Tata Harrier EV 500 కి.మీ రేంజ్‌తో టాటా హారియర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ప్రత్యర్థి కంపెనీలకు దిమ్మతిరిగే షాక్
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లోకి మరికొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేసేందుకు స్వదేశీ సంస్థ టాటా మోటార్స్(Tata Motors) సన్నద్ధమవుతోంది. ఇప్పటికే నాలుగు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసిన టాటా.. ప్యాసింజర్ వెహికల్ లిస్ట్‌లో త్వరలో మరికొన్ని ఈవీలను విడుదల చేయనుంది. వాటిలో ఒకటి టాటా హారియర్ EV. తాజాగా టాటా హారియర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి ఆసక్తికర సమాచారం వెల్లడైంది.
2023 ఆటో ఎక్స్‌పోలో టాటా హారియర్ ఈవీ(Tata Harrier EV) కాన్సెప్ట్‌ను సంస్థ ప్రదర్శించింది. అయితే తాజాగా టాటా హారియర్‌కు సంబంధించి పలు వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి ఛార్జింగ్‌పై 500 కి.మీ ఇచ్చేలా రూపొందించనట్లు తాజాగా విడుదలైన ప్రెజెంటేషన్ చిత్రాల ద్వారా తెలుస్తోంది. టాటా హారియర్ ఈవీని Sierra.ev ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్నట్లు సమచారం.

ఈ క్రమంలో తాజాగా టాటా మోటార్స్ టాటా హారియర్ ఈవీని ప్రదర్శించిన ప్రెజెంటేషన్ ఫొటోలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి.. వాటిలోని చిత్రాల ద్వారా ఈ కారు రేంజ్‌కు సంబంధించి వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. రానున్న టాటా హారియర్ ఈవీ 80 శాతం ఛార్జింగ్‌పై 400 కి.మీ రేంజ్‌తో రానుందని ఫొటోలు సూచిస్తున్నాయి. అదే పూర్తి ఛార్జ్‌పై 500 కి.మీ రేంజ్ ఇవ్వనున్నట్లు వెల్లడైంది.
ఈ విషయాన్ని టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్స్ అండ్ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర స్వయంగా ధ్రువకరించారు. కాగా కంపెనీ జనరేషన్ 1 ప్లాట్‌ఫారమ్‌ల నుంచి జనరేషన్ 2 ప్లాట్‌ఫారమ్‌లకు మారాలని యోచిస్తున్నట్లు గతేడాది శైలేష్ చంద్ర వెల్లడించారు. ఈ మార్పుల కారణంగానే టాటా హారియర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని పెంచినట్లుగా తెలుస్తోంది.

అంతే కాకుండా టాటా హారియర్ EV(Tata Harrier EV Range)ని కొన్ని ఫంక్షనల్ ఫీచర్లను కూడా అందించవచ్చని ప్రెజెంటేషన్ ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఇవి వెహికల్-టు-లోడ్ (V2L) మరియు వెహికల్-టు-వెహికల్ (V2V) ఛార్జింగ్ సామర్థ్యాలుగా స్పష్టమవుతోంది. దీంతో పాటు హారియర్ EVకి డ్యూయల్-మోటార్ సెటప్‌ను అందించవచ్చని సమాచారం. ఈ సెటప్ ద్వారా హారియర్ EV ఆల్-వీల్-డ్రైవ్ లేఅవుట్‌ను కలిగి ఉండవచ్చు.
ఎక్స్‌టీరియర్ పరంగా టాటా హారియర్ ఈవీ(Tata Harrier EV Launch) డిజైన్ పూర్తయినట్లుగా ప్రెజెంటేషన్ ఫొటోలు ద్వారా తెలుస్తోంది. టాటా హారియర్ ICE హారియర్ మాదిరిగానే ఈ కారు ఎక్స్‌టీరియర్ డిజైన్ ఉన్నట్లుగా చెప్పవచ్చు. అయితే ఇందులో స్వల్ప తేడాలు ఉన్నాయి. మొదటిది ఎలక్ట్రిక్ హారియర్ డోర్ మరియు వెనుక డెక్‌లిడ్‌పై ".EV" బ్యాడ్జ్‌ని కలిగి ఉంది. దీంతో పాటు ఇది కొత్త ఏరో-స్టైల్ అల్లాయ్ వీల్స్‌తో రానుంది.

కొత్త హారియర్ EV కూడా ICE మాదిరి బాడీ ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను కలిగి ఉన్నట్లుగా ప్రెజెంటేషన్ ఫొటోల ద్వారా అర్థమవుతోంది. ముందు వైపు LED హెడ్‌లైట్‌లతో అనుసంధానించబడిన LED DRLలు, వెనుక వైపు కనెక్ట్ చేయబడిన LED టెయిల్‌లైట్‌లతో రానుంది. అయితే ICE మరియు EV మోడల్‌ల మధ్య మార్పులను గుర్తించేందుకు.. హారియర్ ఈవీలో ఫ్రంట్ అండ్ రియర్ బంపర్‌లను మార్చినట్లుగా తెలుస్తోంది. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications