విడుదలైన 60 రోజుల్లోనే ఏకంగా 8వేల మందికి పైగా కొన్నారు.. అంతలా దీనిలో ఏముంది?
టాటా మోటార్స్ వాహనాలకు దేశంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సెఫ్టీ, ఫెర్ఫామెన్స్‌తో సహా అన్ని విషయాల్లో కూడా ఈ కంపెనీ నుంచి వచ్చే కార్లకు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. దీన్ని మరోసారి రుజువు చేస్తూ ఇటీవల టాటా నుంచి విడుదలైన కర్వ్(tata curvv) మోడల్ అమ్మకాల్లో దుమ్మురేపుతుంది. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మూడు వేరియంట్లలో లభిస్తున్నఈ కారు లాంచ్ అయిన 60 రోజుల్లోనే ఏకంగా 8,218 అమ్మకాలను నమోదు చేసి ఇండియా మార్కెట్లో పట్టు సాధించింది. జనాలు మరి ఇంతలా ఎగబడి టాటా కర్వ్‌ను కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం అందులో ఉన్న ఫీచర్లు, బ్రాండ్‌పై ఉన్న నమ్మకం. ముఖ్యంగా దీపావళి పండుగ సీజన్ కూడా టాటా కర్వ్ అమ్మకాలు పెరగడానికి తోడ్పాటు అందించింది.
ఇంతలా అమ్ముడుపోతున్న టాటా కర్వ్ మొదటి ఎలక్ట్రిక్ కారు ఆగష్టు 7 న దేశంలో విడుదల అయింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2న పెట్రోల్, డీజిల్ వేరియంట్లు వచ్చాయి. కేవలం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే టాటా కర్వ్ అన్ని వేరియంట్లను 8 వేల మందికి పైగా కొనుగోలు చేశారు. ఈ రెండు నెలల్లో టాటా మొత్తం వాహనాల అమ్మకాల్లో కర్వ్ వాటా 9.64 శాతం ఉండటం గమనార్హం.

టాటా కంపెనీలో ఇతర మోడళ్లు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటిని అధిగమించి కర్వ్ ఎక్కువగా అమ్ముడు పోయింది. ఇటీవల వచ్చిన డేటాను ఒకసారి పరిశీలించినట్లయితే ఆగస్టు నెలలో టాటా మోటార్స్ 3,455 కర్వ్ యూనిట్లను విక్రయించింది, ఆ తర్వాత సెప్టెంబర్‌లో పెట్రోల్, డీజిల్ మోడళ్లను అందుబాటులోకి తీసుకురావడంతో అమ్మకాలు 4,763 యూనిట్లకు పెరిగాయి. దాని ముందు నెలతో పోలిస్తే విక్రయాలు 38 శాతం పెరిగాయి.
టాటా కంపెనీకి చెందిన ఇతర మోడళ్ల కంటే కర్వ్(curvv)ఫీచర్లు ప్రత్యేకంగా ఉన్నాయి. దీని ఆకట్టుకునే డిజైన్, పనితీరు ప్రజల మనసును దోచింది. అందుకే లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ రేంజ్‌లో అమ్మకాలను నమోదు చేసింది. వేరే మోడళ్లు, నెక్సాన్.. నెలవారీ సగటు అమ్మకాలు 12,000, హారియర్ సగటు అమ్మకాలు 1,700 కంటే కూడా కర్వ్ విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి.

పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మూడు వేరియంట్లలో కూడా టాటా కర్వ్ లభిస్తుండటంతో కస్టమర్లు తమ అవసరాల మేరకు నచ్చిన మోడల్‌ను ఎంచుకుంటున్నారు. విపరీతమైన డిమాండ్ కారణంగా కర్వ్ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉంది. వేరియంట్‌ను బట్టి బుక్ చేసుకున్న కస్టమర్లకు ఒక్కో సమయంలో కారును డెలివరీ చేస్తారు.
టర్బో-పెట్రోల్ డీసీటీ ఆటో వేరియంట్‌లకు ఆరు వారాల వరకు వెయిటింగ్ పీరియడ్, టర్బో-పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్(MT), డీజిల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్(MT)ల కోసం దాదాపు నాలుగు వారాల వరకు ఆగాల్సిందే. టర్బో-పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆటోమేటిక్ వేరియంట్‌ల కోసం ఎనిమిది వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. కర్వ్ ఎలక్ట్రిక్ వేరియంట్ కావాలనుకున్న వారు కారును డెలివరీ తీసుకోవడానికి ఒక నెల పాటు ఆగాల్సిందే.

టాటా కర్వ్(tata curvv) ఇంజిన్ వేరియంట్‌ను బట్టి వివిధ ధరలకు అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ వేరియంట్ ధర రూ.17.49 లక్షల నుండి రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంది. ఈ మోడల్ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఛార్జింగ్ సమస్య రాకుండా ఉండటానికి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించారు. ఇతర ఇంజిన్ వేరియంట్ల ధరలు రూ. 10 లక్షల నుంచి రూ. 19 లక్షలుగా ఉన్నాయి.
టాటా కర్వ్ లాంచ్ అయిన కొద్ది కాలంలో ప్రజల నుంచి ఇంత భారీ రేంజ్‌లో డిమాండ్‌ను సంపాదిస్తుందంటే ఇదే ట్రెండ్‌తో రానున్న రోజుల్లో ఇండియా మార్కెట్లో కొత్త సంచలనాలకు తెర లేపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యర్థి కంపెనీలకు కూడా గట్టి పోటీ ఎదురుకానుంది.



Click it and Unblock the Notifications








