రండి బాబు రండి.. టాటా కార్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్స్, రూ 30 వేల నుంచి రూ. 2.05 లక్షల వరకు తగ్గింపు!
రాబోయే పండుగ సీజన్‌ని దృష్టిలో ఉంచుకుని టాటా మోటార్స్ పెట్రోల్, డీజీల్, సీఎన్‌జీ మోడళ్ల ధరలను భారీగా తగ్గించింది. 'ఫెస్టివల్ ఆఫ్ కార్స్' (Festival of Cars) పేరుతో ఊహించని ధరలో కార్లను విక్రయించనునుంది. ఒక్కో కారుపై రూ. 30 వేల నుంచి రూ. 1.80 లక్ష వరకు తగ్గించింది. అంతే కాకుండా ఇతర బెనిఫిట్ ఆఫర్స్‌తో కలిపి మొత్తం రూ. 2.05 లక్షల వరకు తగ్గింపుని పొందవచ్చు. ఈ పండుగ సీజన్‌లో కార్లు కొనాలనుకునేవారికి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పాలి. ఎప్పటి నుంచో టాటా కార్లు కొనాలని భావిస్తున్న వారు తక్కువ ధరలో కార్లను సొంతం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
టాటా మోటార్స్ ప్రస్తుతం భారతదేశంలో టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్, సఫారీ మోడళ్లను విక్రయిస్తుంది. అయితే వీటిని లాంచ్ చేసిన ప్రారంభ ధరతో కాకుండా ఇప్పుడు తక్కువ ధరలో కార్లను అందించనున్నారు. అయితే ఈ ఆఫర్‌ని కేవలం కొన్ని రోజుల వరకు మాత్రమే అందించనుంది. ఏ ఏ కార్ల మోడళ్లపై ఎంత తగ్గింపు లభిస్తుందో ఇక్కడ చూసేయండి.

టియాగో (Tiago): ఇది కంపెనీ లభించే అత్యంత చౌకైన కారు మోడల్‌గా ఉంది. ఈ కారు ధర రూ. 65,000 తగ్గించారు. దీంతో దీని ప్రారంభ ధర రూ. 4,99,900కి చేరింది. ఈ ధర ప్రకారం ఈ హ్యాచ్‌బ్యాక్‌ని కేవలం రూ.5 లక్షలకే ఇంటికి తీసుకెళ్లవచ్చు అన్నమాట. బడ్జెట్‌లో ఓ మంచి కారు కొనాలనుకునే వారికి ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
టిగోర్ (Tigor): టాటా నుంచి అందుబాటులో ఉన్న మరో సరసమైన కారు మోడళ్లలో ఇదొకటి. ఈ కారు ధరను రూ. 30 వేలకు తగ్గించారు. ఇది సేఫ్టీలో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని కలిగి ఉంది. దీని ధర రూ. రూ.30,000 తగ్గించడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పుడు ఈ కారు రూ. 5,99,900 లకే లభించనుంది. ఇది వినియోగదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షించే అవకాశం ఉంది.

ఆల్ట్రోజ్ (Altroz): ఈ కారు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని కలిగి ఉంది. ఇది హ్యాచ్‌బ్యాక్‌ల్లో ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని ధరను రూ. 45,000 తగ్గించారు. దీంతో దీని ప్రస్తుత ధర రూ. 6.49 లక్షలకు తగ్గింది. ఈ కారుని పూర్తి అప్‌డేట్ చేసి జూన్‌లో కంపెనీ విడుదల చేసింది. కొత్తగా కారు కొనాలనుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు.
నెక్సాన్ (Nexon): టాటా నుంచి బెస్ట్ సెల్లింగ్ కారుగా ఉంది. ఇది ఎస్‌యూవీ కారు మోడల్. ఈ కారు సేఫ్టీలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ని కలిగి ఉండటం, మంచి మైలేజీ, ఫీచర్లు కూడా ఉండటంతో తక్కువ కాలంలోనే మార్కెట్‌లో సక్సెస్‌ఫుల్ కారుగా నిలిచింది. దీని ధరను రూ.80 వేలకు తగ్గించడంతో రూ. 7,99,990 లకే ఇది లభిస్తోంది.

హారియర్ (Harrier): ఈ కంపెనీలోని అత్యంత సేఫ్టీ కారు. దేశంలో సేఫ్టీలో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ కారు ధర రూ. 1.60 లక్షలు తగ్గింది. దీంతో దీని ప్రారంభ ధర రూ.14.99 లక్షలకు దిగి వచ్చింది. ఇది భారత్ NCAPలోనూ 5 స్టార్ రేటింగ్ పొందింది. భారీ డిజైన్, హై ప్రీమియం ఫీచర్లు ఈ కారులో కలవు.
సఫారీ (Safari): ఇది కూడా 5 స్టార్ రేటింగ్‌ని కలిగి ఉంది. ఇప్పుడు దీని ధర రూ. 1.80 లక్షలు తగ్గించారు. ఈ ధర తగ్గింపుతో దీని ప్రారంభ ధర రూ. 15.49 లక్షలకు దిగి వచ్చింది. ఈ కారులోనూ భారీ ఫీచర్లు, బెస్ట్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తాయి.

ప్రారంభ ధరను మాత్రమే తగ్గించారని బాధపడే వారికి టాటా మోటార్స్ రూ. 45,000 వరకు బెనిఫిట్స్‌ని ప్రకటించింది. ఇది అన్ని మోడళ్లు, వేరియంట్లకు వర్తించనుంది. దీని కింద క్యాష్ బ్యాక్, అదనపు ఫీచర్లను టాటా అందించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై కచ్చితమైన వివరాల కోసం దగ్గర్లోని షోరూమ్‌ని సంప్రదించడం ఉత్తమం. అయితే ఈ ధరల తగ్గింపు అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉండనుంది.


Click it and Unblock the Notifications








