Tata Punch EV Full Review Video: 421 కి.మీ రేంజ్‌తో టాటా పంచ్‌ ఈవీ ఫుల్ రివ్యూ వీడియో..!

దేశంలో టాటా పంచ్‌ ICEకి మంచి ఆదరణ లభిస్తోంది. టాటా మోటార్స్‌ నుంచి ఎలక్ట్రిక్‌ కార్ల సెగ్మెంట్‌లోకి టియాగో, టిగోర్‌, నెక్సాన్‌ ప్రవేశించగా.. ఇప్పుడు మెక్రో SUV టాటా పంచ్‌ EV ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీగా ప్రవేశించింది. ఈ క్రమంలో ఈ కారును మా డ్రైవ్‌స్పార్క్‌ టీమ్‌ టెస్ట్‌ డ్రైవ్‌ చేసింది. పూర్తి రివ్యూ వీడియోను ఇక్కడ అందిస్తున్నాం.

టాటా పంచ్(Tata Punch EV Review) ఈవీ మొదటి లుక్‌లో దాని తోబుట్టువు ICE మాదిరిగా కనిపిస్తుంది. అయితే డిజైన్‌ పరంగా కొన్ని మార్పులు చేశారు. ఇంటీరియర్‌ పరంగా క్యాబిన్‌లో చాలా మార్పులు చేశారు. 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంటేషన్‌ స్క్రీన్‌తో పాటు ఇన్ఫోటైన్‌మెంట్ స్ర్కీన్‌ను అందించారు. టాటా పంచ్‌(Tata Punch EV Features) ఈవీలో ఫ్రంట్ సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

టాటా పంచ్‌ ఈవీలో లిక్విడ్-కూల్డ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను అందించారు. బేస్ పంచ్ EV 80.46 bhp మరియు 114 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుండగా.. ఇది 315 km రేంజ్‌తో 25 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. లాంగ్ రేంజ్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో 421km రేంజ్‌ కోసం 35 kWh బ్యాటరీని ఉపయోగించారు. 120.7 bhp మరియు 190 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Tata-Punch-EV

భద్రత విషయానికొస్తే టాటా పంచ్‌ ఈవీలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, చుట్టూ డిస్క్ బ్రేక్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్‌తో సహా అనేక సేఫ్టీ కిట్‌ ఫీచర్లతో వస్తుంది. పంచ్ EVలో సస్పెన్షన్ సెటప్ దాని ICE వెర్షన్‌ మాదిరిగానే కొంచెం గట్టిగా ఉండటాన్ని గమనించవచ్చు. గరుకు రోడ్లపై వేగంగా ప్రయాణించినా ఒడుదొడుకులు లేకుండా స్థిరంగా ప్రయాణిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 23, 2024, 16:39 [IST]
English summary
Tata punch ev 2024 micro suv features battery range full review video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+