Tata Motors టాటా మోటార్స్ సంస్థ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి నుంచి అమల్లోకి..!
టాటా మోటార్స్ (Tata Motors) భారతీయులకు నమ్మకమైన కార్ల తయారీ సంస్థల్లో ఒకటిగా ఉంది. టాటాకు చెందిన అనేక కార్లు 4 మరియు 5 స్టార్ రేటింగ్‌ను కలిగి ఉన్నాయి. ఈ వాహనాల బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ ఫీచర్ల కారణంగా కార్ల విక్రయాలు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా టాటా మోటార్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
కార్ల ధరలు పెంచుతూ టాటా సంస్థ నిర్ణయం తీసుకొంది. పెరిగిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని టాటా మోటార్స్ సంస్థ ప్రకటన చేసింది. వాహనాల ధరలు సగటున 0.7 శాతం పెరగనున్నాయి. ఉత్పత్తి ఖర్చులు పెరగడంతోనే ధరలను పెంచుతున్నట్లు సంస్థ ప్రకటన చేసింది.

ప్రస్తుతం టాటా సంస్థ భారత్ మార్కెట్‌లో 11 రకాల కార్లను విక్రయిస్తోంది. టాటా టియాగో, టిగోర్, పంచ్, ఆల్ట్రోజ్, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కార్లు సహా టాటా టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ వాహనాలున్నాయి. 2025లో టాటా ఆల్ట్రోజ్ ఈవీని అందుబాటులోకి తీసుకురానుంది.
*టాటా మోటార్స్ గత వారం టాటా పంచ్ ఈవీని (Tata Punch EV) విడుదల చేసింది. ఈ సరికొత్త ఈవీ డెలివరీలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది. బుకింగ్‌లు కూడా ఇప్పటికే ప్రారంభం కాగా.. కస్టమర్లు రూ. 21,000 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు.

టాటా పంచ్ EVని స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్+ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్, స్మార్ట్+ వేరియంట్లు.. స్టాండర్డ్ రేజ్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన మూడు వేరియంట్లు స్టాండర్డ్ మరియు లాంగ్ రేంజ్ వెర్షన్‌లలో ప్రవేశపెట్టింది.
ఈ ఈవీ స్టాండర్డ్ రేంజ్ 25kWh, లాంగ్ రేంజ్ 35kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. స్టాండర్డ్ రేంజ్ సింగిల్ ఛార్జింగ్‌పై 315 కి.మీ, లాంగ్ రేంజ్ 421 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. స్టాండర్డ్ రేంజ్ ఎలక్ట్రిక్ మోటార్ 80bhp మరియు 114Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, లాంగ్ రేంజ్ 120bhp మరియు 190Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
లాంగ్ రేంజ్ వేరియంట్ కోసం 7.2 kW ఫాస్ట్‌చార్జర్ అందుబాటులో ఉండగా.. స్టాండర్డ్ రేంజ్ కోసం 3.3 kW వాల్‌బాక్స్ ఛార్జర్‌ను సంస్థ అందిస్తోంది. ఫీచర్ల పరంగా 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.. Apple CarPlay మరియు Android Auto కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఆటో ఫోల్డ్ ORVMలు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, లెథెరెట్ సీట్లు, ప్యాడిల్ షిఫ్టర్లు, సన్‌రూఫ్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








