వాహనప్రియులకు శుభవార్త!.. టాటా నెక్సాన్ సిఎన్‌జీ లాంచ్ ఎప్పుడంటే?
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా మోటార్స్ యొక్క విజయవంతమైన మోడల్ నెక్సాన్ (Nexon) ఇప్పటికే పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. అయితే కంపెనీ ఈ కారును సిఎన్‌జీ రూపంలో తీసుకురావడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కంపెనీ ఈ కారును ఈ ఏడాది ప్రారంభంలో జారిన భారత్ మొబిలిటీ షోలో కాన్సెప్ట్ ఉత్పత్తిగా ఆవిష్కరించింది. కాగా ఈ కారును కంపెనీ 2025నాటికి మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
భారతదేశంలో పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా సిఎన్‌జీ వాహనాలకు కూడా డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులను సిఎన్‌జీ రూపంలో లాంచ్ చేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే టాటా మోటార్స్ తన నెక్సాన్ కారును సిఎన్‌జీ మోడల్‌గా లాంచ్ చేయడానికి సంకల్పించింది.

ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తిరుగులేని అమ్మకాలను పొందిన టాటా నెక్సాన్.. రాబోయే రోజుల్లో సిఎన్‌జీ రూపంలో కూడా అందుబాటులో ఉండనుంది. ఈ వార్త నెక్సాన్ ప్రియులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. రాబోయే నెక్సాన్ ఈవీ పెట్రోల్ కారు కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.
టాటా నెక్సాన్ సిఎన్‌జీ డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా దాదాపు దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయితే దీనిని సిఎన్‌జీ కారుగా గుర్తించడానికి కొన్ని లేబుల్స్ లేదా బ్యాడ్జెస్ ఉంటాయి. అంతే కాకుండా సిఎన్‌జీకు సంబంధించిన కొన్ని మెకానికల్ అప్‌గ్రేడ్‌లు కూడా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం. కాబట్టి టాటా నెక్సాన్ లాంచ్ చేయనున్న కొత్త సిఎన్‌జీ మోడల్ పాత మోడల్ మాదిరిగానే ఉంటుందని అవగతమవుతోంది.

రాబోయే టాటా నెక్సాన్ సిఎన్‌జీ మోడల్.. దాని పెట్రోల్ వేరియంట్ మాదిరిగానే 1.2లీటర్ టర్బోచార్జ్డ్ త్రీ-సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి టర్బోచార్జ్డ్ సిఎన్‌జీ కారు అని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటివరకు సిఎన్‌జీ మోడల్స్ అన్నీ కూడా పెట్రోల్ మోడల్స్. కానీ రాబోయే నెక్సాన్ సిఎన్‌జీ మాత్రం టర్బోచార్జ్డ్ మోడల్ అని తెలుస్తోంది. ఇది టియాగో మరియు టిగోర్ సిఎన్‌జీ కార్ల మాదిరిగానే అదే గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది.
టాటా నెక్సాన్ సిఎన్‌జీ మోడల్ దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత ఇప్పటికే అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న మారుతి బ్రెజ్జా సిఎన్‌జీ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఈ కారు అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. ఈ కారు యొక్క ధరలు మరియు మైలేజ్ వంటి వివరాలు రాబోయే రోజుల్లో లేదా లాంచ్ సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే గొప్ప అమ్మకాలతో దూసుకెళ్తున్న టాటా నెక్సాన్.. రానున్న రోజుల్లో సిఎన్‌జీ రూపంలో లాంచ్ అవుతుందని ఇప్పటికే స్పష్టమైపోయింది. కాబట్టి వాహన ప్రేమికులు ఈ మోడల్ ఎలా ఉంటుంది. ఎంత మైలేజ్ ఇస్తుంది. ధర ప్రత్యర్థులకంటే ఎక్కువగా ఉంటుందా? తక్కువగా ఉంటుందా అనే విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








