ఈ ఏడాది టాటా మోటార్స్‌ నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. టాటా Curvv ఫస్ట్‌ గ్లింప్స్‌ చూశారా.??

భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2024(Bharat Mobility Global Expo 2024) లో టాటా మోటార్స్.. తన కొత్త టాటా హారియర్ EV ని ప్రదర్శించింది. Acti.ev ఆర్కిటెక్చర్‌పై సంస్థ ఈ కారును నిర్మిస్తోంది. కాగా త్వరలోనే టాటా హారియర్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని సంస్థ విడుదల చేయనుంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

టాటా మోటార్స్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ కారు టాటా హారియర్‌ ఈవీ త్వరలో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ కార్ల సెగ్మెంట్‌లో నాలుగు కార్లను విడుదల చేసిన సంస్థ.. మరికొన్ని నెలల్లో మరో కారును విడుదల చేయనుంది. ఈ క్యాలెండర్‌ ఇయర్‌ చివర్లో Tata Harrier EV ని టాటా మోటార్స్‌ లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం.

Tata-Curvv-First-Glimpse-And-Tata-Harrier-EV-Unveil

2024 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో షోలో టాటా ప్రొడక్షన్‌- స్పెక్‌ Curvv తో పాటు హారియర్‌ EV ని కూడా సంస్థ ప్రదర్శించింది. టాటా హారియర్‌ ఈవీ ఫుల్‌ ఛార్జింగ్‌పై 500 కి. మీ రేంజ్‌తో విడుదల కానుంది. దీంతో అత్యధిక రేంజ్‌ ఇచ్చే బ్రాండ్‌ ఫ్లాగ్‌షిప్‌ SUV లలో టాటా హారియర్‌ ఈవీ అగ్రస్థానంలో ఉండనుంది. అంతే కాకుండా ఇది వెహికల్-టు-లోడ్ మరియు వెహికల్-టు-వెహికల్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.

ఫీచర్ల విషయానికొస్తే టాటా హారియర్‌ ఈవీ డిజైన్‌, ఇంటీరియర్‌ పరంగా అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. బ్యూటిఫుల్‌ బాడీ వర్క్‌తో పాటు ప్రకాశవంతమైన లోగో, ఎక్స్‌టీరియర్‌ పరంగా విస్తృత LED డేటైమ్ రన్నింగ్ లైట్లు ఫంక్షనల్ మరియు ఎమోటివ్ లైటింగ్‌తో పాటు ఏరోడైనమిక్‌ సెరేటెడ్ టర్బైన్ బ్లేడ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లేయర్డ్ డ్యాష్‌బోర్డ్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి టాప్‌ రేంజ్‌ ఫీచర్లతో రానుంది. ఇంకా ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, టచ్-ఆధారిత కంట్రోలింగ్‌తో పాటు సేఫ్టీ పరంగా మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ADAS సిస్టమ్ ఇంకా అధునాతన ఫీచర్లతో వస్తుంది. ధర విషయానికొస్తే రూ. 25 లక్షలు కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది.

Tata-Curvv-First-Glimpse-And-Tata-Harrier-EV-Unveil

కాగాా ఇప్పటికే Acti.ev ఆర్కిటెక్చర్‌ ఆధారంగా నిర్మించిన టాటా పంచ్‌ ఈవీ ఇటీవలే టాటా మోటార్స్‌ లాంచ్‌ చేసింది. ఎలక్ట్రిక్ కర్వ్‌ను ఇదే ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా రూపొందించినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఇంకా అత్యాధునిక ఫీచర్లను అందించడంతో పాటు డ్రైవింగ్‌ అనుభవాన్ని పెంపొందించేలా క్లాస్-బెస్ట్ ఎఫిషియెన్సీ, స్పేస్ మరియు బ్యాటరీ కెపాసిటీని ఎనేబుల్ చేసేలా ఈ ప్లాట్‌ఫామ్‌ ఉంటుందని సంస్థ తెలిపింది.

ఇక టాటా మోటార్స్‌ ఈ ఏడాదిలోనే టాటా కర్వ్‌(Tata Curvv SUV) ఎస్‌యూవీని ఐసీఈ మరియు ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఫస్ట్‌ గ్లింప్స్‌ను భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2024 లో ప్రదర్శించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tata-Curvv-First-Glimpse-And-Tata-Harrier-EV-Unveil

కాగా డిజైన్‌ పరంగా దాదాపుగా టాటా నెక్సాన్‌, పంచ్, హారియర్‌ ఇంకా సఫారీ మోడళ్లనే కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. అదే LED DRL లు, గ్రిల్‌, బంపర్‌, హెడ్‌లైట్‌ యూనిట్లను అప్‌డేట్‌ చేశారు. టాటా కర్వ్‌ ముందు భాగంలో స్కిడ్‌ ప్లేట్‌ను జోడించింది. కాగా గతేడాది ఆటో ఎక్స్‌పో 2023లో టాటా కర్వ్‌ కాన్సెప్ట్‌ను సంస్థ ప్రదర్శించగా.. నేడు ప్రదర్శించిన మోడల్‌లో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి.

తాజా వెర్షన్‌లో కొత్త అల్లాయ్‌ డిజైన్‌లు, బ్లాక్‌ క్లాడింగ్‌లతో పెద్ద వీల్‌ ఆర్చ్‌లు, ఫ్లష్‌ డోర్‌ హ్యాండిల్స్‌ ఉన్నాయి. వెనుకవైపు కనెక్ట్‌ చేయబడిన LED టెయిల్‌లైట్లతో మోడిఫై చేశారు. దాదాపుగా డిజైన్‌ పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ ఏడాదిలో టాటా హారియర్‌ ఈవీ, టాటా కర్వ్‌ ఈవీ లాంచ్‌ అయితే.. అత్యధిక ఎలక్ట్రిక్‌ కార్లను కలిగి ఉన్న సంస్థగా టాటా మోటార్స్‌ నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 1, 2024, 17:10 [IST]
English summary
Tata motors breaks harrier ev cover and shares first glimpse of curvv bharat mobility global expo
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+