సమ్మర్‌లో టాటా మోటార్స్ కనివినీ ఎరుగని ఆఫర్లు.. ఈ కార్లపై ఏకంగా రూ. 1.25 లక్షల తగ్గింపు
ప్రతి నెలా ప్రారంభంలో ప్రముఖ కార్ల తయారీదారులు తమ కార్ మోడళ్లపై ఆఫర్లను అందిస్తున్నాయి. అలాగే ఈ సమ్మర్లో కూడా ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్(Tata Motors).. తన ప్రసిద్ధ SUV లు హారీయర్, సఫారీలపై అదిరిపోయే ఆఫర్లను తీసుకువచ్చింది. మరి ఈ నెలలో ఈ కార్లపై ఉన్న ఆఫర్లు ఏంటంటే..
టాటా డీలర్‌షిప్‌లు ఇప్పటికీ MY2023 కార్లు మరియు SUVలపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. వీటిలో Nexon, Harrier మరియు Safari యొక్క ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ ఉన్నాయి. అంతేకాకుండా పంచ్, ఆల్ట్రోజ్, టియాగో మరియు టిగోర్ యొక్క MY2024 మోడల్‌లపై ఆకర్షణీయమైన తగ్గింపులు మరియు ఆఫర్‌లను కూడా అందిస్తున్నారు.

టాటా హారియర్, సఫారీ: టాటా హారియర్ మరియు సఫారీ యొక్క ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లపై మొత్తం కస్టమర్లు ఏకంగా రూ.1.25 లక్షల తగ్గింపును పొందవచ్చు. ఇందులో రూ.75,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. ADAS టెక్నాలజీతో ఉన్న ఆటోమేటిక్ వేరియంట్‌లపై ఈ తగ్గింపు ప్రయోజనం పొందవచ్చు.
కాగా ADAS లేని టాటా హారియర్, సఫారీ వేరియంట్‌లపై రూ. 1 లక్ష వరకు తగ్గింపు అందిస్తోంది. ఫేస్‌లిఫ్ట్ యొక్క MY2023 మోడల్‌లను కొనుగోలు చేయాలనుకునే వారు మొత్తం రూ. 70,000 వరకు ప్రయోజనాలను పొందుతారు. కానీ ఈ నెలలో MY2024 మోడల్‌లకు ఎటువంటి తగ్గింపులు అందుబాటులో లేకపోవడంతో అంచనాలు తారుమారయ్యాయి.

ఈ రెండు SUVలు 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 170 bhp గరిష్ట శక్తిని మరియు 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. హారియర్ ప్రారంభ ధర రూ. 15.49 లక్షలు కాగా టాప్ స్పెక్ రూ. 26.44 లక్షలు.. సఫారీ రూ. 16.19 లక్షల నుంచి రూ. 27.34 లక్షల వరకు ఉంది.
టాటా నెక్సాన్: హారియర్ మరియు సఫారి లాగానే, టాటా డీలర్‌లు ఇప్పటికీ పెట్రోల్ మాన్యువల్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ నెక్సాన్ యొక్క కొన్ని మోడళ్లను స్టాక్‌లో కలిగి ఉన్నారు. ఈ మోడల్స్‌ను ఈ నెలలో రూ.90,000 వరకు తగ్గింపుతో కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. డీజిల్ మరియు పెట్రోల్ AMT వేరియంట్‌లపై రూ.70,000 వరకు తగ్గింపు పొందవచ్చు.
అక్టోబర్ మరియు డిసెంబర్ 2023 మధ్య తయారు చేయబడిన ఈ టాటా నెక్సాన్ మోడల్‌లు రూ. 45,000 వరకు ఆఫర్‌లను కలిగి ఉంటాయి, అయితే, టాటా మోటార్స్ MY2024 మోడల్‌లకు ఎలాంటి ప్రయోజనాలను అందించడం లేదు. Nexon ప్రస్తుతం 120 bhp శక్తిని ఉత్పత్తి చేసే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 115 bhp శక్తిని ఇచ్చే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది.

ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. అయితే, ఫేస్‌లిఫ్ట్ మోడల్ పెట్రోల్ కోసం 5-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. నెక్సాన్ ధర వేరియంట్లను బట్టి రూ. 8.15 లక్షల నుండి రూ. 15.80 లక్షల మధ్య ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు.
టాటా పంచ్: ఇక టాటా యొక్క అతి చిన్న SUV, పంచ్, ప్రస్తుతం MY2023 మోడల్‌లపై రూ. 10,000 నగదు తగ్గింపును పొందవచ్చు. అంతే కాకుండా MY2024 పంచ్ SUVలు ఎటువంటి ప్రయోజనాలు ఉండవని గమనించాలి. ఈ వాహనం పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ AMT మరియు CNG మాన్యువల్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

1.2-లీటర్ ఇంజిన్ పెట్రోల్ వెర్షన్‌లో 88 బీహెచ్‌పీ మరియు సీఎన్‌జీ మోడల్‌లో 74 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. పంచ్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.13 లక్షల నుండి ₹10.20 లక్షల వరకు ఉంటుంది. గత నెలలో కూడా పంచ్ మారుతీ మోడల్స్‌ను వెనక్కి నెట్టి విక్రయాల్లో అగ్రస్థానంలో నిలవడం విశేషం.


Click it and Unblock the Notifications








