ఒక్క ప్లాంట్.. 10 లక్షల యూనిట్స్: అదరగొట్టిన టాటా మోటార్స్

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) ఇటీవల గుజరాత్‌లోని తన సనంద్ ప్లాంట్ నుంచి 1 మిలియన్ యూనిట్ (10 లక్షలు) విడుదల చేసింది. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం..

మన దేశంలో ఎక్కువ మందికి నమ్మికయిన బ్రాండ్ ఏది అంటే ముందుగా గుర్తొచ్చేది 'టాటా'. కంపెనీ ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అత్యత్తమ కార్లను లాంచ్ చేసి మంది అమ్మకాలను పొందగలుగుతోంది. అయితే సనంద్ ప్లాంట్ నుంచి కంపెనీ టిగోర్, టియాగో ఈవీ, టియాగో సీఎన్‌జీ, టిగోర్ సీఎన్‌జీ, టైగర్ ఈవీ మరియు XPRES-T EV వంటి మోడల్స్ తయారు చేస్తోంది.

Tata Motors Rolled Out Over 10 Lakh Units

2010లో నిర్మించబడిన సనంద్ ప్లాంట్ సుమారు 1100 ఎకరాల్లో నిర్మించబడి ఉంది. అయితే ఇందులో 359 ఎకరాల విస్తీర్ణంలో వెండర్ పార్క్ ఉంది. ఈ కర్మాగారంలో సుమారు 6000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు సమాచారం. దేశంలో అతి తక్కువ వయసున్న ప్లాంట్లలో ఇది కూడా ఒకటి. అయితే ఉత్పత్తి విషయంలో పెద్ద కర్మాగారాలకు ఏ మాత్రం తీసిపోకుండా దూసుకెళ్తోంది.

సనంద్ ప్లాంట్ నుంచి 1 మిలియన్ యూనిట్ ఉత్పత్తిని విడుదల చేసిన సందర్భంగా కంపెనీ టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ అండ్ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ 'శైలేష్ చంద్ర' మాట్లాడుతూ.. సనంద్ ప్లాంట్ నుంచి 1 మిలియన్ యూనిట్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కస్టమర్లు ఉత్పత్తుల మీద పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.

Tata Motors Rolled Out Over 10 Lakh Units

బ్రాండ్ వృద్ధిని ప్రోత్సహించడం మాత్రమే కాకుండా.. చిన్న కార్లను కస్టమర్లకు సకాలంలో డెలివరీ చేయడమే ఫ్యాక్టరీ ప్రధాన ఉద్దేశమని శైలేష్ చంద్ర అన్నారు. ప్రారంభంలో ప్లాంట్ 1.35 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగలిగింది, ఇప్పుడు ఈ సంఖ్య 1.9 లక్షలకు పెరిగిందని అన్నారు. మిడ్ సైజ్ సెగ్మెంట్‌లోని కస్టమర్ల నుంచి భారీ డిమాండ్ చూసిన తరువాత కంపెనీ సామర్థ్యాన్ని పెంచడం జరిగిందని పేర్కొన్నారు.

ప్లాంటులో డీజిల్ మోడల్‌ల అసెంబ్లింగ్ పూర్తిగా నిలిపివేసినట్లు, ఇప్పుడు ఫ్యాక్టరీలో కేవలం ఈవీలు మరియు పెట్రోల్ మోడల్స్ ఉత్పత్తి మాత్రమే సాగుతోందని ఎండీ శైలేష్ చంద్ర అన్నారు. ఉత్పత్తిలో సరికొత్త మైలురాయి చేరుకోవడంలో ప్రధాన పాత్ర పోషించిన మా ఉద్యోగుల కృషి అనన్య సామాన్యమని ప్రశంసలు కురిపించారు. అంతే కాకుండా భాగస్వాములకు మరియు ముఖ్యంగా గుజరాత్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

Tata Motors Rolled Out Over 10 Lakh Units

భారతదేశం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహన రంగంలో పరుగులు పెడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో టాటా మోటార్స్ కూడా మరిన్ని కొత్త ఈవీలను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చే ఏడాది (2025) నాటికి కనీసం ఐదు కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో తెలుస్తాయి.

నిజానికి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో టాటా మోటార్స్ హవా చాలా ఉంది. నెక్సాన్ ఈవీ మార్కెట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఎనలేని అమ్మకాలను పొందుతూ.. ప్రతి నెలలోనూ కొత్త కస్టమర్లను ఆకర్శించడంలో విజయం పొందుతోంది. కాగా కంపెనీ కూడా కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా ఇందులోనే కొత్త ఎడిషన్స్ లాంచ్ చేస్తూ వారికి మరింత చేరువవుతోంది. ఈ కారణంగానే మార్కెట్లో టాటా ఈవీలకు మంచి ఆదరణ ఉంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, March 11, 2024, 11:30 [IST]
English summary
Tata motors rolled out over 10 lakh units at sanand plant
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+