Tata Punch EV ఇంటీరియర్ లుక్ చూశారా.. వైరల్ అవుతున్న ఫొటోలు..!
టాటా పంచ్ ఈవీ త్వరలో భారత్ మార్కెట్‌లో విడుదల కానుంది. ఇప్పటికే టాటా నుంచి Tata Tiago EV, Tata Nexon EVల అందుబాటులో ఉన్నాయి. తాజాగా టాటా పంచ్ ఈవీ ద్వారా ఈవీ మార్కెట్‌లో సత్తా చాటేందుకు టాటా సిద్ధం అవుతోంది.
టాటా పంచ్ ఈవీ తాజాగా డీలర్‌షిప్‌కు చేరుకుంది. ఈ కారు ఇంటీరియర్ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సాధారణ టాటా పంచ్ వాహనంతో పోలిస్తే.. పంచ్ ఈవీ లోపలి భాగంలో అనేక మార్పులను గమనించవచ్చు. టెక్నాలజీ పరంగా మెరుగైన ఫీచర్లు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. టాటా నెక్సాన్ ఈవీలో ఉన్న చాలా ఫీచర్లు.. పంచ్ ఈవీలోను ఉన్నాయి.

టాటా పంచ్ ఈవీ 10.2 అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు 10.2 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను పొందనుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే మరియు Arcade.ev సూట్‌లను సపోర్టు చేస్తుంది. పంచ్ ఈవీ 2-స్పోక్ స్టీరింగ్ వీల్.. నెక్సాన్ EVకి ఇల్యూమినేటెడ్ లోగోను కలిగి ఉంటుంది. టచ్ అండ్ టోగుల్ హెచ్‌వీసీ కంట్రోల్‌తో కొత్త సెంటర్ కన్సోల్ అందించింది.
టియాగో, టిగోర్ పోలిస్తే ఇవి గణనీయమైన అప్‌గ్రేడ్‌గా పరిగణించవచ్చు. దీంతోపాటు టాటా పంచ్ ఈవీ డిస్క్ బ్రేక్‌లను కూడా కలిగి ఉంటుంది. టాటా స్టాండర్డ్ పంచ్ ఈవీ.. లాంగ్ రేంజ్ బ్యాటరీ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. 3.3kW AC ఛార్జర్ లేగా ఫాస్ట్ 7kW AC ఛార్జర్‌లు ఉన్నాయి.

టాటా పంచ్ ఈవీ ఛార్జింగ్ పోర్టు ముందు భాగంలో ఉంటుంది. ఇది సైడ్ పోర్ట్ కంటే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మరియు Acti.ev ప్లాట్‌ఫాంపై రూపొందించబడింది. పంచ్ ఈవీ ఆఫ్ రోడ్ సామర్థ్యాలను పరీక్షించే వీడియో టీజర్‌ను సంస్థ తాజాగా విడుదల చేసింది. కఠినమైన రోడ్లపై ఎంతో సునాయాసంగా ప్రయాణించడం గమనించవచ్చు.
టాటా పంచ్ ఈవీ లోపలి భాగం డ్యూయల్ టోన్ అప్హోల్స్టరీ, AQS డిస్‌ప్లేతో కూడిన ఎయిర్ ఫ్యూరిఫైయర్ కూడా ఉన్నాయి. ఆటో ఫోల్డ్ ORVM, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, సన్‌రూఫ్ కూడా ఉంటుంది.

దీంతోపాటు క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, 6-ఎయిర్ బ్యాగ్‌లను కలిగి ఉంటుంది. ఈ టాటా పంచ్ ఈవీ 300 కి.మీ రేంజ్ మరియు 600 కి.మీ రేంజ్ అందిస్తాయని భావిస్తున్నారు. టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ.12 లక్షలు (ఎక్స్‌షోరూం). అదే హైఎండ్ మోడల్ రూ.14 లక్షలు (ఎక్స్‌షోరూం) గా ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








