Tata Punch EV 421 కి.మీ రేంజ్‌తో టాటా పంచ్ ఈవీ లాంచ్.. ధర రూ. 10.99 లక్షలు
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ దూసుకుపోతోంది. దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాటా టియాగో, నెక్సాన్, టిగోర్ ఈవీలు ఇప్పటికే ప్రజాదరణ పొందగా.. నేడు కొత్త టాటా పంచ్ ఈవీ(Tata Punch EV)ని విడుదల చేసింది. ధర, ఫీచర్లు పూర్తి సమాచారం ఈ కథనంలో..
దేశంలో మోస్ట్ అవైటెడ్ ఎలక్ట్రిక్ కారు టాటా పంచ్ ఈవీ(Tata Punch EV Launch) నేడు విడుదలైంది. రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో టాటా మోటార్స్ విడుదల చేసింది. ఈ కారును రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో ఐదు వేరియంట్లలో సంస్థ ప్రవేశపెట్టింది. టాటా పంచ్ ఈవీ లాంచ్‌తో టాటా మోటార్స్ ప్రస్తుతం దాని పోర్ట్‌ఫోలియోలో నాలుగు ఆల్-ఎలక్ట్రిక్ మోడళ్లను కలిగి ఉండటం విశేషం.

టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు డిజైన్ విషయానికొస్తే.. ఎక్స్‌టీరియర్ పరంగా పంచ్ EV దాని ICE మోడల్ మాదిరిగానే ఉంటుంది. అయినప్పటికీ ఇది నెక్సాన్ EV నుంచి కొన్ని అప్‌గ్రేడ్లను తీసుకుంటుంది. ఫుల్ విడ్త్ LED లైట్ బార్, స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్‌లతో కూడిన వర్టికల్ స్లాట్ నమూనాతో కూడిన గ్రిల్ ఆకర్షణీయంగా ఉంది. అంతే కాకుండా ఏరో-డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ మరింత లుక్‌ను జోడిస్తుంది.
కాగా టాటా పంచ్ EV ఛార్జింగ్ ఫ్లాప్‌ను మోటరైజ్డ్ ఓపెనింగ్/క్లోజింగ్ మెకానిజంతో ముందు భాగంలో ఏర్పాటు చేశారు. ఇక కలర్స్ విషయానికొస్తే టాటా పంచ్ ఆకర్షణీయమైన 10 రంగు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో నాలుగు మోనోటోన్‌లు కాగా సీవీడ్ గ్రీన్, డేటోనా గ్రే, ఫియర్‌లెస్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్ మరియు ప్రిస్టైన్ వైట్ వంటి కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

టాటా పంచ్ ఈవీ ఫీచర్ల విషయానికొస్తే.. పంచ్ ICE వెర్షన్‌తో పోలిస్తే మరిన్ని ఫీచర్ల ప్యాక్‌గా ఉంది. పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో ట్విన్-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు టచ్ కెపాసిటివ్ బటన్‌లతో రీడిజైన్ చేయబడిన HVAC ప్యానెల్‌ను కలిగి ఉంది.
వీటితో పాటు టాటా పంచ్ ఈవీలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, జ్యువెల్డ్ గేర్ సెలెక్టర్ డయల్ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల(Tata Punch EV Safety Features) పరంగా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ స్పాట్ మానిటర్ మరియు 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ABS, ESC, అన్ని సీట్లకు మూడు-పాయింట్ సీట్ బెల్ట్‌లు, ISOFIX మౌంట్‌ల వంటి భద్రతా ఫీచర్లను కలిగి ఉంది.

టాటా పంచ్ EV బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. ఒక బ్యాటరీ ప్యాక్ స్టాండర్డ్ రేంజ్(Tata Punch EV Standard Range SR) వెర్షన్‌తో 25 kWh యూనిట్‌తో వస్తుంది. 315 km రేంజ్‌ను ఇస్తుందని సంస్థ తెలిపింది. కాగా మరొకటి లాంగ్ రేంజ్(Long Range LR) ట్రిమ్‌లో 35 kWh యూనిట్ 421 km రేంజ్‌గా సంస్థ వెల్లడించింది.
పంచ్ EV DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుండగా.. 50kW DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 56 నిమిషాల్లో 10- 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. కాగా లాంగ్ రేంజ్ వేరియంట్‌లలో 122 hp, 190 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక స్టాండర్డ్ రేంజ్ వేరియంట్‌లలో 81 hp, 114Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి అవుతుంది.

టాటా పంచ్ ఈవీ(Tata Punch EV Price) లాంగ్ రేంజ్ వేరియంట్‌లో 9.5 సెకన్లలోపు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. స్టాండర్డ్ రేంజ్ వేరియంట్ 13.5 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. కాగా టాటా పంచ్ ఈవీ ధరలు వేరియంట్ల వారీగా ఇలా ఉన్నాయి.

టాటా పంచ్ ఈవీ స్మార్ట్ వేరియంట్(Tata Punch Smart) ధర రూ. 10.99 లక్షలు కాగా, స్మార్ట్+(Smart+) ధర రూ. 11.49 లక్షలుగా ఉంది. అడ్వెంచర్(Adventure) వేరియంట్‌లో స్టాండర్ట్ రేంజ్ ధర రూ. 11.99 లక్షలు, లాంగ్ రేంజ్ వేరియంట్ రూ. 12.99 లక్షలుగా సంస్థ తెలిపింది.
టాటా పంచ్ ఈవీ ఎమ్‌పవర్డ్(Empowered) వేరియంట్ స్టాండర్డ్ రేంజ్ రూ. 12.79 లక్షలు కాగా, లాంగ్ రేంజ్ రూ. 13.99 లక్షలు గా ఉంది. ఎమ్‌పవర్డ్+(Empowered) వేరియంట్‌లో స్టాండర్డ్ రేంజ్ రూ. 13.29 లక్షలు కాగా ఎమ్‌పవర్డ్ ప్లస్‌లో లాంగ్ రేంజ్ వేరియంట్ రూ. 14.49 లక్షలుగా టాటా మోటార్స్ వెల్లడించింది.

కాగా ఈ ధరలన్నీ ఎక్స్ షోరూమ్.టాటా పంచ్ ఈవీని కొత్త ఎలక్ట్రిక్ కార్ ఆర్కిటెక్చర్‌పై నిర్మించారు. టాటా పంచ్ ఈవీ కారు బుకింగ్‌లు గత నెలలలోనే ప్రారంభమయ్యాయి. రూ. 21,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి కారును బుక్ చేసుకోవచ్చు. మార్కెట్లో ఎంజీ కామెట్, సిట్రోయెన్ eC3 ఎలక్ట్రిక్ కార్లకు టాటా పంచ్ ఈవీ గట్టి పోటీనిస్తుంది.


Click it and Unblock the Notifications








