కస్టమర్‌కి రూ. 25 లక్షల బర్త్‌డే గిఫ్ట్.. కాసేపు షాక్‌లో ఓనర్.. మీరు నిజంగా నమ్ముతున్నారా?
కస్టమర్లను ఆకట్టుకోవడంలో టాటా మోటార్స్ స్టైల్ వేరే అని చెప్పాలి. ఆఫర్లు, ఇతర సర్‌ప్రైజ్ విషయాల్లో వినియోగదారులను ఆ సంస్థ ఏమాత్రం నిరాశకు గురి-చేయదు. తాజాగా ఆ కారు మోడల్స్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ దూసుకుపోతున్నాయి. సేఫ్టీలోనూ ఈ కారు టాప్‌లో ఉన్నాయి. తాజాగా భారత్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో టాటా నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, సఫారీ, హారియర్ కార్లు 5 స్టార్ రేటింగ్‌తో దుమ్మురేపాయి. తక్కువ ధరలో అధిక ప్రీమియం అందించే విధంగా టాటా కార్లను ఉత్పత్తి చేస్తుంది. వేరియంట్ ధర పెరిగే కొద్దీ, మీ కార్లకు అదనపు ఫీచర్లు జోడించబడతాయి. టాటా కారులోని అలాంటి ఫీచర్ ఓ కస్టమర్ హృదయాన్ని ఎలా గెలుచుకుందో తెలుసా?
ఓ యజమాని పుట్టినరోజున టాటా పంచ్ ఈవీలోకి రోజువారి మాదిరిగానే వెళ్లగానే కారు డ్యాష్ బోర్డుపై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. మరి ఆ ట్విస్ట్ ఏంటో చూసేముందు కారు ఎలా పలకరించిందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. టాటా కార్లలో మీ ప్రొఫైల్ వివరాలను జోడించవచ్చు. ఉదాహరణకు మీ పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలను మెన్షన్ చేయాల్సి ఉంటుంది.

అలా అందులో సేకరించిన వివరాల ఆధారంగా కారు మీకు బర్త్ డే విషెష్ తెలియజేస్తుంది. ట్విస్ట్ ఏంటంటే కారు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్‌లో తన కారును చూపించింది. అయితే అక్కడ టాటా పంచ్ ఈవీ డిస్ప్లే అవ్వాలి. కానీ అక్కడ టాటా హారియర్‌ని చూపించింది. డ్యాష్ బోర్డుపై ఖరీదైన కారు కనిపించడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ కారుని గెలుచుకున్నట్లుగా భావించాడు.
ఆ తర్వాత అది కేవలం టెక్నికల్ లోపమని గుర్తించి కాసేపు ఆనందాన్ని పొందాడు. ఈ అంశం ప్రస్తుతం ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయితే అది అబద్ధమని తెలిసినా పుట్టినరోజున ఈ విధంగా కాసేపు సర్‌ప్రైజ్ చేసిందని మరికొందరు ఇంటర్‌నెట్‌లో రాసుకొచ్చారు. నిజంగా ఓనర్ కారు గెలిచినట్లు భావించి కాసేపు ఆనందంలో పరవశించిపోయి ఉంటాడని అన్నారు.

టాటా పంచ్ ICE మరియు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అందుబాటులో ఉన్నాయి. డిజైన్‌లో పెద్దగా మార్పులు ఉండవు. పరిమాణం మరియు ఇతర డిజైన్ డిజైన్లలో రెండు కార్లు ఒకే రీతిన ఉంటాయి. ఈ రెండిటి మధ్య ప్రధాన తేడా ఇంజిన్, ఎలక్ట్రిక్ వెర్షన్ అని చెప్పాలి. అయితే ఈ కారు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో అదనపు స్మార్ట్ ఫీచర్లను జోడించారు. దీంతో స్మార్ట్ రైడింగ్ అనుభూతిని పొందుతారు.
టాటా పంచ్ ఈవీ రెండు వేరియంట్లలో వస్తుంది. ఒకటి బేస్ వేరియంట్, రెండోది లాంగ్ రేంజ్ ఈవీగా ఉంది. బేస్ వేరియంట్ ఈవీ 25 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ బ్యాటరీ సహాయంతో కారు 315 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది 80.46 bhp మరియు 114nm టార్క్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

టాటా పంచ్ ఈవీ మరొక లాంగ్ రేంజ్ వేరియంట్‌లో 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బ్యాటరీ 421 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇక ఫర్ఫామెనస్ విషయానికి వస్తే 120.7 bhp మరియు 190 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. టాటా పంచ్ ఈవీ అన్ని వేరియంట్లు 3.3 కిలోవాట్ల ఛార్జర్‌తో వస్తాయి.
బేస్ వేరియంట్‌ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 9.4 గంటలు మరియు లాంగ్-రేంజ్ వేరియంట్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 13.5 గంటలు పడుతుంది. ఈ కారు 7.2 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌ని కూడా అందిస్తోంది. ఈ ఛార్జర్‌తో బేస్ వేరియంట్‌ని 3.6 గంటలు మరియు లాంగ్ రేంజ్ వేరియంట్‌ని పూర్తి ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది.


Click it and Unblock the Notifications








