Tata Punch EV టాటా పంచ్ ఈవీ ఆవిష్కరణ.. కీలక భద్రతా ఫీచర్లు సహా 300 కి.మీ రేంజ్??
టాటా మోటార్స్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా పంచ్ ఈవీ (Tata Punch EV) నేడు సంస్థ ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ గుర్తింపు పొందింది. ఇప్పటికే ప్యాసింజర్ కార్లు టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీలతో ఈ సెగ్మెంట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ దేశీయ బ్రాండ్ మరో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని చూస్తుంది.
భారత మార్కెట్లో టాటా పంచ్ ఐసీఈ (Tata Punch) వెర్షన్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కూడా టాటా మోటార్స్ విడుదల చేయనుంది. భారతీయ కస్టమర్లలో టాటా పంచ్ ఈవీ భారీ అంచనాలను కలిగి ఉంది. త్వరలో ఈ కారు విడుదల తేదీపై ప్రకటన రానుంది. ఈ క్రమంలో టాటా పంచ్ ఈవీకి సంబంధించి పూర్తి సమాచారం ఈ కథనంలో..

టాటా పంచ్ EV స్మార్ట్ (Smart), స్మార్ట్+(Smart +), అడ్వెంచర్ (Adventure), ఎంపవర్డ్ (Empowered) మరియు ఎంపవర్డ్ +(Empowered +) అనే మొత్తం 5 వేరియంట్‌లలో ఈ కారు అందుబాటులోకి రానుంది. ఇక ఫీచర్లు, భద్రతా పరంగా టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు ఏ మాత్రం రాజీపడలేదు.
డిజైన్ విషయానికొస్తే టాటా పంచ్ ఈవీ R16 డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, LED హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డిజిటల్ DRLలు మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌లతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంటీరియర్ పరంగా ఈ కారును అధునాతనంగా రూపొందించారు. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. వేరియంట్లను బట్టి ఫీచర్లు మారుతుంటాయని గమనించాలి.

టాటా పంచ్ ఈవీలో సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్(Airbags)లను పొందుపరిచారు. ఇంకా క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ సెల్ ఫోన్ ఛార్జర్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, బ్లైండ్ స్పాట్ మానిటర్ మరియు 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా ఫీచర్లు ఉన్నాయి.
కాగా టాటా పంచ్ ఈవీ బ్యాటరీ ప్యాక్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక సమాచారాన్ని సంస్థ ప్రకటించలేదు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు 2 బ్యాటరీ ఎంపికలతో అందించబడుతుందని సమాచారం. ఈ కారు స్టాండర్డ్ మరియు లాంగ్ రేంజ్ అనే 2 మోడళ్లలో అందుబాటులోకి రానుంది. దీనిలో, ప్రామాణిక మోడల్ చిన్న బ్యాటరీతో.. తక్కువ రేంజ్‌తో రానున్నట్లు సమాచారం.

టాటా పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ మోడల్ కొంచెం పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని ద్వారా రేంజ్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి దీని డ్రైవింగ్ పరిధి కొంచెం ఎక్కువగా ఉంటుంది. టాటా పంచ్ కనీసం 300 కి.మీల డ్రైవింగ్ రేంజ్‌తో విడుదల కావొచ్చు. బ్యాటరీ ప్యాక్‌లు 25 కిలోవాట్లు, 35 కిలోవాట్లుగా ఉంటాయని అంచనా.
బ్యాటరీ ఎంపికల ప్రకారం, టాటా పంచ్ EV ఎలక్ట్రిక్ కారు ధర ఎంత? అనేది కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, కొన్ని రోజుల్లో, బహుశా ఈ జనవరి చివరి నాటికి, టాటా పంచ్ EV ఎలక్ట్రిక్ కారు ధర ఎంత? అధికారికంగా ప్రకటించి అధికారికంగా ప్రారంభించాలని భావిస్తున్నారు.
టాటా పంచ్ EV ఎలక్ట్రిక్ కారు కేవలం రూ. 10 లక్షలు ఉంటుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారును అధికారికంగా లాంచ్ చేసిన రోజు పూర్తి సమాచారం వెల్లడి కానుంది. కాగా టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కొనుగోలు చేయాలనుకునేవారు సంస్థ అధికారిక వెబ్‌సైట్ లేదా సమీప డీలర్ షిప్‌ను సందర్శించవచ్చు.


Click it and Unblock the Notifications








