ఈ ఆర్థిక సంవత్సరంలో జనాలు ఎక్కువగా కొంటున్న కారు ఇదే.. 5 స్టార్ సేఫ్టీ, 27 కి.మీ మైలేజీ, క్లాసీ డిజైన్‌!

టాటా పంచ్‌ (Tata Punch SUV) ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన SUVగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మొత్తం 1,17,560 యూనిట్ల టాటా పంచ్‌ కార్లు సేల్‌ అయ్యాయి. తద్వారా దేశంలోనే సేల్స్‌లో ఈ ఎస్‌యూవీగా నంబర్‌ 1గా ఉంది. ఇదే కారుని టాటా మోటార్స్‌ గత ఆర్థిక సంవత్సరం ఇదే సమాయానికి కేవలం 87,943 యూనిట్లను మాత్రమే సేల్‌ చేసింది. గత ఏడాదితో పోల్చితే ఈ కారు అమ్మకాలు 34 శాతం పెరిగాయి. దీంతో మొత్తం ఎస్‌యూవీ అమ్మకాల్లోనూ తిరుగులేని శక్తిగా ఉంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ కారు 4 లక్షల యూనిట్‌ సేల్స్‌ మార్క్‌ని చేరుకుంది.

ఈ కారుని పెట్రోల్‌, సీఎన్‌జీ, ఈవీ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు సేఫ్టీ పరంగా 5 స్టార్ రేటింగ్‌ని కలిగి ఉంది. BNCAP క్రాష్‌ టెస్టు ఎదుర్కొన్న కార్లలోనే టాటా పంచ్‌ అత్యధిక స్కోర్‌ని సాధించింది. ఈ కారు పెద్దల సేఫ్టీలో 32కు 31.46 పాయింట్లు, పిల్లల సేఫ్టీలోలో 49కి 45 పాయింట్లతో సేఫెస్ట్ కారుగా చలామణీ అవుతోంది.

Tata Punch Sales in 2025 Financial Year

టాటా పంచ్‌ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 25 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఫుల్‌ ఛార్జ్‌పై 315 కి.మీ, లాంగ్ రేంజ్ 35 కిలోవాట్ల బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 421 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. 7.2 kWh ఏసీ ఫాస్ట్ ఛార్జర్‌ సహాయంతో ఈ బ్యాటరీ ప్యాక్స్‌ని కేవలం 5 గంటల్లో 0 నుంచి 100 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చు.

అలాగే 50 kWh డీసీ ఛార్జర్‌తో ఫుల్‌ ఛార్జ్‌ చేయడానికి కేవలం 56 నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రస్తుతానికి ఈ టాటా పంచ్‌ ఈవీ ధరలు రూ .9.99 లక్షల నుంచి రూ .14.29 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉన్నాయి. పంచ్‌ ఈవీని స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ అనే ఐదు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.

Tata Punch Sales

ఇక రెగ్యూలర్‌ టాటా పంచ్‌ 1.2-లీటర్, త్రీ-సిలిండర్ న్యాచ్‌రల్‌ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్‌ 5-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌ జతచేయబడి ఉంటుంది. ఈ పంచ్‌ ICE వెర్షన్‌ని ప్యూర్, ప్యూర్ (ఓ), అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అడ్వెంచర్ S, అడ్వెంచర్ ప్లస్ S, క్రియేటివ్ ప్లస్, క్రియేటివ్ ప్లస్ ఎస్, అన్‌కాంప్లికేటెడ్ ప్లస్ ఎస్ అనే ఏడు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.

టాటా పంచ్‌ ఫుల్‌ ప్యాక్డ్‌ ఫీచర్లతో వస్తుంది. ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్‌, వైర్‌లెస్‌ ఛార్జర్ వంటి ఫీచర్లు కలవు. వీటితో పాటు 10.25-టచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, సింగిల్ పేన్‌ పనోరమిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్‌ స్మార్ట్‌ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Tata Punch SUV Sales in 2025 Finacial Year

ఇక సేఫ్టీ పరంగా ఇది బెస్ట్‌ అని చెప్పాలి. బ్లైండ్ స్పాట్ మానిటర్, 360 డిగ్రీల సరౌండ్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టచ్ బేస్డ్ HVAC ప్యానెల్ వంటి ఫీచర్లు ప్రయాణికులకు మెరుగైన రక్షణను అందిస్తాయి. టాటా పంచ్‌ సీఎన్‌జీ అత్యధికంగా 27 కి.మీ మైలేజీని ఇస్తుంది.

2024 లో అప్‌డేటెడ్‌ చేసిన టాటా పంచ్ ఎస్‌యూవీ టాటా తీసుకువచ్చింది. కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో సెంటర్ కన్సోల్‌ యుఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్‌ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, బ్యాక్‌లో ఏసీ వెంట్స్‌ని అందించింది. దీని ధరలు 7.43 లక్షల నుంచి 12.47 లక్షల (ఎక్స్‌ షోరూమ్‌) మధ్య ఉన్నాయి. ఈ కారు మార్కెట్‌లో నేరుగా సిట్రోయిన్ సీ3, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లకు గట్టి పోటీని ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 29, 2024, 12:09 [IST]
English summary
Tata punch currently top in suv sales for the 2025 financial year
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+