దేశంలోనే నం.1 సేఫెస్ట్‌ కారుకి సంబంధించి కీలక అప్‌డేట్‌..

సేఫ్టీలో టాటా మోటార్స్‌ని ఢీ కొట్టే కార్లు లేవు. ఆ సంస్థ నుంచి టాటా హారియర్‌, సఫారీ, నెక్సాన్‌ కార్లు ది బెస్ట్‌ ట్రస్టెడ్ కార్లుగా ఉన్నాయి. సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో టాటా మోటార్స్ భారతదేశంలో నమ్మకమైన ఆటోమొబైల్ తయారీదారుగా పేరుగాంచాయి. ప్రస్తుతం ఆ సంస్థ నుంచి అందుబాటులో ఉన్న హారియర్‌ దేశంలోనే అత్యంత సేఫ్టీ కారుగా ఉంది.

ప్రస్తుతం టాటా హారియర్‌ కారు కేవలం డీజిల్ పవర్‌ట్రెయిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. అన్ని రకాల కస్టమర్లను సంతృప్తి పరిచేందుకు ఈ కారుని పెట్రోల్‌, ఎలక్ట్రిక్‌ రూపాల్లో విడుదల చేసేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. 2025లో ఈ కారును పెట్రోల్-ఎలక్ట్రిక్ రూపంలో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. దీనిపై కంపెనీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

Tata-Harrier-Car

ప్రస్తుతం మార్కెట్‌లో క్రెటా మరియు గ్రాండ్ విటారాతో ఈ మోడల్ పోటీ పడుతోంది. అయితే హారియర్‌ కేవలం డీజిల్ పవర్ ట్రెయిన్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలోనే పెట్రోల్‌ ఇంజిన్‌, ఎలక్ట్రిక్‌ మోటార్‌లలో ప్రవేశ పెట్టనుంది. భారత మార్కెట్లోకి రానున్న టాటా హారియర్ ఈవీ ధర సుమారు రూ.30 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో కొనుగోలుకు అందుబాటులో ఉండే అవకాశం ఉందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు.

అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో ఈ కారు డ్యూయల్ మోటార్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది. దీనిని ఫుల్ చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుందని చెబుతున్నారు. హారియర్ EVలోనూ డీజిల్ పవర్‌ట్రెయిన్ మోడల్‌తో సరి సమానమైన ఫీచర్లను జోడించే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న మార్పులతో వచ్చే ఈ కారు మార్కెట్‌ని పూర్తిగా శాసించే అవకాశం ఉంది.

Tata-Harrier

ఫీచర్ల పరంగా 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ AC, 6-వే పవర్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రధాన ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఇంకా అధునాతన టెక్నాలజీ ఫీచర్లను కూడా సంస్థ జోడించనుంది.

ఇక ఇంజిన్‌ విషయానికి వస్తే టాటా హారియర్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 170 హార్స్‌పవర్ మరియు 350 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. వేరియంట్‌లను బట్టి 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లతో లభిస్తుంది, ఇది 16.8 kmpl మైలేజీని అందిస్తుంది.

Tata-Harrier-EV

భద్రత పరంగా ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఉన్నాయి. ప్రస్తుతం టాటా హారియర్ SUV ధర రూ. 15.49 లక్షల నుంచి రూ. 26.44 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్య ఉంది. ఈ కారు స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, ఫియర్‌లెస్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

ప్రస్తుతం పెట్రోల్ వెర్షన్ హారియర్ లైనప్‌లలో ఉన్న టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి మోడల్స్‌తో ఈ కారు పోటీ పడనుంది. టాటా మోటార్స్‌ నుంచి ప్రస్తుతం నెక్సాన్‌ పెట్రోల్, డీజిల్, ఈవీ పవర్ ట్రెయిన్లతో అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది సీఎన్‌జీ వెర్షన్‌లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ సంవత్సరం ఆరంభంలో ఇండియాలో నిర్వహించిన భారత్ మొబిలిటీ షోలో నెక్సాన్ సీఎన్‌జీ వెర్షన్‌ని టాటా మోటార్స్‌ ప్రదర్శించింది. ఈ కారుని ప్రదర్శించడం ద్వారా నెక్సాన్‌ లైనప్‌లో అన్ని పవర్‌ ట్రెయిన్లతో అందుబాటులోకి వచ్చే కారుగా నెక్సాన్‌ నిలువనుంది. ఇప్పుడు దేశంలోనే ది బెస్ట్‌ సేఫేస్ట్‌ కారు హారియర్‌ని కూడా వివిధ పవర్‌ ట్రెయిన్‌లతో విడుదల చేసి మార్కెట్‌ తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని టాటా భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, May 18, 2024, 16:56 [IST]
English summary
Tata harrier petrol and electric cars timeline confirmed here are the full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+