కొత్త ఈవీ కారు కొనాలంటే ఇదే మంచి ఛాన్స్.. సేఫ్టీలో టాటా తోపు మోడల్‌పై రూ.2.5 లక్షల తగ్గింపు..

దేశంలో ఆటోమొబైల్ తయారీ రంగంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి టాటా మోటార్స్(Tata Motors) వాహనాల అమ్మకాల పరంగా ఇతర కంపెనీల కంటే ముందు స్థానంలో ఉంటుంది. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరలో కార్లను విడుదల చేస్తుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు పలు మోడళ్లను తీసుకురాగా, ఇవన్నీ కూడా మార్కెట్లో మంచి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే టాటా మోటార్స్ తన కార్ల విక్రయాలు పెంచుకోవడానికి వినియోగదారులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ప్రత్యేకంగా తగ్గింపు ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఇటీవల ముగిసిన పండుగ సమయంలో కంపెనీ ఎంపిక చేసిన మోడళ్లపై పలు డిస్కౌంట్స్ అందించగా, చాలా మంది వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త కార్లను తమ ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో ముగుస్తున్న తరుణంలో కంపెనీ తన టియాగో హ్యాచ్‌బ్యాక్ ఈవీ(Tata Tiago EV)పై భారీ తగ్గింపును అందిస్తుంది.

టియాగో ఈవీ ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న హ్యాచ్‌బ్యాక్. ఈ కారుపై కంపెనీ ప్రత్యేకంగా రూ.2.5 లక్షల తగ్గింపును ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే కంపెనీ బేస్, మిడ్ రేంజ్ టియాగో ఈవీపై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు ఇస్తుంది. అదే లాంగ్ రేంజ్ వేరియంట్‌పై రూ.2.5 లక్షలు ఆఫర్ చేస్తుంది.

Tata Motors Offering Huge Discount

2024 ఏడాది ముగింపుకు దగ్గరగా ఉన్న సమయంలో డీలర్లు, షోరూమ్‌ల వద్ద ఉన్న పాత స్టాక్‌ను క్లియర్ చేసుకోడానికి ఈ విధమైన తగ్గింపును అందిస్తుంది. పండుగల సమయంలో కొత్త కార్లను కొనుగోలు చేయలేని వారు ఈ తగ్గింపుతో టియాగో ఈవీని సొంతం చేసుకోవచ్చు.

ప్రస్తుతం టాటా టియాగో ఈవీ ధర రూ. 8 లక్షలు(బెంగళూరు)గా ఉంది. ఇండియాలో ఈవీ కార్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వినియోగదారులకు అందుబాటు ధరలోనే ఈ కారు లభిస్తుంది. చిన్న కుటుంబం కలిసి ప్రయాణించడానికి ఇది అనువుగా ఉంటుంది.టియాగోకు గట్టి పోటీ ఇస్తున్న మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ ధర కూడా టియాగో ఈవీ కంటే కొంచెం ఎక్కువగా ఉంది. Wagon R ఇండియాలో రూ.8.92 లక్షలకు లభిస్తుంది.

Tata Motors Huge Discount On Tiago Ev

రెండిట్లో టాటా టియాగో ఈవీ మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. సాధారణ ఇంజిన్ వేరియంట్‌ల నుంచి ఎలక్ట్రిక్ కారువైపు మారాలనుకునే వారికి ఈ ఆఫర్ బాగా ఉపయోగపడుతుంది. ఇది బేస్, మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్ వేరియంట్లలో ఉంది. నగర రోడ్లకు టియాగో సరిగ్గా సరిపోతుంది. మిడ్ రేంజ్‌లో సింగిల్ ఛార్జ్‌పై 250 కి.మీ వెళ్తుంది. అదే లాంగ్ రేంజ్‌పై 315 కి.మీలు ప్రయాణిస్తుంది.

టియాగో ఈవీలో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. క్యాబిన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లోపల 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రయాణంలో ఎంటర్‌టైన్ మెంట్ కోసం 8-స్పీకర్ హర్మాన్ సౌండ్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, లోపల మంచి గాలి కోసం ఎయిర్ ప్యూరిఫైయర్, యాపిల్ కార్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టైప్ సీ USB ఛార్జింగ్, మెరుగైన భద్రత ఫీచర్లు కారులో ఉన్నాయి.

Tata Motors Tiago Ev

ప్రమాద సమయంలో టియాగో లోపల ఉన్న ప్రయాణికులకు ఎలాంటి రక్షణ కల్పిస్తుందా అని నిర్వహించిన గ్లోబల్ క్రాష్ టెస్ట్(GNCAP క్రాష్ టెస్ట్‌)లో ఈ కారు మెరుగైన భద్రతను కనబరిచి సేఫ్టీలో 4 స్టార్ రేటింగ్ సంపాదించింది. ఛార్జింగ్ సమస్యపై దృష్టి సారించి ఫాస్ట్ ఛార్జర్ సదుపాయాన్ని అందించింది. తక్కువ ధరలో ఈవీ కారు కోరుకునే వారికి ఈ హ్యచ్‌బ్యాక్ మంచి ఆప్షన్ అవుతుంది.

More from DriveSpark

Article Published On: Monday, November 25, 2024, 15:38 [IST]
English summary
Tata offering up to rs 2 5 lakh discount on tiago ev check all details
Read more on: #tata motors #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+