Tata Punch కారు మరో ఘనత.. 3 లక్షల యూనిట్ల ఉత్పత్తితో రికార్డు..!
టాటా మోటార్స్ భారత్ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ సంస్థగా ఉంది. ఈ సంస్థ అనేక ప్రజాదరణ కలిగిన కార్లను కలిగి ఉంది. రోజురోజుకు అనేక రికార్డులను సృష్టిస్తోంది. మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా పంచ్ 2021 అక్టోబర్ నుంచి భారత్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. తాజాగా టాటా పంచ్ కారు వార్తల్లో నిలిచింది.
మైక్రో ఎస్‌యూవీ విభాగంలో టాటా పంచ్ కారు మెరుగైన పనితీరును కనబరుస్తోంది. తాజాగా ఈ కారు సరికొత్త మైలురాయిని చేరుకుంది. భారత్‌లో 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరుకుంది. కేవలం 26 నెలల కాలంలో ఈ రికార్డును సొంతం చేసుకుంది.

టాటా పంచ్ మైక్రో SUV ధర : భారత్ మార్కెట్‌లో టాటా పంచ్ మైక్రో SUV ప్రారంభ ధర రూ.6 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. అదే టాప్ ఎండ్ వేరియంట్ రూ.10.10 లక్షలుగా (ఎక్స్‌షోరూం) ఉంది. ప్యూర్, అడ్వెండర్, అకాంప్లిష్డ్, క్రియేటివ్ వేరియంట్లలో లభిస్తుంది.
టాటా పంచ్ మైక్రో SUV ఇంజిన్ వేరియంట్లు..
ఈ కారు పెట్రోల్, CNG వేరియంట్లలో అందించబడతాయి. పెట్రోల్ వెర్షన్‌లో 1.2 లీటర్ 3- సిలిండర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 85bhp శక్తి, 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్ ఆప్షన్‌లో అందించబడుతుంది.

సీఎన్‌జీ వేరియంట్‌లో పెట్రోల్ వెర్షన్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. పనితీరు పరంగా 73bhp శక్తి మరియు 103Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సీఎన్‌జీ వెర్షన్‌లో 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌లో మాత్రమే టాటా పంచ్ వేరియంట్ అందుబాటులో ఉంటుంది.
టాటా పంచ్ మైలేజీ : సీఎన్‌జీ వెర్షన్ 26.99 kg/km మైలేజీని అందిస్తుంది. అదే పెట్రోల్ మాన్యువల్ వెర్షన్‌లో లీటర్‌కు 20.09 మైలేజీని ఇస్తుంది. పెట్రోల్ ఆటోమేటిక్ వెర్షన్‌లు లీటర్‌కు 18.80 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఫీచర్ల పరంగా 7- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ స్టార్ట్ బటన్ వంటి ఫీచర్లున్నాయి.

టాటా పంచ్ వాహనం స్టాండర్డ్ భద్రతా ఫీచర్లతో వస్తుంది. ABS- యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, EBD, రియర్ పార్కింగ్ సెన్సార్లు, సెంట్రల్ లాకింగ్ వంటి కీలక ఫీచర్లను కలిగి ఉంటాయి. అదే హై ఎండ్ మోడళ్లు హోం హెడ్‌ల్యాంప్, యాంటీ గ్లేర్ రియర్‌వ్యూ మిర్రర్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
టాటా పంచ్ 2021లో గ్లోబల్ NCAP క్రాష్ పరీక్షలను ఎదుర్కొంది. పెద్దల రక్షణలో 17 పాయింట్లకు గానూ 16.45 పాయింట్లను సాధించి, దేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన కారుగా నిలిచింది. అదే విధంగా చిన్నారుల రక్షణలో 49 పాయింట్లకు 40.89 స్కోర్‌ను సొంతం చేసుకుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








