బలంగా ఢీకొన్న టాటా -మహీంద్రా కార్లు.. ఏది ఎక్కువ డ్యామేజ్ అయిందంటే..
దేశంలో రోజూ ఎక్కడో ఒక చోట కారు యాక్సిడెంట్ ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సురక్షితమైన ప్రయాణం కోసం ప్రజలు ఎక్కువ భద్రతను అందించే కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా రక్షణ పరంగా మొదటి స్థానంలో ఉండే టాటా(Tata) కార్లకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ కంపెనీ కార్లు కూడా ప్రజల నమ్మకాలను ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ భారత్‌లో ప్రయాణికుల సేఫ్టీ విషయంలో ముందు స్థానంలో ఉంది. ఇటీవల జరిగిన ఒక ఘటనలో సైతం ఇది నిరూపితం అయింది.
దేశంలో ఈ మధ్య టాటా కంపెనీకి చెందిన హారియర్(Tata Harrier), మహీంద్రా స్కార్పియో ఎన్(Mahindra Scorpio N) రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు SUVలు కూడా డ్యామేజ్ అయ్యాయి. అయితే మహీంద్రా స్కార్పియో ఎన్‌తో పోలిస్తే టాటా హారియర్ తక్కువ డ్యామేజ్ అయింది.

స్కార్పియో ఎన్(Scorpio N) ముందు భాగం ఎక్కువ దెబ్బతింది. ఫ్రంట్ గ్రిల్, బంపర్, బానెట్, కుడి వైపు హెడ్‌ల్యాంప్ డ్యామేజ్ అయ్యాయి. మిగతా భాగాలు మాత్రం బాగానే ఉన్నాయి. అదే టాటా హారియర్(Harrier) ముందు భాగంలో స్వల్పంగా దెబ్బతింది. దాని బానెట్, ఫ్రంట్ గ్రిల్, బంపర్ లుక్ డ్యామేజ్ అయింది.
ఈ ఘటనలో టాటా లోగో మాత్రం చెక్కుచెదరకుండా ఉండటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఘటనను బట్టి మహీంద్రా వాహనాలు సురక్షితం కావని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే కంపెనీ తన ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడకుండా సేఫ్టీ ఫీచర్లను తన అన్ని వాహనాల్లో అందిస్తుంది.

ఈ ఘటనలో స్కార్పియో ఎన్ ముందు భాగం మాత్రమే డ్యామేజ్ అయింది. కానీ మిగిలిన భాగాలు అన్ని కూడా సురక్షితంగా ఉన్నాయి. టాటా హారియర్, మహీంద్రా స్కార్పియో N రెండూ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన SUV మోడల్‌లు. ప్రొటెక్షన్ పరంగా ఇవి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి.
స్కార్పియో N గ్లోబల్ NCAP నుంచి ఈ రేటింగ్‌ను పొందగా, టాటా హారియర్ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ భారత్ NCAP నుండి రేటింగ్‌ను అందుకుంది. యాక్సిడెంట్ సమయంలో ప్రయాణికుల రక్షణ విషయంలో ఈ రెండు కూడా కఠిన భద్రతా ప్రమాణాలను కలిగి ఉన్నాయి.

భారత్‌లో సురక్షితమైన వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో దిగ్గజ ఆటోమొబైల్ తయారీ కంపెనీలు ప్రమాద సమయంలో వాహనంలో ప్రయాణించే వారికి ఎలాంటి గాయాలు కాకుండా చూడటానికి అధునాతన సేఫ్టీ ఫీచర్లను అందించడానికి కృషి చేస్తున్నాయి. టాటా, మహీంద్రా వంటి తయారీదారులు తమ మోడళ్లలో భద్రతను మరింత అప్‌డేట్ చేస్తున్నారు.
ఈ సంఘటన ప్రయాణికుల భద్రత పట్ల రెండు కంపెనీల ఉత్పత్తులకు సంబంధించిన వారి అంకిత భావాన్ని తెలియజేస్తుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు వాటిలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. టాటా కంపెనీ ఎప్పుడూ కూడా సేఫ్టీ పరంగా అత్యుత్తమ పనితీరును కనబరుస్తుంది. ఇప్పుడు ఈ ఘటనలో కూడా టాటా కారు అత్యంత సురక్షితం అని వెల్లడైంది.
దేశంలో టాటా హారియర్ ధర రూ.14.99 లక్షల నుండి రూ.23.99 లక్షల వరకు ఉండగా, మహీంద్రా స్కార్పియో N ధర రూ.13.85 లక్షల నుండి రూ.24.54 లక్షల మధ్య ఉంది. రెండు మోడళ్లకు కూడా భారత్‌లో మంచి ఆదరణ లభిస్తుంది. టాటా హారియర్‌తో పాటు స్కార్పియో N అమ్మకాలు సైతం ఎక్కువగా ఉన్నాయి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








