Cars Price Hike కొత్త వాహనం కొనాలంటే ఇప్పుడే ప్లాన్ చేయండి.. ఏప్రిల్ 1 నుంచి వాటి ధరలు మరింత ప్రియం
భారత మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్(Tata Motors).. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ధరలు పెంచాలని యోచిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 1 నుంచి టాటా వాహనాల ధరలు పెరగనున్నాయి. మరి టాటా మోటార్స్.. ఎంత మేర ధరలు పెంచుతోంది. పూర్తి సమాచారం ఈ కథనంలో..
దేశీయ బ్రాండ్ టాటా మోటార్స్.. గత కొద్ది నెలలుగా విక్రయాల్లో దూసుకుపోతోంది. ముడి సరుకు ధరల పెరుగుదల దృష్ట్యా ఇటీవల పలు మార్లు టాటా కార్ల ధరలు పెంచినప్పటికీ.. ఆ ప్రభావం విక్రయాలపై మాత్రం చూపించడం లేదు. మెరుగైన బిల్ట్ క్వాలిటీ, ప్రయాణికుల సేఫ్టీ, సరికొత్త మోడళ్లతో కస్టమర్లను ఆకట్టుకోవడమే ఇందుకు కారణం.

ఈ క్రమంలో గత మూడు నెలలుగా విడుదలైన నెలవారీ విక్రయాల గణాంకాల్లో.. టాటా మోటార్స్ రెండో స్థానంలో నిలుస్తూ విదేశీ బ్రాండ్ కార్ల(Tata Vehicles Prices Hike)కు షాకిస్తోంది. దేశీయంగా, అంతర్జాతీయంగా టాటా తన బ్రాండ్‌ను సుస్థిరం చేసుకుంటోంది. ఈ క్రమంలో మరోసారి టాటా మోటార్స్.. తన వాహనాల ధరలు పెంచాలని యోచిస్తోంది.
అయితే ఈ పెంపుదల ప్యాసింజర్ వాహనాలపై కాదు.. వాణిజ్య వాహనాలకు వర్తించనుంది. టాటా మోటార్స్‌కు చెందిన వాణిజ్య వాహనాల విక్రయాలు కూడా ఆశాజనకంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో గతంలో పలుమార్లు కమర్షియల్ వెహికల్స్ ధరలు పెంచిన సంస్థ.. మరోసారి వీటి ధరలు పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం మేర 2 శాతం మేర ధరలు పెరగనున్నాయి.

టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలపై 2 శాతం ధరల పెంపు ఏప్రిల్(Tata Commercial Vehicles Prices Hike) 1 నుంచి వర్తించనుంది. కాగా ఈ ధర పెరుగుదల మోడల్ ఆధారంగా ఉంటుందని గమనించాలి. అయితే అన్ని రకాల వాణిజ్య వాహనాలపై ధరలు మాత్రం ఖచ్చితంగా పెరుగుతాయి. కాగా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ నంబర్ వన్‌గా కొనసాగుతోంది.
కాగా ధరల పెరుగుదల ఇప్పుడు టాటా కమర్షియల్ వెహికల్స్‌పై మాత్రమే వర్తించనుంది. ప్యాసింజర్ వాహనాల ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే ఈ ధరలు భారత్‌లో మాత్రమే వర్తించనున్నాయి. ఇతర దేశాలకు ఎగుమతి చేసే ధరలో ఎటువంటి మార్పు ఉండదని సంస్థ ప్రకటించింది.
ఇప్పటివరకూ టాటా మోటార్స్.. తన వాహనాలను 88 దేశాలకు ఎగుమతులు చేస్తోంది. కొరియన్ బ్రాండ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్‌కు టాటా బ్రాండ్ ప్యాసింజర్ కార్లు గట్టి పోటీనిస్తున్నాయి. నెక్సాన్, పంచ్, ఆల్ట్రోజ్, హారియర్.. ఇంకా పలు మోడల్ కార్లు టాటాకు మంచి సేల్స్‌ను అందిస్తున్నాయి. అంతేకాకుండా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో కూడా ఈ దేశీ బ్రాండ్ సత్తా చాటుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








