టాటా కొత్త కారు వర్సెస్‌ ఫ్రెంచ్ లేటెస్ట్‌ కారు, సేఫ్టీలో ఏదీ బెస్ట్‌?.. క్రాష్‌ టెస్ట్‌లో పైచేయి దీనిదే!

కొన్ని నెలలుగా భారత్‌లో విడుదల అవుతున్న కార్లు సేఫ్టీ టెస్ట్‌లు దుమ్మురేపుతున్నాయి. కస్టమర్లు ఎక్కువగా సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తుండటంతో కంపెనీలు సైతం సేఫ్టీ ఫీచర్లపై ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నాయి. తాజాగా విడుదలైన టాటా కర్వ్ ఎస్‌యూవీ కూపే, సిట్రోయిన్ ఎస్‌యూవీ కూపే వరుసగా భారత్‌ ఎన్‌సీఏపీ క్రాష్‌ టెస్ట్‌లో 5 స్టార్‌, 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని సాధించాయి. ఈ రెండు కార్లు మార్కెట్‌లో నేరుగా పోటిపడుతున్నాయి. ఈ రెండు కార్లు ధరను బట్టి భారీ ఫీచర్లు, పనితీరుతో మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింట్లో సేఫ్టీలో ఏది బెస్ట్‌, దేనిని ఎంచుకోవడం ద్వారా కస్టమర్లు తమ డబ్బుని ఆదా చేసుకోవచ్చు అనే అంశాలు ఓసారి పరిశీలిద్దాం.

ముందుగా టాటా కర్వ్ ఎస్‌యూవీ కూపే పెద్దల సేఫ్టీలో 32 స్కోర్‌కి గాను 29.5 పాయింట్లు, పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు గాను 43.66 పాయింట్లను సాధించింది. ఈ టాటా సరికొత్త కారు భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (భారత్ ఎన్‌సీఏపీ) నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని సాధించి కంపనీపై ఉన్న విశ్వసనీయతను మరోసారి చాటింది.

Tata Curvv Vs Citroen Basalt SUV Coupe Safety Ratings

ఈ సరికొత్త కర్వ్ ఎస్‌యూవీలో సేఫ్టీ పరంగా.. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టీపీఎంఎస్‌తో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ని స్టాండర్డ్‌గా అందించడం ద్వారా సేఫ్టీలో మోస్ట్‌ ట్రస్టెడ్‌ కారుగా ఉంది. అంతే కాకుండా దీని టాప్ ఎండ్ వేరియంట్లలో 360 డిగ్రీల కెమెరా, లెవల్ 2 ADAS, అన్ని డిస్క్ బ్రేక్స్‌, ఆటో హోల్డ్‌తో పాటు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉన్నాయి.

ముఖ్యంగా పిల్లల సేఫ్టీలో టాటా కర్వ్ మంచి పనితీరుని కనబరిచింది. ఈ క్రాష్‌ టెస్ట్‌లో ఫ్రంట్ ప్యాసింజర్ (డమ్మీ) సురక్షితంగా ఉన్నాయి. అయితే డ్రైవర్ కుడి కాలికి తక్కువ రక్షణ లభిస్తుంది. మిగతా టాటా కార్ల మాదిరిగానే కొత్త కారు కావడంతో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లతో కర్వ్ ఎస్‌యూవీ క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్‌ని సంపాదించింది.

Tata Curvv Safety Ratings

సిట్రోయిన్ బసాల్ట్: ఈ సరికొత్త ఫ్రెంచ్‌ కారు BNCAP క్రాష్‌ టెస్ట్‌లో 32 పాయింట్లకు గాను 26.19 స్కోర్‌ని సాధించింది. అలాగే పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు గాను 35.90 స్కోర్‌ని నమోదు చేసింది. దీంతో ఈ కారు ఓవరాల్‌గా సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్‌ని పొందింది. ముఖ్యంగా కారులోని సేఫ్టీ ఫీచర్లు ప్రయాణికుడి తల, మెడకు (డమ్మీ) మంచి సేఫ్టీని రక్షణ కల్పిస్తాయి.

అయితే, ఛాతీ, కాళ్ల వద్ద పెద్దగా సేఫ్టీ లేదని నివేదిక తెలిపింది. దీంతో 4 స్టార్‌ రేటింగ్‌తో సరిపెట్టుకుంది. ఇందులో సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్‌, EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు కారులోని ప్రయాణీకులకు మెరుగైన సేఫ్టీని అందిస్తుంది.

Citroen Basalt SUV Coupe Safety Ratings

ధర: ఈ కారుని పెట్రోల్, డీజిల్ ఇంజిన్, ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో కొనుగోలు చేయవచ్చు. పెట్రోల్ ఇంజిన్ ధరలు రూ .10 లక్షల నుంచి రూ .19 లక్షలు, డీజిల్ ఇంజిన్ ధరలు రూ.11.50 లక్షల నుంచి రూ.19 లక్షల మధ్య ఉన్నాయి. ఈవీ కారు ధరలు రూ. 17.49 లక్షల నుంచి 21.99 లక్షల మధ్య కొనుగోలు చేయవచ్చు. (ఇవన్నీ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు)

ఇక సిట్రోయిన్ బసాల్ట్ ఎస్‌యూవీ కూపే ధరలు రూ .7.99 లక్షల నుంచి రూ .13.83 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కూపే ఎస్‌యూవీ 1.2 NA పెట్రోల్‌ ఇంజిన్‌, 1.2 టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్స్‌తో కొనుగోలు చేయవచ్చు. యు (You), ప్లస్, మాక్స్‌ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. బ్రాండ్‌ పరంగా టాటా బెస్ట్‌, మార్పు కావాలంటే సిట్రోయిన్‌ని ట్రై చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, November 12, 2024, 14:45 [IST]
English summary
Tata curvv vs citroen basalt suv coupe crash test safety ratings
Read more on: #auto news #crash test #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+