ఆగస్టు 07ని రాసిపెట్టుకోండి.. 3 పవర్‌ట్రైన్లలో వస్తున్న 'టాటా కర్వ్‌'.. దీన్ని కొట్టే కారు వస్తే ఒట్టు!

టాటా మోటార్స్ భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన కారు కంపెనీగా ఉంది. ఈ కంపెనీ నుంచి మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కార్లు ఎక్కువగా సేఫ్టీకి ప్రాధాన్యతను ఇస్తాయి. అంతే కాకుండా భారీ ఫీచర్లను టాటా మోటార్స్‌ ఇన్‌స్టాల్‌ చేస్తుంది. ఆ కంపెనీ నుంచి నెక్సాన్ (Nexon), పంచ్ (Punch) సిరీస్‌ భారత కార్ల మార్కెట్‌లో మంచి సక్సెస్‌ రేట్‌ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఈ కార్లు ఈవీ విభాగంలోనూ టాప్‌లో కొనసాగుతున్నాయి. తాజాగా టాటా కర్వ్ (Tata Curvv) మార్కెట్‌ని శాసించనుంది. ఈ కర్వ్‌ని కూపే తరహా ఎస్‌యూవీగా అభివృద్ధి చేశారు. అంటే కారు వెనుక పైకప్పు వంగి ఉంటుంది. ప్రస్తుతం ఈ కారు విడుదలపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. టాటా కర్వ్‌ ఆగస్టు 7 న లాంచ్ కానుంది.

ఇక నెక్సాన్, పంచ్ మాదిరిగానే, టాటా మోటార్స్ కర్వ్‌ని పెట్రోల్/డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లోనే కాకుండా ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా విక్రయించాలని యోచిస్తోంది. ఇది మార్కెట్‌లో ఓ బెంచ్‌మార్క్‌ని సెట్‌ చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వీటి ధరలను ఇంకా వెల్లడించలేదు. అసలు ఈ కారు ఏఏ పవర్‌ట్రైన్‌లో రానుంది? టాటా కర్వ్, కర్వ్ ఈవీకి మధ్య గల ముఖ్య తేడాలను ఈ కథనంలో మీ కోసం వివరించబోతున్నాం.

Tata-Curvv-Vs-Curvv-EV-Comparison

డిజైన్‌: టాటా కర్వ్ లుక్ చాలా మోడ్రన్‌గా ఉంటుంది. కర్వ్ మరియు కర్వ్ ఈవీ రెండింటిలోనూ మెజారిటీ భాగాలు ఒకేలా ఉండనున్నాయి. ఈ రెండు కార్లలో LED హెడ్‌లైట్స్‌, కనెక్ట్ చేసిన LED DRLsని అమర్చారు. ఇక ఎలక్ట్రిక్‌లో కర్వ్ ఈవీ గ్రిల్ ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. యాక్టివ్ అల్లాయ్ వీల్స్‌తో కర్వ్ ఈవీని ప్రవేశపెట్టనున్నారు. వెనుక భాగంలో కర్వ్ మరియు కర్వ్ ఈవీ రెండూ ఒకేలా ఉంటాయి.

వెనుక స్పాయిలర్ ఆకారంలో ఎటువంటి మార్పు ఉండదు. పైకప్పు డిజైన్ రెండింటిలోనూ ఒకేలా ఉంటుంది. ఈవీ వెనుక భాగంలో ఎలక్ట్రిక్ కారు అని సూచించే ఈవీ బ్యాడ్జ్‌ని అమర్చారు. ఇక పవర్‌ట్రైన్‌లు నెక్సాన్ మాదిరిగానే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్‌తో వచ్చే అవకాశం ఉంది. నెక్సాన్ కారు మాదిరిగానే 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ని అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది.

Tata-Curvv-EV

ఈ ఇంజిన్ కర్వ్‌లో గరిష్టంగా 125 bhp పవర్‌ని ఉత్పత్తి చేయనుంది. ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్‌లో రానున్నాయి. కర్వ్ ఈవీ విషయానికొస్తే ఎలక్ట్రిక్ కారును సెకండ్ జనరేషన్ యాక్టివ్.ఈవీ ఆర్కిటెక్చర్‌తో అభివృద్ధి చేస్తున్నారు. కర్వ్ ఈవీతో ఎలాంటి ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీని ప్రవేశపెడతారో తెలియరాలేదు. నెక్సాన్ ఈవీ మాదిరిగానే కొత్త కర్వ్ ఈవీ మోడల్లో కూడా అదే ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీని అందించవచ్చు.

కర్వ్ ఈవీ నెక్సాన్ ఈవీ కంటే కొంచెం పెద్దది అయినప్పటికీ, రెండింటిలో హార్స్ పవర్‌, టార్క్‌ మధ్య తేడా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. ప్రస్తుతం విడుదలైన లీక్స్‌ ప్రకారం 55 కిలోవాట్ల బ్యాటరీ 600 కి.మీ రేంజ్‌ అందిస్తుందని తెలుస్తోంది. కర్వ్, కర్వ్ ఈవీ రెండింటిలోనూ 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్‌ఫోటైన్మెంట్ డిస్ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్లు ఉన్నాయి.

Tata-Curvv-Ev

అంతే కాకుండా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, పనోరమిక్ సన్‌రూఫ్‌, ఆటోమేటిక్ ఏసీ, ప్రీమియం సౌండ్ సిస్టమ్, ఇల్యూమినేటెడ్ 2-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ఈ రెండు వెర్షన్‌లో అధునాతన ఫీచర్లను అందించే అవకాశం ఉంది. ఇవి మార్కెట్‌లో ఉన్న ఇతర కంపెనీ కార్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. అయితే కర్వ్ & కర్వ్ ఈవీ రెండింటిలో ఏది మెరుగ్గా కనిపిస్తుందో తెలియాలంటే ఆగస్టు 7 వరకు వెయిట్‌ చేయాల్సిందే.

More from DriveSpark

Article Published On: Monday, July 29, 2024, 12:44 [IST]
English summary
Tata curvv vs curvv ev full comparison details full details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+