ఎలక్ట్రిక్ విభాగంలో టాటా కార్లకు ‘టఫ్ ఫైట్’ ఇచ్చే కార్లు లేవా? మన దేశం-మన కార్లు అంటున్న జనాలు

టాటా మోటార్స్ నుంచి విడుదల అయినా కార్లకి దేశంలో మంచి డిమాండ్ ఉంది. అధునాతన సేఫ్టీ ఫీచర్లతో పాటు, స్మార్ట్ అప్ గ్రేడ్స్ తో ఈ కారు కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోనే అత్యంత నమ్మకమైన ఆటోమొబైల్ తయారీదారుగా ఈ సంస్థ కార్లు గుర్తింపు పొందాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ కంపెనీ కార్లు సేల్స్ లో దూకుడుగా రాణిస్తున్నాయి. ఎలక్ట్రిక్ విభాగంలోనూ ఈ కార్లు ప్రస్తుతం నెంబర్ వన్ గా ఉన్నాయి. ఈ కంపెనీ నుంచి ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు మరియు కాంపాక్ట్ SUVలను విక్రయిస్తోంది.

టాటా నుంచి ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో పంచ్ ఈవీ మరియు నెక్సాన్ ఈవీలకు మంచి డిమాండ్ ఉంది. ఈ కార్ సేల్స్ రోజురోజుకు పెరుగుతున్నాయి. అతి తక్కువ కాలంలో పంచ్ EV 10,000 యూనిట్ల కార్లను విక్రయించింది. Nexon EV 2020 నుంచి ఇప్పటివరకు 68,000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. మొత్తం మీద ఈ రెండు ఎలక్ట్రిక్ SUVలతో కలిపి 78,000 యూనిట్లు అమ్ముడయ్యాయి.

tata-nexon-ev

టాటా మొదటగా ఈ కంపెనీలోని టాప్ కారు నెక్సాన్ EV ఎక్స్-షోరూమ్ ధర రూ.14.49 లక్షల నుండి రూ.19.49 లక్షల మధ్య ఉంది. ఇది 30 KWh, 40.5 KWh రెండు బ్యాటరీ ఆప్షన్స్ తో వస్తుంది. ఇది పూర్తి ఛార్జ్‌పై వరుసగా 325 కిమీ మరియు 465 కిమీల రేంజ్ అందిస్తుంది. త్వరలోనే ఈ కారు iCNG వెర్షన్ లో అందుబాటులోకి రానుంది.

ఈ Nexon EVలో 5గురు హాయిగా ప్రయాణించవచ్చు. ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్‌తో సహా వివిధ ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా, ఇది 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లను పొందుతుంది. ఈ కార్ 5- స్టార్ రేటింగ్ ని కలిగి ఉంది.

tata-punch-ev

ఇక టాటా పంచ్ EV విషయానికి వస్తే ఇది EV 25 మరియు 35 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ లో అందుబాటులో ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌పై వరుసగా 315 నుండి 421 కిమీల రేంజ్ ను అందిస్తుంది. ఈ ఈవీ కారు స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్ ప్లస్‌ అనే ఐదు వేరియంట్లలో లభిస్తుంది.

కొత్త కారులో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, సన్‌రూఫ్ వంటి వివిధ ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) ఉన్నాయి.

Tata Punch EV

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, June 17, 2024, 18:59 [IST]
English summary
Tata duo punch and nexon evs still remains top in electric segment sales
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+