భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్ కార్ల ధరలు.. ఇదిగో ఫ్రూఫ్‌, 30 శాతం ధరలు పడిపోవడం ఖాయం!

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్ సింహభాగాన్ని కలిగి ఉంది. ఈ కంపెనీకి చెందిన కార్లు భారీ సంఖ్యలో అమ్ముడువుతున్నాయి. అయితే గత రెండు నెలలుగా సేల్స్‌ కొద్దిగా తగ్గాయి. అయినా కానీ ఈ విభాగంలో టాటానే నంబర్‌ 1గా కొనసాగుతోంది. టాటా ఈవీ సేల్స్‌కి ఎంజీ మోటార్స్ పెద్ద గండి కొట్టిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ కంపనీ నుంచి ఎంజీ కామెట్‌ ఈవీ, ఎంజీ విండ్సర్‌ ఈవీ వైపు జనాలు చూస్తున్నారు. దీంతో టాటా కార్ల సేల్స్‌ కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే టాటా బ్రాండ్ వ్యాల్యూ వల్ల సేల్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈ సంస్థ కస్టమర్లకు ఓ తీపి కబురు చెప్పనుంది. ప్రస్తుతం ఉన్న టాటా ఎలక్ట్రిక్ కార్ల ధరలు ఏకంగా 30% వరకు తగ్గనున్నాయి.

టాటా ఈవీ కార్ల ధరలు తగ్గితే ఆ సంస్థ తిరుగులేని శక్తిగా అవతరిస్తుంది. దీంతో ఈఈ విభాగంలో దీని దరిదాపుల్లో ఏ కారు కంపెనీ కూడా వచ్చే అవకాశం ఉండదు. అయితే కార్ల ధరలు తగ్గించడం వెనక ఓ ఆప్షన్‌ ఉందనే విషయాన్ని కస్టమర్లు గమనించాలి. అదే "బ్యాటరీ-యాజ్‌-ఏ-సర్వీస్" (BaaS). ఈ విధానం ద్వారా బ్యాటరీకి అమౌంట్‌ చెల్లించకుండా కారుని కొనుగోలు చేయవచ్చు.

Tata Motors BaaS Option

ప్రస్తుతం ఏంజీ మోటార్స్‌ విండ్సర్‌ ఈవీని ఇదే పద్ధతినా విక్రయిస్తోంది. కస్టమర్లు బ్యాటరీ ఆప్షన్‌తోనూ ఈ కారుని కొనుగోలు చేయవచ్చు. అయితే కంపెనీ బ్యాటరీ సర్వీస్‌ కింద కంపెనీ కిలోమీటరు చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కస్టమర్లు తక్కువ ధరకే కారుని ఇంటికి తెచ్చుకోవచ్చు. బ్యాటరీని అద్దెకు తీసుకోవడం ద్వారా కిలోమీటర్‌కి చిన్నపాటి అమౌంట్‌ (ఉదా: ఎంజీ విండ్సర్‌ రూ. 3.50/km) చెల్లిస్తే సరిపోతుంది.

ఈ విధానం ద్వారా కస్టమర్లు తమకు నచ్చిన రేంజ్‌ వరకు మాత్రమే అద్దె చెల్లిస్తే చాలు మీరు కారుపై ఏం చక్కా తిరగవచ్చు. ఇదే పద్ధతిని టాటా అమలు చేయనుంది. అదే జరిగితే టాటా ఎలక్ట్రిక్ కార్ల ధరలు సుమారు రూ. 2-3.5 లక్షల వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది ఈ రంగం అభివృద్ధికి సైతం దోహదపడుతుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.

Tata Electric Cars Price Drop

బ్యాటరీని విడిగా అద్దెకు తీసుకోవడం ద్వారా సొంత అవసరాల కోసం కార్లు కొనుగోలు చేసేవారికి కలిసి వస్తుంది. ప్రస్తుతం టాటా ఎలక్ట్రిక్ వాహనాల లైనప్స్‌లో టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ వంటి మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవే కార్లు మార్కెట్‌లో టాప్‌లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టాటా పంచ్‌ ఈవీకి మంచి డిమాండ్‌ ఉంది.

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్‌ కార్లను BaaS ఆప్షన్‌ ద్వారా విడుదల చేయడం EV మార్కెట్‌ ఉరుకులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వీటి ఎక్స్-షోరూమ్ ధరలు 25% నుంచి 30% తగ్గుతాయి. ఎలక్ట్రిక్‌ కారు భాగాల్లో బ్యాటరీ అత్యంత కాస్ట్లీ కావడం వల్ల ఈ ఆప్షన్‌తో అవసరాన్ని బట్టి అద్దె చెల్లించి కారుని వాడుకోవచ్చు. ఈ విధానం ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షిస్తుంది.

Tata EV Cars

ఇది ఇంకా ప్లానింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానాన్ని వచ్చే మోడల్స్‌లో అమలు చేయాలా లేదా ఇప్పటికే అందుబాటులో ఉన్న వాటితో ఇంప్లీమెంట్‌ చేయాలా అనే అంశాలపై టాటా ఈవీ చర్చిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎంజీ మోటార్ విండ్సర్ ఈవీని బ్యాటరీని అద్దె ప్రతిపాదికన అందిస్తున్న ఏకైక సంస్థగా ఉంది. దీనికి మంచి రెస్పాన్స్‌ వస్తుండటంతో టాటా కూడా దీనిని అమలు చేసే యోచనలో ఉంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 23, 2024, 9:20 [IST]
English summary
Tata motors planning to implement baas option in all electric vehicles
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+