Car Sales హ్యుందాయ్‌కు మరోసారి షాకిచ్చిన టాటా మోటార్స్.. రెండో స్థానంలో స్వదేశీ దిగ్గజం
భారత మార్కెట్లో టాటా మోటార్స్(Tata Motors Sales) మరోసారి సత్తా చాటింది. స్వదేశంలో విదేశీ బ్రాండ్లను అధిగమిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. జనవరిలో హ్యుందాయ్ మోటార్స్‌ను అధిగమించి.. సేల్స్ పరంగా రెండో స్థానాన్ని కైవసం చేసుకోగా.. ఈ ఫిబ్రవరిలో కూడా అదే దూకుడును కొనసాగించింది. దీంతో దేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా నిలిచింది.
భారత్‌లో దేశీయ బ్రాండ్లకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రతి నెలా కార్ల సేల్స్ పరంగా రెండో స్థానంలో నిలుస్తూ వస్తున్న కొరియన్ బ్రాండ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్(Car Sales)కు.. మూడు నెలలుగా టాటా మోటార్స్ షాక్ ఇస్తూనే ఉంది. జనవరిలో నాలుగో స్థానంలో నిలిచిన హ్యుందాయ్ ఈ సారి కూడా రెండో స్థానాన్ని చేజార్చుకుంది.

టాటా మెటార్స్ దేశీయంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో(February 2024 Sales) 51,321 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. కాగా అదే నెలలో హ్యుందాయ్(Hyundai Sales In February 2024) మొత్తం దేశీయంగా 50,201 కార్లను విక్రయించింది. దీంతో హ్యుందాయ్ మోటార్స్ ఈ సారి కూడా రెండో స్థానాన్ని కోల్పోయింది.
ఈ కొరియన్ వాహన తయారీ సంస్థ గత 3 నెలల్లో టాటా మోటార్స్‌తో రెండవసారి తన నంబర్ 2 స్థానాన్ని కోల్పోయింది. అయితే గతేడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే హ్యుందాయ్ 6.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా మొత్తంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హ్యుందాయ్ కంటే టాటా మోటార్స్ 1100 ఎక్కువ కార్లను విక్రయించి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

హ్యుందాయ్ సేల్స్: ఇక గత నెలలో హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయంగా, ఎగుమతుల పరంగా 60,501 యూనిట్లను విక్రయించింది. కాగా గతేడాది ఫిబ్రవరిలో హ్యుందాయ్ 57,851 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. కేవలం భారత మార్కెట్లో సంస్థ గత నెలలో 50,201 యూనిట్ల సేల్స్ చేయగా.. 2023 ఫిబ్రవరిలో 47,001 యూనిట్లు సేల్ అయ్యాయి.
ఎగుమతుల పరంగా హ్యుందాయ్ గత నెలలో 10,300 యూనిట్ల ఎగుమతి అమ్మకాలను సాధించిగా.. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే 5.07 శాతం క్షీణతను నమోదు చేసింది. దీన్ని బట్టి.. హ్యుందాయ్ మోటార్స్ దేశీయంగా స్వల్ప శాతం వృద్ధిని సాధించగా.. ఎగుమతుల పరంగా స్వల్పంగా నష్టాలను చవిచూసింది.

టాటా మోటార్స్ సేల్స్: 2024 ఫిబ్రవరిలో టాటా మోటార్స్(Tata Motors Total Sales In February) మొత్తం అమ్మకాల్లో 8.4 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత నెలలో కంపెనీ దేశీయంగా, ఎగుమతుల పరంగా 86,406 వాహనాలను విక్రయించగా.. గతేడాది ఫిబ్రవరిలో 79,705 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది.
ఇక దేశీయ ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో, టాటా మోటార్స్ గత నెలలో 51,267 యూనిట్ల సేల్స్ నమోదు చేయగా.. గతేడాది ఇదే నెలలో 42,862 యూనిట్లను విక్రయించి 20 శాతం వృద్ధిని నమోదు చేసింది. అయినప్పటికీ ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో టాటా మోటార్స్ సేల్స్ తగ్గాయి. జనవరిలో సంస్థ 55,633 వాహనాలను విక్రయించింది.
ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కూడా టాటా మోటార్స్ హవా కొనసాగిస్తోంది. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో టాటా ఎలక్ట్రిక్ వాహనాల విభాగం 30 శాతం వృద్ధిని నమోదు సాధించి ఆ సెగ్మెంట్‌లో తన ఉనికిని చాటుకుంటోంది. గత నెలలో సంస్థ 6,923 యూనిట్ల ఈవీలను గతేడాది ఇదే నెలలో 5,318 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications








