ఈ జనాలకు ఏమైందీ? మంచి సేఫ్టీ కార్లను వదిలేసి సోకుల కార్లను కొంటున్నారు, ప్రాణం ముఖ్యం బిగులు!

మార్కెట్‌లో టాటా మోటార్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. ఈ కంపెనీ నుంచి మార్కెట్‌లో విడుదల అయ్యే కార్లు కస్టమర్లకు అత్యంత నమ్మదగిన బ్రాండ్‌గా ఉన్నాయి. ఈ సంస్థకు చెందిన కార్లు సేఫ్టీలో నంబర్‌ 1గా ఉండటంతో భారీ సంఖ్యలో జనాలు వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ కంపెనీ సెప్టెంబర్ అత్యంత చెత్త సేల్స్‌ని నమోదు చేసింది. కంపెనీ అమ్మకాలు అన్ని విభాగాల్లో క్షీణించాయి. టాటా ఉత్పత్తులకు ప్రజల్లో ఆదరణ లభిస్తున్నప్పటికీ అమ్మకాలు తగ్గుముఖం పట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం.

ప్రస్తుతం అన్ని వాహన తయారీ సంస్థలు సెప్టెంబర్ నెలకు సంబంధించిన అమ్మకాల గణాంకాలను విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగా టాటా మోటార్స్ కూడా సెప్టెంబర్ నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. ఈ సేల్స్‌ రిపోర్ట్ పలువురిని ఆశ్చర్యానికి గురిచేయడంతో పాటు కంపెనీకి ఝలక్‌ ఇచ్చాయనే చెప్పాలి. గతంలో ఎన్నడూ లేనంతగా టాటా మోటార్స్ సెప్టెంబర్‌లో చెత్త రికార్డులను నమోదు చేసింది.

Tata Motors September 2024 Sales Report

ఈ సంస్థ సెప్టెంబర్‌ 2024లో కేవలం 41,063 యూనిట్ల కార్లను మాత్రమే విక్రయించింది. 2022 డిసెంబర్ తర్వాత సెప్టెంబర్‌లో అత్యల్ప అమ్మకాలు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇదే సంస్థకు చెందిన కార్లు గత ఏడాది 2023 సెప్టెంబర్‌లో 44,089 వాహనాలు విక్రయించింది. ఈ సంవత్సరం 8.36 శాతం క్షీణత నమోదైంది.

ఇదే సంస్థ 2024 ఆగస్టులో మొత్తం 44,142 వాహనాలను విక్రయించింది. వీటితో పోలిస్తే 3079 వాహనాలు తగ్గి 6.98 శాతం అమ్మకాలు క్షీణించాయి. ఈ క్షీణతకు ఖచ్చితమైన కారణం తెలియ రాలేదు. కానీ కంపెనీ అన్ని సెగ్మెంట్‌లలో (హ్యాచ్‌బ్యాక్స్‌, ఎస్‌యూవీ) అతి తక్కువ సంఖ్యలో వాహనాలను విక్రయించింది. ఇతర సంస్థల కార్లు మార్కెట్‌లో కొత్త కార్లతో దూసుకెళ్తుండటం వల్ల టాటా కార్ల అమ్మకాలకు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్నారు.

Tata Motors September 2024 Sales Report

ఇక దీని ఎగుమతుల విషయానికొస్తే సెప్టెంబర్‌లో కేవలం 250 వాహనాలు మాత్రమే ఎగుమతి అయ్యాయి. గత ఏడాది సెప్టెంబరులో 508 వాహనాలు ఎగుమతి చేసింది. అంటే ఎగుమతుల్లోనూ టాటా కార్లు తేలిపోయాయి. ఇక ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లు దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే వీటి అమ్మకాలు కూడా కాస్త తగ్గాయి. టాటా మోటార్స్ ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలు క్షీణించడం కంపెనీకి పెద్ద లాస్‌గా చెప్పవచ్చు.

ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్‌ కార్లు సెప్టెంబరులో కేవలం 4,650 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇదే సంస్థ 2023 సెప్టెంబర్‌లో 6,050 వాహనాలను విక్రయించింది. ప్రస్తుతం 1370 వాహనాలు తక్కువగా అమ్ముడుపోయాయి. టాటా మోటార్స్ మొత్తం ప్యాసింజర్ విభాగంలో 41,313 యూనిట్లను విక్రయించింది. 2023 సెప్టెంబర్లో 45,317 వాహనాలను విక్రయించింది. ఇది కంపెనీ పేలవమైన అమ్మకాలకు దారి తీసింది.

Tata Motors Sales

టాటా మోటార్స్ కూడా కమర్షియల్ సెగ్మెంట్‌లో వాహనాలను విక్రయిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో అమ్మకాలు కూడా పడిపోయాయి. కంపెనీకి ఇది మరో అతిపెద్ద షాక్. హెవీ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ గత నెలలో 9,295 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 12,867 యూనిట్లను విక్రయించింది, ఇది 28% క్షీణతను చవిచూసింది.

గత నెలలో కంపెనీ 30,032 వాణిజ్య వాహనాలను విక్రయించింది. 2023 సెప్టెంబర్లో 39064 వాహనాలను విక్రయించింది. దీంతో అమ్మకాలు 23 శాతం పడిపోయాయి. రెండో త్రైమాసిక అమ్మకాల్లో 6 శాతం క్షీణత నమోదైంది. ఇది నిజంగా టాటా అభిమానులకు షాక్ అనే చెప్పాలి. ఈ అమ్మకాలు తగ్గడానికి గల కారణాలను కనుగొని వాటి పరిష్కారం దిశగా కంపెనీ పనిచేస్తే మళ్లీ గాడిలో పడే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, October 2, 2024, 15:47 [IST]
English summary
Tata motors september 2024 sales report check details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+