అదిరిపోయే డిస్కౌంట్స్ ప్రకటించిన టాటా మోటార్స్.. ఇప్పుడు కొంటే మీకే బెనిఫీట్!
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'టాటా మోటార్స్' (Tata మోటార్) ఎట్టకేలకు తన టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్ మరియు సఫారీ వంటి వాటి మీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా స్క్రాపేజ్ బోనస్ వంటివి లభిస్తాయి. ఈ బెనిఫిట్స్ కేవలం ఈ నెలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కంపెనీ అందించే ఈ ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
టాటా టియాగో
టాటా టియాగోపెట్రోల్ వేరియంట్స్ కొనుగోలు మీద గరిష్టంగా రూ. 55000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఇందులో రూ. 35000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 20000 ఎక్స్ఛేంజ్ / స్క్రాపేజ్ బోనస్ వంటివి ఉన్నాయి. CNG వేరియంట్ మీద రూ. 45000 వరకు తగ్గింపులు లభిస్తాయి. ప్రస్తుతం టాటా టియాగో ధర రూ. 5.65 లక్షల నుంచి రూ. 8.90 లక్షల మధ్య ఉంటుంది.

టాటా టిగోర్
ఈ నెలలో టాటా టిగోర్ పెట్రోల్ వెర్షన్ కొనుగోలు మీద రూ. 50000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. CNG వేరియంట్ మీద రూ. 45000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. దేశీయ మార్కెట్లో హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా మరియు మారుతి డిజైర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే ఈ కారు ధర రూ. 6.30 లక్షల నుంచి రూ. 9.55 లక్షల మధ్య ఉంది.
టాటా ఆల్ట్రోజ్
ఆల్ట్రోజ్ కొనుగోలు మీద టాటా మోటార్ ఈ నెలలో రూ. 45000 తగ్గింపు లభిస్తోంది. CNG వేరియంట్ మీద రూ. 35000 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్స్ వంటివి పొందుతుంది. ఈ కారు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 120 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టాటా నెక్సాన్
టాటా నెక్సాన్ పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్ల మీద రూ. 20000 వరకు స్క్రాప్‌పేజ్ / ఎక్స్‌ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ కాంపాక్ట్ SUV ధర రూ. 8 లక్షల నుంచి రూ. 15.80 లక్షల మధ్య ఉంది. ఇది మహీంద్రా XUV 3XO, కియా సోనెట్ మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
టాటా హారియర్
టాటా హారియర్ కొనుగోలు మీద కస్టమర్లు ఈ నెలలో రూ.30000 వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్ అన్ని వేరియంట్ల మీద లభిస్తుంది. ఈ కారు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 170 హార్స్ పవర్ మరియు 350 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు ధర రూ.15.49 లక్షల నుంచి రూ.26.44 లక్షల మధ్య ఉంటుంది.

టాటా సఫారీ
టాటా సఫారీ కొనుగోలు మీద రూ. 30000 డిస్కౌంట్ లభిస్తోంది. ఈ కారు ధర రూ. 16.19 లక్షల నుంచి రూ. 27.34 లక్షల మధ్య ఉంది. ఇది దేశీయ మార్కెట్లో ఎంజీ హెక్టర్ ప్లస్, మహీంద్రా XUV700, స్కార్పియో ఎన్ మరియు హ్యుందాయ్ అల్కజార్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.
Note: దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా మోటార్స్ ఎంపిక చేసిన తన కార్ల మీద ఈ నెల చివరి వరకు మాత్రమే తగ్గింపులను అందిస్తోంది. అయితే ఈ డిస్కౌంట్స్ డీలర్ వద్ద ఉన్న స్టాక్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి డిస్కౌంట్స్ గురించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని డీలర్‌ను సంప్రదించి తెలుసుకోవాలి.


Click it and Unblock the Notifications








