్ ఐసీఈ మోడల్ కోసం 1.2 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్లను అందించనుంది. కాగా ఎలక్ట్రిక్ వెర్షన్ 50 - 60 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుందని సమాచారం. ఇది ఒక ఫుల్ చార్జితో ఏకంగా 500 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు లాంచ్ సమయంలో అధికారికంగా వెల్లడవుతాయి.

Tata Curvv Rear Profile

త్వరలో లాంచ్ కానున్న కొత్త టాటా కర్వ్ దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ బసాల్ట్, హ్యుందాయ్ క్రెటా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండనుంది. అయితే బసాల్ట్ కూడా వచ్చే నెలలోనే లాంచ్ అవుతుంది. కాబట్టి అమ్మకాల పరంగా టాటా కర్వ్ గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం. కానీ కర్వ్ అనేది ప్రజలకు నమ్మికయి టాటా బ్రాండ్ కాబట్టి మంచి అమ్మకాలను పొందవచ్చని భావిస్తున్నాము.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, July 20, 2024, 9:42 [IST]
English summary
Tata curvv revealed in india design and details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+