సేఫ్టీలో నం.1 కారు త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రాబోతుంది.. విడుదల ఎప్పుడో తెలిసిపోయింది!!
టాటా హరీయర్ దేశంలోనే నంబర్ సేఫెస్ట్ కారుగా ఉంది. ఈ కారు కేవలం డీజిల్ పవర్‌ట్రెయిన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అత్యాధునిక సేఫ్టీ కార్లు ఉన్న ఈ కారు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అందుబాటులో రానుంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ కారు ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందనే విషయం తెలియరాలేదు. ఈ కారుని 2023 ఆటో ఎక్స్‌పోతో పాటు 2024 భారత్ మోటో షోలలో హారియర్ EVని ప్రదర్శించింది. అప్పటి నుంచి ఈ అధునాతన ఈవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ ఐదు-సీట్ల SUV ఎప్పుడు విడుదల కానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
టాటా మోటార్స్ తన EV లైనప్‌లో కొత్త SUVలను విస్తరించాలనే లక్ష్యంతో సాగుతుంది. అందులో భాగంగానే టాటా హారియర్ ఎలక్ట్రిక్ కారు త్వరలోనే భారత మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కారుని 2025 మార్చి 31 నాటికి మార్కెట్లోకి టాటా తీసుకురానుంది. పండుగ సీజన్‌లో మార్కెట్‌లోకి ఈ కారు ప్రవేశించనుంది. టాటా నుంచి వచ్చిన తాజా ప్రకటనతో టాటా హారియర్ ఈవీ మరింత సంచలనం సృష్టిస్తుందని భావిస్తున్నారు.

టాటా హారియర్‌తో పాటు టాటా కర్వ్ EVని అదే సమయంలో విక్రయానికి వచ్చే అవకాశం ఉంది. హారియర్ EV రీ-ఇంజనీరింగ్ చేసిన ఒమేగా ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా బ్రాండ్ acti.ev ఆర్కిటెక్చర్‌తో ఈ కారులో ఉపయోగించారు. ఈ కారుకి సంబంధించి బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటారుపై ఖచ్చితమైన వివరాలు విడుదల చేయనప్పటికీ వెహికల్-టు-లోడ్ (V2L) వెహికల్-టు-వెహికల్ (V2V) సామర్థ్యాలను కలిగి ఉంటుందని టాటా స్పష్టం చేసింది.
హారియర్ EV డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉంది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇది ఆల్-వీల్ డ్రైవ్ సామర్థ్యాలను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ SUV 60 kWh బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిమీల పరిధిని అందించనుంది.

హారియర్ EV ICE వెర్షన్‌ని పోలిన బయటి డిజైన్‌ని కలిగి ఉండనుంది. బ్లాంక్డ్ అవుట్ గ్రిల్‌తో ప్రత్యేకమైన ఫ్రంట్ ఫేసియాతో అందుబాటులోకి వస్తుంది. ఇంటీరియర్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు రోటరీ డ్రైవ్ మోడ్ సెలెక్టర్‌ను పొందవచ్చు. ఇంకా మరెన్నో స్మార్ట్ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
హారియర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో పాటు, కర్వ్ కూపే, ఆల్ట్రోజ్ రేసర్, నెక్సాన్ iCNG మరియు సఫారీ డార్క్ ఎడిషన్ వంటి టాటా లైనప్ కార్లను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో ఆ సంస్థ ప్రదర్శించింది. ఇప్పుడు జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా హారియర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విడుదల తేదీకి సంబంధించిన వివరాలు వెల్లడించడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.
వేగంగా విస్తరిస్తున్న EV సెగ్మెంట్‌లో టాటా కార్లు తమ దూకుడుని కొనసాగిస్తున్నాయి. త్వరలో మార్కెట్‌లో అడుగుపెట్టనున్న ఈ హారియర్ ఈవీ మారుతి eVX మరియు టయోటా అర్బన్ స్పోర్ట్ వంటి కార్లతో పాటు మహీంద్రా, హ్యుందాయ్ మరియు హోండా నుంచి విడుదలకు సిద్ధంగా ఉంటే ఎలక్ట్రిక్ కార్లపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు .
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








