మరోసారి డ్రీమ్ కార్లను సొంతం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చిన టాటా.. కొన్ని లక్షలు ఆదా అయ్యే మంచి అవకాశం..
దేశంలో ఇటీవల ముగిసిన పండుగ సీజన్‌లో ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు తమ సేల్స్‌ను పెంచుకోడానికి పలు మోడళ్లపై భారీ మొత్తంలో తగ్గింపులు, డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లను అందించాయి. దీంతో దసరా, దీపావళికి వాహనాల అమ్మకాలు ఓ రేంజ్‌లో నమోదయ్యాయి. ఈ తగ్గింపులను సద్వినియోగం చేసుకుని చాలా మంది తమ ఇంటికి కొత్త వాహనాలను తీసుకెళ్లారు. అయితే మరికొంత మంది తగిన సమయానికి చేతుల్లో డబ్బులు లేకపోవడమో లేక ఇతర కారణాల వలన అక్టోబర్ నెల పండుగ టైంలో కొత్త కార్లను కొనుగోలు చేయలేకపోయారు. అలాంటి వారికి నవంబర్ నెలలో మరోసారి మంచి అవకాశం లభించింది. దేశంలో భద్రత పరంగా అత్యుత్తమైన కార్లను తయారు చేసే కంపెనీగా పేరున్న టాటా మోటార్స్ (Tata Motors)ఎంపిక చేసిన మోడళ్లపై దాదాపు రూ.2.75 లక్షల వరకు తగ్గింపులను ప్రకటించింది.
టాటా కంపెనీ నవంబర్ నెలలో వినియోగదారుల కోసం హారియర్ (Harrier), సఫారి (Safari), ఆల్ట్రోజ్ (Altroz), నెక్సాన్ (Nexon), పంచ్ (Punch) వంటి అత్యంత ప్రముఖ మోడళ్లపై తగ్గింపులను అందిస్తుంది. వీటిలో ఒక్కో మోడల్‌కు ఒక్కో విధంగా డిస్కౌంట్‌ను ప్రకటించింది. కొన్నింటికి గరిష్టంగా రూ.2.75 లక్షల వరకు అందిస్తుంది. పండుగ సమయంలో తగ్గింపులు ఉన్నప్పుడు కొత్త కార్లను కొనుగోలు చేయలేని వారికి టాటా కంపెనీ ఇస్తున్న బంపర్ ఆఫర్ ఇది.

టాటా మోటార్స్ ప్రీ ఫేస్‌లిఫ్ట్ సఫారి, హారియర్ మోడల్స్‌పై రూ.2.75 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఇది 2023 మోడళ్లకు మాత్రమే వర్తిస్తుంది. స్టోర్‌లలో ఈ పాత మోడల్స్‌ను కలిగిన ఎంపిక చేసిన డీలర్‌లలో ఈ తగ్గింపును పొందవచ్చు. అదే సమయంలో ప్రస్తుత తరం సఫారి, హారియర్ మోడల్స్‌పై రూ.1.75 లక్షల తగ్గింపు అందుబాటులో ఉంటుంది.
అలాగే, 2024 ప్రస్తుత మోడల్‌లకు మాత్రం రూ.25,000 తగ్గింపును కంపెనీ అందిస్తుంది. ఈ తగ్గింపు ప్రయోజనాల్లో ఎక్కువగా నగదు డిస్కౌంట్, మిగిలినవి ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ సర్టిఫికేట్ బోనస్ వంటివి ఉంటాయి. ప్రీ ఫేస్‌లిఫ్ట్, ప్రస్తుత తరం సఫారి, హారియర్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్న వారు ఈ భారీ తగ్గింపుతో కార్లను తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు.

టాటా పంచ్ విషయానికి వస్తే, ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోతున్న కార్లలో ఈ కారు కూడా ప్రధానంగా ఉంటుంది. టాటా మోటార్స్ నవంబర్ నెలలో 2023 పంచ్ మోడల్‌పై దాదాపు రూ.40,000 వరకు తగ్గింపును ప్రకటించింది. అదే సమయంలో 2024 మోడల్‌లను ఎంచుకునే వారికోసం రూ.15,000 తగ్గింపును అందిస్తుంది. అయితే ఇటీవల లాంచ్ చేసిన కామో ఎడిషన్ , ఎంట్రీ-లెవల్ ప్యూర్ వేరియంట్‌పై ఎలాంటి తగ్గింపులు ఇవ్వలేదు.
టాటా ఆల్ట్రోజ్ కారు కూడా దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన మోడల్. ఇది ఒక ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. టాటా మోటార్స్ ఈ కారుపై రూ. 1.05 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. అయితే ఇంత తగ్గింపు మాత్రం 2023 మోడల్ కార్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ పెట్రోల్, డీజిల్, CNGతో సహా ఇతర అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది.

అదే 2024 మోడల్స్‌పై రూ.30,000 తగ్గింపును పొందవచ్చు. దీనిలో బేస్ XE మోడల్‌పై రూ.15,000 డిస్కౌంట్ ఉంది. టాటా నెక్సాన్ తగ్గింపు గురించి మాట్లాడుకుంటే, ఇదో పాపులర్ మెడల్. ఈ సబ్-కాంపాక్ట్ SUVపై భారీ తగ్గింపును టాటా అందిస్తుంది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ 2023 మోడల్‌పై రూ.1.35 లక్షల వరకు తగ్గింపు ఉంది. అదే ఫేస్‌లిఫ్ట్ మోడళ్లపై మాత్రం రూ.80,000లు, 2024 మోడళ్లపై రూ. 30,000 తగ్గింపును కంపెనీ అందిస్తుంది.


Click it and Unblock the Notifications








