సేఫ్టీలో రారాజు.. క్రాష్ టెస్ట్‌లో అదరగొట్టిన Tata Nexon EV: ఏకంగా..
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా మోటార్స్ యొక్క 'నెక్సాన్ ఈవీ' (Nexon EV) ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతూనే ఉంది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందింది. ఇటీవల ఈ కారుకు నిర్వహించిన భారత్ ఎన్‌సీఏపీ (Bharath NCAP) క్రాష్ టెస్ట్‌లో ఏకంగా 5 స్టార్ రేటింగ్ కైవసం చేసుకుంది. దీంతో ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారు తెగ సంబరపడిపోతున్నారు. టాటా నెక్సాన్ యొక్క సేఫ్టీ రేటింగ్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో.. టెస్ట్ చేసిన కారు టాటా నెక్సాన్ ఈవీ టాప్ వేరియంట్. ఈ ఎలక్ట్రిక్ కారు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో మొత్తం 32పాయింట్లకు 29.86పాయింట్లు సాధించింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ క్రాష్‌లో మరియు సైడ్ ఇంపాక్ట్ టెస్ట్‌లో డ్రైవర్ అండ్ ఫ్రంట్ ప్యాసింజర్ ఇద్దరికీ మంచి రక్షణను అందించింది. మొత్తం మీద అడల్ట్ సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ సాధించి సురక్షితమైన కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది.

చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విషయానికి వస్తే.. నెక్సాన్ ఈవీ 49 పాయింట్లకు గాను 44.95 పాయింట్లు సాధించింది. క్రాష్ టెస్ట్‌లలో చైల్డ్ టెస్ట్ డమ్మీలకు అందించబడిన భద్రతలో 24 పాయింట్లకు గాను 23.95 పాయింట్లు సాధించింది. మొత్తం మీద చైల్డ్ సేఫ్టీలో కూడా ఉత్తమ రేటింగ్ సాధించింది. దీంతో టాటా నెక్సాన్ ఈవీ అటు వయోజనుల రక్షణలోనూ, ఇటు పిల్లల రక్షణలోనూ మంచి స్కోర్ సాధించిందని స్పష్టమైంది.
నిజానికి భారత్ ఎన్‌సీఏపీ మరియు గ్లోబల్ ఎన్‌సీఏపీ అనేవి దాదాపు సారూప్యంగా ఉంటాయి. గ్లోబల్ ఎన్‌సీఏపీ కింద అడల్ట్ సేఫ్టీ రేటింగ్ అనేది 34 పాయింట్లకు ఉంటే.. భారత్ ఎన్‌సీఏపీలో అడల్ట్ సేఫ్టీ రేటింగ్ అనేది 32 పాయింట్లకు ఉంటుంది. ఇది కాకుండా క్రాష్ టెస్ట్ ప్రోటోకాల్‌లు మరియు రేటింగ్‌ల కేటాయింపు దాదాపు ఒకేలా ఉంటాయి. ఉత్తమ భద్రతా ఫీచర్స్ ఉన్నప్పుడే ఏదైనా ఉత్తమ రేటింగ్ ఇస్తుంది.

టాటా నెక్సాన్ ఈవీ
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టాటా నెక్సాన్ ఈవీ ధరలు రూ.14.49 లక్షల నుంచి రూ.19.29 లక్షల (ధరలు ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ కారు స్లిప్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ లైట్ స్ట్రిప్ వంటి వాటిని పొందుతుంది. ఇది చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. నెక్సాన్ అనేది ప్రస్తుతం ఎలక్ట్రిక్ రూపంలో మాత్రమే కాకుండా పెట్రోల్ వేరియంట్ రూపంలో కూడా లభిస్తుంది.
ఫీచర్స్ విషయానికి వస్తే.. టాటా నెక్సాన్ ఈవీ 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ పొందుతుంది. 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, వాయిస్ కమాండ్, ఏసీ వెంట్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, డ్రైవర్ డిస్ప్లే మొదలైనవన్నీ ఇందులో ఉంటాయి. ఇవన్నీ వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి. ఈ కారణంగానే ఎక్కువమంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు.
టాటా నెక్సాన్ ఈవీ 30కిలోవాట్స్ బ్యాటరీ మరియు 40.5కిలోవాట్స్ బ్యాటరీ పొందుతుంది. ఇవి రెండూ ఒక ఫుల్ చార్జితో వరుసగా 325 కిమీ మరియు 465 కిమీ రేంజ్ అందిస్తాయి. డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా అత్యుత్తమ రేంజ్ అందించే ఈ కారు అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. కాబట్టి ప్రమాదంలో కూడా ఇవి ప్రయాణికులను రక్షించడానికి దోహదపడతాయి.


Click it and Unblock the Notifications








