టాటా ఎలక్ట్రిక్ కార్లపై రూ. 3 లక్షల వరకు డిస్కౌంట్.. ఈ పండుగ ఆఫర్‌ని అస్సలు వదులుకోకండి!
రానున్న పండుగ సీజన్‌లో మంచి సేల్స్‌ని రాబట్టేందుకు టాటా మోటార్స్ పెట్రోల్, డీజీల్‌తో నడిచే కార్లపై భారీ డిస్కౌంట్స్‌ని ప్రకటిచింది. ఇప్పుడు తన ఎలక్ట్రిక్ కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను సంస్థ వెల్లడించింది. ఇది వరకే టాటా ప్రకటించింన 'ఫెస్టివల్ ఆఫ్ కార్స్' (Festival of Cars) కార్యక్రమంలో భాగంగా టాటా మోటార్స్ తాజాగా కంపెనీ లోని ఫేమస్ ఎలక్ట్రిక్ లైనప్స్ అయిన నెక్సాన్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై రూ .3 లక్షల వరకు, పంచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీపై రూ .1.20 లక్షల వరకు తగ్గించింది. దీంతో వీటి ధరలు భారీగా తగ్గనున్నాయి. ఈ డిస్కౌంట్ తర్వాత, టాటా నెక్సాన్ ఈవీ (Tata Nexon EV) ధర రూ .12.49 లక్షలు, టాటా పంచ్ ఈవీ (Tata Punch EV) ప్రారంభ ధర రూ .9.99 లక్షలుగా అయ్యింది. ఈ కార్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఎలక్ట్రిక్ కార్లలో తొలి స్థానంలో ఉన్న టాటా నెక్సాన్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారులోని 30 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ గల మోటార్ 129 ps గరిష్ట శక్తిని, 215 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 325 కిలోమీటర్ల రేంజ్ వరకు ప్రయాణిస్తుంది.

మరో 40.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ మోటార్ 144 ps శక్తిని, 215 టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే గంటకు 465 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీనిని డీసీ ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్‌తో కేవలం 56 నిమిషాల్లో 10 నుండి 80% ఛార్జ్ చేయవచ్చు. అందువల్ల కస్టమర్లు ఎక్కువగా దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
ఇక ఫీచర్ల పరంగా చూస్తే ఇందులో 12.3 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే 9-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, ఆటో ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్ వంటి అత్యాధునిక ఫీచర్లు దీనిలో ఉంటాయి.

డిస్కౌంట్‌లో లభిస్తున్న మరో కారు టాటా పంచ్ ఈవీ టాటా మోటార్స్ యాక్టి.ఈవీ (acti.ev) (అడ్వాన్స్డ్ కనెక్టెడ్ టెక్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్) ప్లాట్‌ఫామ్ ఆధారంగా పనిచేస్తుంది. హారియర్ ఈవీ, కర్వ్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ మోడళ్లలోనూ ఇదే ప్లాట్‌ఫామ్‌ని టాటా ఉపయోగించింది. ఈ యాక్టి.ఇవి ఆర్కిటెక్చర్ వివిధ పవర్‌ట్రెయిన్స్, డ్రైవ్‌ట్రెయిన్ వ్యవస్థలను కలిగి ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తుంది. అందులోని 25 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని ఫుల్ ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇది 80bhp పవర్, 114nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఛార్జ్‌పై 421 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఇది 120bhp పవర్, 190 nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.

ఈ పంచ్ ఎలక్ట్రిక్ కారులో 10.25 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 6-స్పీకర్ల సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్ వంటివి ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు కార్లు కూడా సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్‌ని కలిగి ఉన్నాయి. అందువల్ల ఇవి చాలా ఫేమస్ అయ్యాయి అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications








