పండుగ సీజన్‌ కోసం ప్రత్యేక 'టాటా పంచ్‌ క్యామో ఎడిషన్‌' విడుదల.. దీని లుక్‌ చాలా హాట్‌ గురూ!

పండుగ సీజన్‌లో కార్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. దసరా, దీపావళి పండుగ సీజన్‌లో జనాలు ఎక్కువగా కార్లను కొంటారు. దీంతో కంపెనీలు భారీ సంఖ్యలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కార్లను, స్పెషల్‌ ఎడిషన్స్‌ని విడుదల చేస్తున్నాయి. తాజాగా దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కూడా టాటా పంచ్ ప్రత్యేక లిమిటెడ్ క్యామో ఎడిషన్ (Tata Punch CAMO Edition)ను ప్రవేశపెట్టింది. ఈ స్పెషల్‌ ఎడిషన్‌ని 2022 లోనే కంపెనీ లాంచ్‌ చేసింది. తాజాగా కొన్ని అప్‌డేట్స్‌తో మరోసారి మార్కెట్‌లో తీసుకువచ్చింది.

తాజాగా విడుదలైన ఈ స్పెషల్‌ ఎడిషన్‌ వైట్ రూఫ్, 16 ఇంచెస్‌ చార్‌కోల్‌ గ్రే అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. ప్రత్యేకమైన క్యామో మోడల్‌ ప్రీమియం గ్రీన్ కలర్‌లో అద్భుతంగా కనిపిస్తుంది. దీని ప్రారంభ ధరను రూ .8,44,900 (ఎక్స్-షోరూమ్ న్యూఢిల్లీ)గా నిర్ణయించింది. పంచ్ క్యామో స్పెషల్‌ ఎడిషన్‌ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు టాటా మోటార్స్ వెబ్‌సైట్‌లో ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు.

Tata Punch CAMO special edition Launch

ఈ అప్‌డేటెడ్‌ స్పెషల్‌ ఎడిషన్‌లో రియర్‌ ఏసీ వెంట్స్‌, వైర్‌లెస్‌ ఛార్జ్‌ ప్యాడ్‌, టైప్‌ సీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ప్యాడ్‌, సెంటర్‌ కన్సోల్‌ ఆర్మ్‌రెస్ట్‌, అలాగే 10.25 ఇంచెస్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. సెంటర్‌ కన్సోల్‌ ఆర్మ్‌రెస్ట్‌ కారులో ప్రీమియం అనుభూతిని పెంచుతుంది. వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేకి ఇది సపోర్ట్‌ చేస్తుంది.

పంచ్ క్యామో స్పెషల్‌ ఎడిషన్‌ అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 87bhp, 115 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్‌లతో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ 18.9 కి.మీ నుంచి 20 కి.మీ మైలేజీని అందిస్తుంది.

ఇక టాటా పంచ్ సేఫ్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జీఎన్‌సీఏపీ రేటింగ్‌లో 5-స్టార్ రేటింగ్ సంపాదించింది. ఇందులోని స్ట్రాంగ్ డిజైన్, 187 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్, కమాండింగ్ డ్రైవింగ్ పొజిషన్ భారతీయ భూభాగాలను సరిపోయేలా ఉంటుంది. అందువల్ల వీటిని జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలో ఇది నంబర్‌ వన్‌గా ఉంది. అందువల్ల దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఉంది.

ఇది డ్రైవింగ్‌లో మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. ఈ కారణంగానే ఈ కారు కేవలం 10 నెలల్లో 1 లక్ష అమ్మకాల మార్కును, 34 నెలల్లో 4 లక్షల అమ్మకాల మార్కును చేరుకుంది. ప్రస్తుతం వీటికి ఇంకా డిమాండ్ తగ్గలేదు. టాటా మోటార్స్ తన పంచ్ పెట్రోల్, డ్యూయల్ సిలిండర్ సీఎన్‌జీ, ఎలక్ట్రిక్‌ కారుతో సహా మల్టీ పవర్‌ట్రైన్‌ ఆప్షన్స్‌తో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ఇది ప్రస్తుతం దాని విభాగంలో చిన్న కుటుంబానికి సరిపోతుంది. విశాలమైన ఇంటీరియర్స్, సేఫ్టీని కలిగి ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో అన్ని సెగ్మెంట్‌లో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలువడానికి ఇదే కారణం. టాటా పంచ్‌ ఈవీ 315 కి.మీ నుంచి 421 కి.మీ రేంజ్‌ని అందిస్తుంది. ఇందులోని 7.2W AC ఛార్జర్‌ సహాయంతో ఫుల్‌ ఛార్జ్‌ చేయడానికి 3 గంటల నుంచి 5 గంటలు పడుతుంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, October 5, 2024, 7:20 [IST]
English summary
Tata punch camo special edition launched at rs 8 44 lakhs check details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+