దేశంలో అత్యంత సురక్షితమైన కారు ఇదే.. అన్ని క్రాష్ టెస్ట్‌ల్లో 99 % మార్కులు.. అమ్మకాల్లోనూ జేజమ్మ!
ప్రస్తుతం జనాలు కార్లను కొనేముందు దాని బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా దేశంలో ఎక్కువగా సేఫ్టీ కార్ల ట్రెండ్ మాత్రమే నడుస్తోంది. దీంతో కార్ల తయారీ కంపెనీలు సైతం ఎక్కువగా సేఫ్టీపైనే ఫోకస్ పెడుతున్నాయి. సేఫ్టీలో టాటా మోటార్స్ నంబర్ 1 అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న కార్లన్నీ మంచి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోనే అత్యంత నమ్మదగిన కార్లను అందిస్తూ భారతీయులకు ఓ సెంటిమెంట్‌గా మారింది. ఈ కారు కంపెనీలు అన్ని రకాల సేఫ్టీ టెస్ట్‌ల్లో సత్తా చాటుతున్నాయి.
పైన చెప్పిన విధంగా ఆ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న కార్లలో టియాగో నుంచి సఫారీ వరకు అన్ని కార్లు మంచి సేఫ్టీ రేటింగ్స్‌ని కలిగి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు నిర్వహించిన క్రాష్ టెస్ట్‌ల్లో ఏ టాటా కారు భారీ స్కోర్‌ని సాధించిందో తెలుసా? ఇప్పటి వరకు క్రాష్ టెస్ట్‌లలో 5-స్టార్ రేటింగ్ సాధించిన వాటిలో ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ పంచ్ ఈవీ అదరగొట్టింది.

అవును మీరు విన్నది నిజమే ఆ కంపెనీ నుంచి నెక్సాన్, కార్వ్, సఫారీ హారియర్‌ల కంటే ఎక్కువ స్కోర్‌ని పంచ్ మాత్రమే సాధించింది. అంటే ఈ లెక్కన నెక్సాన్, హారియర్ ఇతర ఫేమస్ లైనప్స్ కంటే పంచ్ ఈవీ సురక్షితమైన కారుగా ఉంది. ఈ మైక్రో-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అన్ని సేఫ్టీ టెస్ట్‌ల్లో మంచి మార్జిన్ స్కోర్‌తో 5-స్టార్ రేటింగ్స్‌ని సాధించింది.
GNCAP క్రాష్ టెస్ట్‌లో అడల్ట్స్ (పెద్దల) ప్రయాణికుల సేఫ్టీలో 32కు 31.46 పాయింట్లు సాధించింది. అదేవిధంగా పిల్లల సేఫ్టీలోలో 49కి 45 పాయింట్లు సాధించి సత్తా చాటింది. ఇప్పటి వరకు టాటా కార్లు ఎదుర్కొన్న క్రాష్ టెస్ట్‌ల్లో మరే ఇతర టాటా కారు ఈ స్కోర్‌ని సాధించలేదు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం టాటా మోటార్స్ ప్రత్యేక ప్లాట్‌ఫామ్ యాక్టి.ఈవీ ఆధారంగా రూపొందించారు.

ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ కారుగా పంచ్ ఈవీ నిలిచింది. ఇందులో సేఫ్టీ విషయానికి వస్తే ఆరు ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లను స్టాండర్డ్‌గా అందించారు. పంచ్ ఈవీ స్మార్ట్, స్మార్ట్ ప్లస్, అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్ ప్లస్ అనే ఐదు వేరియంట్లలో లభిస్తుంది.
ఈ తాజా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో కొనుగోలు చేయవచ్చు. ఇది చూడటానికి ఆకర్షణీయమైన లుక్‌లో ఉంటుంది. దీని స్టాండర్డ్ వేరియంట్‌లలో 25 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, లాంగ్ రేంజ్ వేరియంట్ 35 కిలోవాట్ల బ్యాటరీతో వస్తుంది. ఈ పంచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ స్టాండర్డ్ వెర్షన్ 315 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. లాంగ్-రేంజ్ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 421 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది.

దీనిని 7.2 kWh ఏసీ ఫాస్ట్ ఛార్జర్‌తో 5 గంటల్లో 0 నుంచి 100 శాతం ఛార్జింగ్ చేయవచ్చు. అలాగే 50 kWh డీసీ ఛార్జర్ సహాయంతో దీనిని కేవలం 56 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. ఈవీని ఈవీ ధరలు రూ .9.99 లక్షల నుంచి రూ .14.29 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి.
ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, వైర్‌లెస్ ఛార్జర్, 10.25-టచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫైయర్, సింగిల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్లైండ్ స్పాట్ మానిటర్, 360 డిగ్రీల సరౌండ్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి.

దీంతో పాటు రీజియన్ మోడ్స్ కోసం ప్యాడిల్ షిఫ్టర్స్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, టచ్ బేస్డ్ HVAC ప్యానెల్ వంటి ఫీచర్లు ఈ కారుని ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇందులో ఇంకా మరెన్నో స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఫీచర్లు, సేఫ్టీతో పంచ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా మోటార్స్ నుంచి అత్యంత సురక్షితమైన ఈవీగా నిలిచింది.


Click it and Unblock the Notifications








