టాటా కార్లలో అత్యంత తక్కువ సేఫ్టీ కలిగిన కార్లు ఏంటో తెలుసా?.. అయినా కానీ వాటినే ఎక్కువగా ఇష్టపడుతున్న జనాలు!

ప్రస్తుతం టాటా కార్ల సేల్స్‌ తగ్గాయి. గత రెండు నెలలుగా మార్కెట్‌లో ఈ కంపెనీ కార్లు అమ్మకాల్లో 4 వ స్థానానికి పడిపోయాయి. తొలి స్థానంలో మాస్‌ మార్కెట్‌ కలిగిన మారుతి సుజుకి, రెండో స్థానంలో హ్యూందాయ్‌, మూడవ స్థానంలో మహీంద్రా కార్లు ఉన్నాయి. గత కొన్ని నెలల క్రితమే మహీంద్రా సేల్స్‌లో టాటా కార్లను బీట్‌ చేసింది. అయితే టాటా కార్లు సేఫ్టీకి పెట్టింది పేరుగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత విశ్వసనీయమైన కార్ల కంపెనీగా టాటా మోటార్స్‌ ఉంది. జనాలు కూడా అధిక సేఫ్టీ కలిగిన కార్లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతీ టాటా అమ్మకాలు తగ్గినా కానీ స్థిరంగా రాణిస్తోంది.

ఏదైనా కంపెనీ ప్రస్తుతం మార్కెట్‌లో కారుని విడుదల చేసే ముందు అందులో సేఫ్టీ ఫీచర్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. కార్ల సేఫ్టీ విషయంలో జనాల మైండ్‌సెట్‌ మారడంతో బడ్జెట్, మైలేజీ, ఫీచర్ల కంటే సేఫ్టీ కార్లకే ఓటేస్తున్నారు. టాప్‌లో కొనసాగుతున్న మారుతి సుజుకి నేడు విడుదల చేసిన న్యూ జనరేషన్‌ డిజైర్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో అదరగొట్టింది.

Tata Motors Least Safe Cars

మారుతి కార్లు అంతా సేఫ్‌ కావని భావించే వారు ఈ క్రాష్‌ టెస్ట్‌ రిజల్ట్‌ చెక్‌ పెట్టింది. ఈ కొత్త కారు సేఫ్టీలో దుమ్మురేపడంతో మాస్‌ మార్కెట్‌లో మంచి గ్రిప్‌ సంపాదించే అవకాశం ఉంది. ఈ పరిణామం వల్ల మారుతి సేల్స్‌ మరింత పెరగనున్నాయి. ఈ కారు అత్యున్నత సేఫ్టీ సాధించడం వల్ల టాటా మోటార్స్‌కి పెద్ద షాక్‌ అని చెప్పవచ్చు.

ఈ పరిణామం టాటా కార్ల సేల్స్‌ని దెబ్బతీయనుంది. అయితే భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటాకు చెందిన సఫారీ, హారియర్, పంచ్, నెక్సాన్లు 5 స్టార్ రేటింగ్‌ని సాధించింది. నెక్సాన్, పంచ్ ఎలక్ట్రిక్ వెర్షన్లు కూడా ఇదే ఫలితాలతో అదరగొట్టాయి. ప్రస్తుతం అమ్మకానికి ఉన్న టాటా కార్లన్నింటికీ 5 స్టార్ రేటింగ్‌ని కలిగి లేవు. ఓ రెండు కార్లు మాత్రం కేవలం 4 స్టార్‌ రేటింగ్‌ని కలిగి ఉన్నాయి.

Tata Cars Crash Test

టాటా మోటార్స్ విడుదల చేసిన చౌకైన కార్లుగా టియాగో, టిగోర్ ఉన్నాయి. టియాగో హ్యాచ్‌బ్యాక్ కాగా.. టిగోర్ కాంపాక్ట్ సెడాన్‌గా ఉంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో ఈ కార్లు 4 స్టార్ రేటింగ్ మాత్రమే సాధించాయి. టాటా మోటార్స్ విక్రయిస్తున్న అతి తక్కువ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్లు ఇవే కావడం విశేషం. టియాగో, టిగోర్ చివరిసారిగా 2021 లో గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లను ఎదుర్కొన్నాయి.

అడల్ట్స్‌ ప్యాసింజర్ ప్రొటెక్షన్ పరంగా ఈ కార్లు 17కు 12.52 స్కోర్‌ సాధించాయి. అలాగే చైల్డ్ ప్రొటెక్షన్‌లో 49కి 34.15 స్కోర్స్‌ సాధించాయి. మొత్తం మీద ఈ హ్యాచ్‌బ్యాక్, సెడాన్లు 4-స్టార్ రేటింగ్‌ని కలిగి ఉన్నాయి. అయితే 2022లో 'గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్'లను కఠినతరం చేశారు. అయితే ఈ కార్లు అంతకు ముందే పరీక్షించారు.

Tata Cars Global NCAP Crash Test Results

అప్పట్లో కేవలం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్‌, ABS, స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అనే మూడు అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. పాత నిబంధనల ప్రకారం ఫ్రంటల్‌ క్రాష్ టెస్ట్‌ని మాత్రమే నిర్వహించారు. కానీ 2022 తర్వాత సైడ్ ఇంపాక్ట్, సైడ్ పోల్ ఇంపాక్ట్, పాదచారుల సేఫ్టీ ప్రోటోకాల్ వంటివి చేర్చారు. అప్పటి నియమాలకు లోబడి ఈ కార్లు మోస్తారు స్కోర్‌ మాత్రమే సాధించిదని చెప్పవచ్చు.

అయితే ఈ కార్లు సేఫ్టీ రేటింగ్‌ తక్కువ ఉన్నా కానీ.. ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుంటే టాటా టియాగో, టిగోర్ కంపెనీలు తెరపైకి వస్తే రేటింగ్స్ కోల్పోయే అవకాశం ఉంది. టాటా టియాగో హ్యాచ్‌బ్యాక్ ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభవుతాయి.

More from DriveSpark

Article Published On: Monday, November 11, 2024, 17:38 [IST]
English summary
Tata motors least safe cars check crash test scores here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+