టాటా ఆఫర్ తెలిస్తే షోరూమ్‌కు ఎగబడతారు.. ఈ కార్లపై కనివీని ఎరుగని డిస్కౌంట్..
దేశీయ దిగ్గజ వాహనాల తయారీ కంపెనీ టాటా మోటార్స్(Tata Motors) తన సేల్స్‌ను పెంచుకోడానికి వినియోగదారుల కోసం ఇటీవల పండుగ సమయంలో తగ్గింపులను అందించగా, కస్టమర్ల నుంచి విశేషమైన స్పందన రావడంతో కంపెనీ కార్లు విపరీతంగా అమ్ముడు పోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి వినియోగదారుల కోసం తగ్గింపు ధరను అందిస్తుంది. కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై డిసెంబర్ నెలలో ప్రత్యేకంగా డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుంది. ఎన్నడూ లేని విధంగా టాటా మోటార్స్ తన సఫారీ, హారియర్ ఎస్‌యూవీలపై రూ.3.7 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో 2024 ఏడాది ముగియనుంది. దీంతో ఈ నెలలోనే తక్కువ ధరలో కొత్త కారును కొనుగోలు చేసి రాబోయే 2025 ఏడాదిని మరింత ఉత్సాహంగా గడపచ్చు. అక్టోబర్ పండుగ సమయంలో ఆఫర్లను మిస్ అయిన వారికి చాలా మంచి అవకాశం.
అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే టాటా మోటార్స్ 2023 ఏడాదికి చెందిన హారియర్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై రూ.2.70 లక్షల తగ్గింపును అందిస్తుండగా, పాత వెర్షన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారు దాదాపు రూ.3.7 లక్షల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. వీటిలో వినియోగదారు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంటుంది. అలాగే, 2024 మోడల్‌పై రూ.45,000 వరకు తగ్గింపు ప్రయోజనాలు ఉన్నాయి. కొత్త కారు కొనే వారికి ఇది మంచి అవకాశం.

ఇంకా, టాటా సఫారీపై కూడా దాదాపు రూ.3.7 లక్షల వరకు తగ్గింపు ఉంది. వీటిలో డీలర్లు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ వంటివి ఉన్నాయి. అలాగే, 2023 మోడల్‌పై రూ.2.70 లక్షల వరకు, అదే 2024 వెర్షన్‌పై 45,000 వరకు తగ్గింపు ప్రయోజనాలను కంపెనీ అందిస్తుంది. కొత్త ఏడాదికి ముందు పాత స్టాక్‌ను క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంతో కంపెనీ ఈ తగ్గింపును తెచ్చింది. దీంతో డీలర్లు స్టాక్‌ను క్లియర్ చేసుకోవచ్చు.
టాటా సఫారీ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వచ్చింది. ఇది 167.6 bhp పవర్, 350 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎస్‌యూవీ ధర రూ.15.49 లక్షల నుంచి రూ. 26.79 లక్షల మధ్య ఉంది. దీని ఇంజిన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఈ కారులో 12.30-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి.

సఫారి SUVలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం JBL స్పీకర్ సౌండ్ సిస్టంను ఏర్పాటుచేశారు. ప్రయాణికుల భద్రత పరంగా ఈ కారు భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. దీనిలో మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇంకా లెవెల్-2 ADAS,ఎమర్జెన్సీ కాల్, డ్రైవర్ అటెన్షన్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్‌లను కలిగి ఉంటుంది.
టాటా హారియర్ SUV గురించి మాట్లాడుకుంటే దీని ధర రూ.14.99 లక్షల నుంచి రూ. 25.89 లక్షల వరకు ఉంటుంది. ఇది 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వచ్చింది. ఇంజిన్‌కు 6-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేశారు. ఈ కారు కూడా ప్రయాణికుల సేఫ్టీ పరంగా భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ను పొందింది.
హారియర్ డిజైన్ చాలా స్టైలీష్‌గా ఉంటుంది. క్యాబిన్ లోపల అధునాతన ఫీచర్లు ఉన్నాయి.10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ,టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, నావిగేషన్, అత్యంత నాణ్యతతో కూడిన సీట్లు, ఎలక్ట్రానిక్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం JBL స్పీకర్ సౌండ్ సిస్టం ఇంకా మరిన్ని ఫీచర్లు టాటా హారియర్‌లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








