టాటా పంచ్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ విడుదల.. ప్రారంభ ధర రూ. 6 లక్షలు, తక్కువ ధరలో భారీ ఇంటీరియర్‌ ఫీచర్లు

టాటా పంచ్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ నేడు అధికారికంగా విడుదల అయ్యింది. వేరియంట్ల వారీగా అదనపు ఫీచర్లను జోడించి ఈ కారుని టాటా మోటార్స్ మార్కెట్‌లో ప్రవేశ పెట్టింది. కొత్తగా విడుదలైన ఈ టాటా పంచ్‌ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ రూ. 6.12 లక్షల (ఎక్స్-షోరూమ్‌) నుంచి టాప్‌ ఎండ్ ధర రూ. 9.45 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) ధర మధ్య ఉన్నాయి. ఈ పంచ్‌ కొనుగోలుపై రూ. 18,000 వరకు బెనిఫిట్స్‌ని పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఈ అప్‌డేటెడ్‌ పంచ్‌ని కంపెనీ అధికారికి వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన బుకింగ్స్‌ ఇప్పటికే ఆరంభం అయినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ అప్‌డేటెడ్‌ ఎస్‌యూవీకి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

ప్రస్తుతం టాటా పంచ్‌ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా ఉంది. అతి తక్కువ కాలంలో ఈ కారు 4 లక్షల సేల్స్‌ మైల్‌స్టోన్‌ని సాధించింది. రాబోయే పండుగ సీజన్ ఈ కంపెనీ సేల్స్‌కి మరింత ఊతం అందిస్తుందని టాటా భావిస్తోంది. కంపెనీ అందించే ఆఫర్లు, ఇతర బెనిఫిట్స్‌తో ఈ సరికొత్త టాటా పంచ్‌ని ఇంటికి తీసుకెళ్లవచ్చు. సిట్రోయిన్‌ C3, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లతో పాటు మరికొన్ని కార్లతో పోటీపడుతుంది.

Tata Punch Facelift Version Launch

ఇక ఈ 2024 పంచ్ కారు ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌లో కొన్ని సరికొత్త ఫీచర్లతో అప్‌డేట్‌ చేసింది. ఇందులో సెంట్రల్ కన్సోల్‌లో యూఎస్‍బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన కొత్త 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. అంతే కాకుండా వైర్‌లెస్ ఛార్జర్, రియర్ ఏసీ వెంట్స్, కారు ముందు వరుసలో ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లతో వస్తుంది.

ఈ పంచ్‌ కార్లలో ఎక్స్‌టీరీయర్‌, ఇతర కాస్మోటిక్‌ అప్‌డేట్స్ లేవు. కేవలం అదనపు ఫీచర్లను మాత్రమే టాటా అందించనుంది. పవర్‌ట్రైయిన్‌లోనూ ఎటువంటి తేడాలు లేవు. అతి తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వస్తున్న మైక్రో ఎస్‌యూవీగా పంచ్‌ నిలువనుంది. అడ్వెంచర్‌ వేరియంట్‌లో ఈ సన్‌రూఫ్‌ ఫీచర్‌ని టాటా అందిస్తోంది. ఈ అప్‌డేటెడ్‌ పంచ్ కారు అన్ని రకాల వేరియంట్లు ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటాయి.

Tata Punch Facelift Version Features

ఇది ప్యూర్, ప్యూర్ (O), అడ్వెంచర్, అడ్వెంచర్ రిథమ్, అడ్వెంచర్ ఎస్‌, అడ్వెంచర్+ ఎస్‌, అకాంప్లిష్డ్ ప్లస్‌, అకాంప్లిష్డ్+ ఎస్‌, క్రియేటివ్+, క్రియేటివ్+ ఎస్ వేరియంట్లలో ఈ కారు కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం పంచ్‌ విక్రయించబడుతున్న కారు ఎన్ని కలర్లలో అందుబాటులో ఉందో అవే కలర్స్‌ 2024 ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ లోనూ అందిస్తుంది. కచ్చితంగా ఈ కార్లకు ఉన్న డిమాండ్‌ కంపెనీకి మరింత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం టాటా పంచ్‌ 1.2-లీటర్, 3-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్‌ 5-స్పీడ్ మాన్యువల్, AMT ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లతో వస్తుంది. ఇదే కారు సీఎన్‌జీ వెర్షన్‌లోనూ అందుబాటులో ఉంది. ఇది డ్యూయల్‌ సిలిండర్‌ టెక్నాలజీతో ప్రవేశ పెట్టింది. ఈ పంచ్‌ ఎలక్ట్రిక్‌ వెర్షన్‌లోనూ లభిస్తుంది. ఇది ఫుల్‌ ఛార్జ్‌పై 315 కి.మీ నుంచి 421 కి.మీ రేంజ్‌ని అందిస్తుంది.

Tata Punch Facelift Infotainment

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 17, 2024, 17:30 [IST]
English summary
Tata punch facelift launched at rs 6 12 lakhs with newly added features
Read more on: #tata motors #new cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+