అదరగొట్టిన టాట్‌ పంచ్ EV.. BNCAP క్రాష్‌ టెస్ట్‌లో 5 స్టార్‌ రేటింగ్‌.. దీని జోరుకి అడ్డు వచ్చే కారేదీ?

దేశంలో అందుబాటులో ఉన్న కార్ల విషయానికి వస్తే సేఫ్టీ విషయంలో ఈ బ్రాండ్‌కి చెందిన కార్లు టాప్‌లో ఉన్నాయి. స్వదేశీ కార్ల సేఫ్టీ అసెస్మెంట్ ప్రోగ్రామ్ భారత్ BNCAPలో టాటా కార్లకు మొదట 5 స్టార్ రేటింగ్ లభించింది. టాటా సఫారీ మరియు హారియర్ ఫేస్ లిఫ్ట్ మోడళ్లు భారత్ NCAPలో 5-స్టార్ రేటింగ్ పొందిన మొదటి కార్లుగా ఉన్నాయి. తాజాగా భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో మరో టాటా కారు A ప్లస్ స్కోర్‌ని సాధించింది. టాటా లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు పంచ్ ఈవీ మెరుపుల్లో సేఫ్టీలో తన సత్తాను చాటింది. ఈ కారు తాజా క్రాష్‌ టెస్ట్‌కి సంబధించిన పూర్తి వివరాలు మీ కోసం..

టాటా పంచ్ ఈవీ భారత్ NCAP టెస్ట్‌లో పెద్దలు మరియు పిల్లల సేఫ్టీలో 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఈ సేఫ్టీ మార్క్‌ని సాధించిన మరో టాటా కారుగా నిలిచింది. ప్యాసింజర్ ప్రొటెక్షన్ లో ఈ కారు టోటల్‌ 32 పాయింట్స్‌కి 31.46 మార్కులు సాధించింది. ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు గాను 45.00 పాయింట్లు సాధించింది.

Tata-Punch-Ev-Crash-Test

టాటా పంచ్ ఈవీ అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్) మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESP) వంటి భద్రతా ఫీచర్లను అందిస్తుంది. బ్లైండ్ స్పాట్ మానిటర్, ఐసోఫిక్స్ మౌంట్లు, అన్ని సీట్లకు త్రీ పాయింట్ సీట్ బెల్ట్స్‌ వంటి అదనపు భద్రతా ఫీచర్లతో అందుబాటులో ఉంది.

టాటా పంచ్‌ జెన్ 2 EV ఆర్కిటెక్చర్ లేదా యాక్టిడాట్‌ ఈవీ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి పనిచేసే మొదటి మోడల్ ఇదే కావడం విశేషం. పంచ్ ఈవీ స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్ ప్లస్‌ అనే ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారును ఐదు కలర్ ఆప్షన్లు, మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.

Tata-Punch-EV-BNCAP-Rating

నెక్సాన్ ఈవీ నుంచి డిజైన్ కొద్దిగా ఒకేరీతినా ఉన్నప్పటికీ పంచ్ ఈవీ ఆకట్టుకునే లుక్‌తో వస్తుంది. ముందు భాగంలో ఛార్జింగ్ సాకెట్‌ని కలిగి ఉన్న మొదటి టాటా ఈవీ కూడా పంచ్. పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ఆప్షన్లలో వస్తుంది. 25 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ మీడియం రేంజ్ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

లాంగ్ రేంజ్ వెర్షన్‌ 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 421 కిలోమీటర్ల పరిధిని అందించగలదు. లాంగ్ రేంజ్ వేరియంట్స్‌ 122 bhp పవర్ మరియు 190 nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక లో రేంజ్ వేరియంట్‌ 81 bhp పవర్ మరియు 114nm గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేయగల ఎలక్ట్రిక్ మోటార్‌ని అమర్చారు.

3.3 కిలోవాట్ల వాల్ బాక్స్ ఛార్జర్ మరియు 7.2 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జర్ వంటి రెండు ఛార్జర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పంచ్ ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. 50 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 56 నిమిషాల్లో 10-80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఫీచర్ల విషయానికి వస్తే, టాటా పంచ్ ఈవీ ఇన్ఫోటైన్‌మెంట్‌ మరియు ఇనూస్ట్రూమెంటేషన్ కోసం డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్స్‌ని అందిస్తుంది.

ఈ కారులో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, ఆప్షనల్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, జువెలరీ రోటరీ డ్రైవ్ సెలెక్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీల కెమెరా, ఆటో-హోల్డ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కనెక్టెడ్ కార్ టెక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్ లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా పంచ్ ఈవీ ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభమౌతోంది.

Tata-Punch-Bncap

రేంజ్ టాపింగ్ వేరియంట్ ధర రూ.15.49 లక్షలుగా ఉంది. పైన తెలిపిన వన్నీ (ఎక్స్ షోరూమ్ ధరలు). టాటా పంచ్ ఈవీ ఇండియన్ మార్కెట్‌లో సిట్రోయెన్ EC3కి గట్టి పోటీని ఇస్తుంది. గత ఒకటి, రెండు నెలల్లో పంచ్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా పంచ్‌ నిలిచింది. ఇప్పుడు మరో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందడంతో సేల్స్ పెరిగే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, June 13, 2024, 14:53 [IST]
English summary
Tata punch ev got 5 star rating bharat ncap crash test
Read more on: #tata motors #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+