Tata Punch EV: టాటా పంచ్‌ ఈవీ డెలివరీలు ప్రారంభం.. సింగిల్‌ ఛార్జ్‌తో 421 కి.మీ రేంజ్‌

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ గత వారం టాటా పంచ్‌ ఈవీని విడుదల చేసింది. టాటా మోటార్స్‌ ఇప్పటికే టాటా టియాగో, టిగోర్‌, నెక్సాన్‌ ఎలక్ట్రిక్‌ కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టగా.. ఇటీవల మరో ఎలక్ట్రిక్‌ కారు టాటా పంచ్‌ EV ని విడుదల చేసింది. కాగా ఈ సరికొత్త ఈవీ డెలివరీలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.

భారత మార్కెట్లో టాటా మోటార్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. బిల్ట్‌ క్వాలిటీ, మెరుగైన పనితీరుతో కస్టమర్లకు టాటా కార్లు ఫేవరెట్‌గా మారాయి. ముఖ్యంగా మైక్రో SUV సెగ్మెంట్‌లో టాటా పంచ్‌ మంచి డిమాండ్‌ను సంపాదించుకుంది. దీంతో ఈ కారు ఎలక్ట్రిక్‌ వెర్షన్‌ను ఇప్పుడు సంస్థ మార్కెట్లో పోటీగా నిలబెట్టింది. Tata Punch EV ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు(ఎక్స్‌-షోరూమ్‌).

Tata-Punch-EV

దేశవ్యాప్తంగా టాటా పంచ్‌ ఈవీ డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును కస్టమర్లు డెలివరీ తీసుకుంటున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఈ కారు బుకింగ్‌లు కూడా ఇప్పటికే ప్రారంభం కాగా.. కస్టమర్లు రూ. 21,000 చెల్లించి బుకింగ్‌ చేసుకోవచ్చు. ఇక టాటా పంచ్‌ బ్యాటరీ, ఫీచర్లు, డిజైన్ విషయానికొస్తే..

టాటా పంచ్ EVని స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్+ అనే ఐదు వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు. అయితే మొదటి రెండు వేరియంట్లు.. స్టాండర్డ్ రేజ్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా.. చివరి మూడు వేరియంట్లను స్టాండర్డ్ మరియు లాంగ్ రేంజ్ వెర్షన్‌లలో ప్రవేశపెట్టింది.

Tata-Punch-EV

టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారును టాటా మోటార్స్‌.. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ప్రవేశపెట్టింది. ఒకటి స్టాండర్డ్‌ రేంజ్‌(Standard Range SR) 25 kWh, మరొకటి లాంగ్‌ రేంజ్‌(Long Range) 35 kWh బ్యాటరీ ప్యాక్‌లతో కొనుగోలు చేయవచ్చు. స్టాండర్డ్‌ రేంజ్‌ టాటా పంచ్‌ ఈవీ పూర్తి ఛార్జింగ్‌పై 315 కి.మీ రేంజ్‌ను ఇస్తుంది. ఎలక్ట్రిక్‌ మోటార్‌ 80bhp మరియు 114Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

టాటా పంచ్‌ ఈవీ లాంగ్‌ రేంజ్‌ 421 కి.మీ రేంజ్‌ను అందిస్తుంది. 120bhp మరియు 190Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. లాంగ్‌ రేంజ్‌ వేరియంట్‌ కోసం 7.2 kW ఫాస్ట్‌చార్జర్ అందుబాటులో ఉండగా.. స్టాండర్డ్‌ రేంజ్‌ కోసం 3.3 kW వాల్‌బాక్స్ ఛార్జర్‌ను సంస్థ అందిస్తోంది.

Tata-Punch-EV

డిజైన్‌ పరంగా కొత్త టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు ఆకర్షణీయంగా ఉంది. ముందు భాగంలో టాటా లోగోకి దిగువన ఛార్జింగ్ ఫ్లాప్‌ను కలిగి ఉంటుంది. ఇంకా ఫ్రంట్‌ బంపర్‌పై LED హెడ్‌ల్యాంప్‌లు మరియు ఫాగ్ ల్యాంప్‌లను అమర్చారు. ఆకర్షణీయమైన 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉండటంతో పాటు.. నాలుగు డిస్క్ బ్రేక్‌లతో వస్తుంది.

Tata-Punch-EV

టాటా పంచ్ EVని టాటా యొక్క కొత్త Acti.EV (అడ్వాన్స్‌డ్ కనెక్టెడ్ టెక్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ వెహికల్) ప్లాట్‌ఫారమ్‌ ఆధారంగా నిర్మించారు. ఫీచర్ల పరంగా 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.. Apple CarPlay మరియు Android Auto కి కనెక్ట్‌ చేసుకోవచ్చు.

అప్‌డేటెడ్‌ సెంటర్ కన్సోల్ ఇప్పుడు టచ్-సెన్సిటివ్ AC కంట్రోల్ ప్యానెల్‌తో వస్తుంది. అంతే కాకుండా టాటా పంచ్ EV ఒక కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను ఇల్యూమినేటెడ్ టాటా లోగోను కలిగి ఉంటుంది. డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీ, 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మరియు AQI డిస్ప్లేతో కూడిన ఎయిర్ ప్యూరిఫైయర్‌తో పాటు అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

Tata-Punch-EV

ఇంకా టాటా పంచ్‌ ఈవీ ఆటో ఫోల్డ్ ORVMలు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, లెథెరెట్ సీట్లు, ప్యాడిల్‌ షిఫ్టర్లు, సన్‌రూఫ్‌ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌తో ఆరు ఎయిర్‌బ్యాగులను కలిగి ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, January 22, 2024, 14:02 [IST]
English summary
Tata punch ev deliveries commence in india price battery range features details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+