సింగిల్‌ ఛార్జ్‌తో 500 కి.మీ వెళ్లే టాటా కొత్త ఎలక్ట్రిక్ కారు.. మార్కెట్లోకి వచ్చేది ఎప్పుడో తెలుసా!

దేశీయ దిగ్గజ కంపెనీలు అన్ని కూడా క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నాయి. ఇప్పటికే గత కొంత కాలంగా వరుసగా కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రాను రాను మరింత పెరిగే అవకాశం ఉంటుందనే ఆలోచనతో చాలా మంది కూడా ఈవీ కార్లను కొనుగోలు చేయడానికి ముందడుగు వేస్తున్నారు. డిమాండ్ పెరగడంతో దానికి అనుగుణంగా మార్కెట్లోకి అధునాతన ఫీచర్లతో కొత్త ఈవీ కార్లు వస్తున్నాయి. తాజాగా ఇండియాలో పెద్ద ఆటోమొబైల్ తయారీ కంపెనీగా ఉన్నటువంటి టాటా మోటార్స్(Tata Motors) కూడా ఈ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇప్పటికే పలు మోడళ్లను విడుదల చేయగా అవన్నీ కూడా మంచి డిమాండ్ ఉన్న వాహనాలుగా చలామణి అవుతున్నాయి.

ప్రస్తుతం టాటా మోటార్స్ పంచ్ EV, Nexon EV, టియాగో EV, Tigor EV, కర్వ్ EVలను విక్రయిస్తుంది. ఈ కార్లకు డిమాండ్ పెరగడంతో కంపెనీ మరో మోడల్‌ను ఈవీ వెర్షన్‌లో తీసుకురావడానికి సన్నాహలు ప్రారంభించింది. ఆ కొత్త మోడల్ పేరు టాటా 'హారియర్ EV'.కంపెనీ దీని లాంచ్‌పై ప్రత్యేకంగా పనిచేస్తుంది. అన్ని సవ్యంగా కుదిరితే ఈ కారు వచ్చే ఏడాది మార్చి నాటికి మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

Harrier Ev Is Expected To Launch March

సరికొత్త హారియర్ ఎలక్ట్రిక్ వేరియంట్ 2025 మార్చిలో విక్రయానికి అందుబాటులోకి వచ్చిన తర్వాత టాటా మోటార్స్ మరో ఈవీని లాంచ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం, ఆ మోడల్ పేరు సియెర్రా EV అని తెలుస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న డిమాండ్ కారణంగానే టాటా మోటార్స్ వరుసగా ఈవీలను తెస్తుంది.

ఇక టాటా హారియర్ EV గురించి మాట్లాడుకుంటే, ఇది సరికొత్త డిజైన్‌తో వస్తుంది. బయటి నుంచి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ముందు కొత్ గ్రిల్, అధునాతన LED హెడ్‌ల్యాంపులు, LED DRLలు ఉంటాయని తెలుస్తుంది. ప్రధానంగా అల్లాయ్ వీల్స్ కారు అందాన్ని మరింత పీక్స్‌కు తీసుకెళ్తుందని దాని డిజైన్ చూస్తే అర్థం అవుతుంది. ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకోడానికి కారును వివిధ కలర్ ఆప్షన్లలో అందించే అవకాశం ఉంది.

ముఖ్యంగా కారు బ్యాటరీ పనితీరు విషయానికి వస్తే, ఇది పూర్తి ఛార్జింగ్‌తో దాదాపు 500 కి.మీ వరకు ప్రయాణిస్తుందని మార్కెట్ వర్గాల వారు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ రేంజ్ ఇచ్చే పలు ఈవీలు అందుబాటులో ఉండగా, వాటిని దాటుకుని మెరుగైన అమ్మకాలను నమోదు చేయాలంటే ఈ మాత్రం రేంజ్‌ కారు అయితేనే మార్కెట్లో ఉన్న భారీ పోటీని సైతం తట్టుకోగలదు.

ఎక్కువ రేంజ్ అందించడానికి హారియర్ EVలో శక్తివంతమైన బ్యాటరీని అమర్చనున్నట్టు సమాచారం. ఇది డ్యూయల్-మోటార్ సెటప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కారులో 5 మంది సులభంగా కూర్చుని ప్రయాణించవచ్చు. భద్రత పరంగా కూడా ఇది సురక్షితమైనదని తెలుస్తుంది. ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో పాటు ఇంటీరియర్ కూడా చాలా అందంగా ఉంటుందని తెలుస్తుంది.

క్యాబిన్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇవి డ్రైవర్‌కు ఉపయోగపడటమే కాకుండా ప్రయాణికులకు కూడా ఉపయోగకరంగా ఉంటాయి. లోపల 6-వే పవర్ డ్రైవర్ సీటు, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ AC, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వంటి ఫీచర్లు ఉన్నాయి.

ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికుల రక్షణ కోసం 7 ఎయిర్‌బ్యాగ్‌లు అందించినట్లు తెలుస్తుంది. ఇంకా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 360-డిగ్రీ కెమెరాలు ,టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్-డీసెంట్ కంట్రోల్, హిల్-హోల్డ్ అదనంగా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. ఈ హారియర్ EV దాదాపు రూ.30 లక్షల (ఎక్స్-షోరూమ్)ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 19, 2024, 13:15 [IST]
English summary
Tata harrier ev is expected to launch in march 2025 here the details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+