మార్కెట్లో బెస్ట్ కారు.. కానీ ఎవరెస్ట్ నుంచి కింద పడినట్లు ఒక్కసారిగా పడిపోయింది.. కారణం ఏం అయి ఉంటుంది..?

భారత ఆటోమొబైల్ పరిశ్రమలో టాటా మోటార్స్(Tata Motors)కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమైన కార్లను తయారు చేయడంలో ఇతర కంపెనీల కంటే ముందు వరుసలో ఉంది. నమ్మకమైన కార్ల తయారీ సంస్థగా పేరున్న టాటా నుంచి విడుదల అవుతున్న కార్లకు దేశంలో మంచి డిమాండ్ ఉంటుంది. ఇదిలా ఉంటే కంపెనీ ఇటీవల వరుసగా తన సేల్స్ రిపోర్ట్‌ను వెల్లడిస్తుంది. ఎస్‌యూవీలకు భారత్‌లో మంచి ఆదరణ ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది వినియోగదారులు ఈ కార్లకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి సమయంలో టాటా హారియర్ ఫేస్‌లిఫ్ట్ SUV అమ్మకాలు తగ్గిపోయాయి. తాజాగా విడుదలైన అమ్మకాల డేటా ప్రకారం, 2024 నవంబర్ నెలలో హారియర్ ఫేస్‌లిఫ్ట్ 1,374 యూనిట్లు అమ్ముడుపోయింది. ఇది గత ఏడాది నవంబర్‌లో 2,326 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.

ఈ లెక్కన డేటాను పరిశీలించినట్లయితే గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు దాదాపు 41 శాతం తగ్గిపోయాయి. టాటా హారియర్‌ డిజైన్ సరికొత్తగా ఉంటుంది. అలాగే, ప్రయాణికుల భద్రత పరంగా మెరుగైన ప్రమాణాలను కలిగి ఉంది. ఫీచర్లు కూడా చాలా వరకు వినియోగదారులకు నచ్చే విధంగా ఉంటాయి. ఎస్‌యూవీలకు భారత్‌లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో ఈ మోడల్ అమ్మకాలు క్షీణించడం గమనార్హం.

Tata Harrier Sales Report

ముఖ్యంగా ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్లో కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, జీప్ కంపాస్, MG హెక్టర్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది. హారియర్ ఫేస్‌లిఫ్ట్ గత ఏడాది కంటే కూడా మరింత ఎక్కువ అమ్మకాలను సాధిస్తుందని అంచనాలు ఉన్నప్పటికి 41 శాతం తగ్గాయి. ఈ కారు గురించిన పూర్తి వివరాళ్లోకి వెళితే, టాటా హారియర్‌ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వచ్చింది.

ఇది 170 hp పవర్, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. హారియర్ కోరల్ రెడ్, పెబుల్ గ్రే, లూనార్ వైట్, సన్‌లైట్ ఎల్లో వంటి సరికొత్త 6 కలర్ వేరియంట్లలో కొనుగోలుకు లభిస్తుంది. ఈ కారులో ఎకో, సిటీ, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్స్‌లను అందించారు. ఈ ఎస్‌యూవీలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి.

Tata Harrier November 2024 Sales

హారియర్ ఇంటీరియర్‌లో చాలా అప్‌డేట్లను కంపెనీ అందించింది. ఇంటీరియర్‌ను అందంగా రూపొందించారు. క్యాబిన్‌లో 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్‌, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, టాటా లోగోతో కొత్త 4-స్పోక్ స్టీరింగ్ వీల్, కంఫర్టబుల్ మెత్తని సీట్లు మొదలగు వాటిని ఇంటీరియర్‌లో అందించారు. ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 10-స్పీకర్ JBL సౌండ్ సిస్టం‌ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

ఎక్స్‌టీరియర్ కూడా స్టైలీష్‌గా ఉంది. ముందు భాగంలో కొత్త గ్రిల్, పైభాగంలో పూర్తి-వెడల్పు LED లైట్ బార్ ఉంది. బంపర్‌ను కొత్త డిజైన్‌లో కనిపిస్తుంది. ఈ ఎస్‌యూవీ 18, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. హారియర్ ఎలక్ట్రిక్ కారు కూడా ఇదే డిజైన్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణికుల భద్రత పరంగా ఇది అత్యంత సేఫ్టీని కలిగి ఉంది.

Tata Harrier November Sales

ప్రమాద సమయంలో లోపల కూర్చున్న వారి రక్షణ ఎలా ఉంటుందో అని గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో పెద్దల రక్షణకు సంబంధించి 34 పాయింట్లకు 33.05 పాయింట్లు పొంది 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. కారు లోపల ఎయిర్‌బ్యాగులు,చుట్టు ప్రక్కల చూడటానికి 360-డిగ్రీ కెమెరా వంటి ఫీఛర్లు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా డ్రైవర్, ప్రయాణికులకు అవసరమైన డజన్ల కొద్ది ఫీచర్లను కూడా ప్రత్యేకంగా కారులో టాటా అందించింది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 10, 2024, 14:02 [IST]
English summary
Tata harrier november 2024 sales 41 percent down check details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+